Tire The Eyes : పుస్తకాలతో గంటల కొద్దీ గడిపేస్తున్నారా? కళ్లు అలసి పోకుండా జాగ్రత్తలు అవసరం

సూర్యకిరణాల ప్రభావం వల్ల కళ్లు త్వరగా అలసిపోతాయి. దానికి బదులు నీడలో చదవడం మంచిది. కొందరు పడుకొని చదువుతుంటారు. దీని వల్ల కళ్లు లాగేస్తుంటాయి. అందుకే కుర్చీలో కూర్చుని, లేకుంటే గోడకు ఆనుకొని చదువుకోవడం అలవాటు చేసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Tire The Eyes : పుస్తకాలతో గంటల కొద్దీ గడిపేస్తున్నారా? కళ్లు అలసి పోకుండా జాగ్రత్తలు అవసరం

Spending hours with books

Tire The Eyes : చదువులూ, పోటీ పరీక్షలు అంటూ విద్యార్ధులు పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటారు. మరి దీని వల్ల కళ్లు అలసిపోవడం, తలనొప్పి, కంటి సమస్యలు తలెత్తుతాయి. అలా జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గదిలో లైటు కాంతి కాగితం మీద పడకుండా చూసుకోవాలి. దానికి కాస్త దూరంగా కూర్చుని చదువుకోవాలి.

పగటి పూట చదువుకొనేటప్పుడు కిటికీలకూ దూరంగా కూర్చోవాలి. కిటికీ అద్దాల వెలుతురు కళ్ల మీద పడకుండా చూసుకోవాలి. అది కళ్లకు హాని చేస్తుంది. చదువుకొనేటప్పుడు తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. చల్లటి నీళ్లూ, ఒక మెత్తటి వస్త్రం పక్కన పెట్టుకోవాలి. కళ్లు మంటగా అనిపించిన ప్రతిసారీ ఆ వస్త్రాన్ని నీళ్లలో ముంచి కళ్ల మీద పెట్టుకోవాలి. ఫలితంగా కళ్ల వాపులు రాకుండా ఉంటాయి. చల్లదనం వల్ల నరాలకు ఉపశమనం కలుగుతుంది. అలసట తొలగిపోతుంది.

ఆరుబయట నడుస్తూ చదువుకొనే అలవాటు కొందరికి ఉంటుంది. కానీ సూర్యకిరణాల ప్రభావం వల్ల కళ్లు త్వరగా అలసిపోతాయి. దానికి బదులు నీడలో చదవడం మంచిది. కొందరు పడుకొని చదువుతుంటారు. దీని వల్ల కళ్లు లాగేస్తుంటాయి. అందుకే కుర్చీలో కూర్చుని, లేకుంటే గోడకు ఆనుకొని చదువుకోవడం అలవాటు చేసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మెడ నొప్పి వంటి సమస్యలు నివారించవచ్చు. ఏకాగ్రత కుదురుతుంది. రోజుకు పదహారు గంటలు చదివే వాళ్లు వైద్యుల సలహా మేరకు అద్దాలు ఉపయోగించటం శ్రేయస్కరం.