Sputnik V Saftey : 60ఏళ్లు పైబడినవారిలో స్పుత్నిక్-V వ్యాక్సిన్ సేఫ్.. ఆస్పత్రి కేసులు లేవు!

రష్యా కొవిడ్ స్పుత్నిక్-V వ్యాక్సిన్ క్యాంపెయిన్‌లో 60 ఏళ్లు పైబడిన వారిలో టీకా సమర్థవంతంగా లేదా సమానంగా ప్రభావం చూపిందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) ప్రకటించింది.

Sputnik V Saftey : 60ఏళ్లు పైబడినవారిలో స్పుత్నిక్-V వ్యాక్సిన్ సేఫ్.. ఆస్పత్రి కేసులు లేవు!

Sputnik V Shows Strong Safety Profile

Sputnik V Saftey : రష్యా కొవిడ్ స్పుత్నిక్-V వ్యాక్సిన్ క్యాంపెయిన్‌లో 60 ఏళ్లు పైబడిన వారిలో టీకా ఎక్కువ లేదా సమానంగా ప్రభావం చూపిందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) ప్రకటించింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుల్లో సురక్షితమని తేలిందని, ఆస్పత్రిలో చేరే కేసులు కూడా నమోదు కాలేదని అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

మార్చి 4 నుండి ఏప్రిల్ 8 వరకు శాన్ మారినోలో నిర్వహించిన అధ్యయనంలో ఒకటి లేదా రెండు మోతాదుల స్పుత్నిక్ V అందించినట్టు పేర్కొంది. ఈ అధ్యయన ఫలితాలను ది లాన్సెట్ ప్రచురించిన ఓపెన్-యాక్సెస్ క్లినికల్ జర్నల్ EClinicalMedicineలో ప్రచురించారు.

ప్రస్తుత అధ్యయన ఫలితాలు.. మునపటి ఫేజ్-1, ఫేజ్-2 ఫలితాలకు సమానంగా ఉన్నాయని తెలిపింది. మూడో దశ ఫలితాలతోనే వ్యాక్సిన్ భద్రతపై స్పష్టత వచ్చిందని పేర్కొంది. ఈ టీకా తీసుకున్న వారిలో ఆస్పత్రిలో చేరడం లేదా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.

ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా Sputnik V సహా మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే స్పుత్నిక్ వి టీకాకు అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది.