Migraine : మైగ్రేన్‌తో బాధపడుతున్నారా?.. అయితే ఇవి తినడం తగ్గించండి

మైగ్రేన్ తలనొప్పి అనేది చాలామంది ఎదురుకుంటున్న సమస్య.. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు భరించలేని బాధను అనుభవిస్తుంటారు.

Migraine : మైగ్రేన్‌తో బాధపడుతున్నారా?.. అయితే ఇవి తినడం తగ్గించండి

Migraine

Migraine : మైగ్రేన్ తలనొప్పి అనేది చాలామంది ఎదురుకుంటున్న సమస్య.. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు భరించలేని బాధను అనుభవిస్తుంటారు. చాలా మంది నొప్పిని భరించలేక చెవులను మూసి తలవంచుకుని కూర్చోవడం వంటివి చేస్తుంటారు. ఈ నొప్పిని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వారుకూడా ఉన్నారు. కొంచం శబ్దం విన్నా ప్రాణం విలవిలలాడుతోంది. కాంతిని చూడాలంటే ఇబ్బంది పడతారు. వాంతులు అవుతుంటాయి. మైకం కమ్మినట్లుగా అనిపిస్తుంది.

అయితే, మైగ్రేన్‌ ఎందుకు వస్తుందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. జన్యుపరమైన సమస్యల వల్ల, కొన్ని పర్యావరణ కారకాల వల్ల సంభవిస్తుందని కొందరు చెప్తుంటారు. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారు కొన్ని ఆహారాలను దూరం పెట్టడం ద్వారా మైగ్రేన్‌ సమస్య నుంచి బయటపడొచ్చునని నిపుణులు చెప్తున్నారు.

Read More : Top Trolling Videos : మోస్ట్ ట్రోలింగ్ వీడియోస్ ఇవే..!

చాక్లెట్లు : మైగ్రేన్ నొప్పికి చాక్లెట్లు కామన్‌ ట్రిగ్గర్స్‌. చాక్లెట్లు అధికంగా తింటే మైగ్రేన్ తలనొప్పి 22 శాతం అధికంగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

కెఫిన్ : ఈ తలనొప్పి ఉన్నవారు కాఫీ ఎంత తక్కువ తాగితే అంత మంచిది. చాక్లెట్, కాఫీ, టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.

ఆల్కహాల్‌ : మద్యం తీసుకున్న వారికి మైగ్రేన్ వచ్చే అవకాశం 35 శాతం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఆల్కహాల్‌ను తగ్గించడం చాలా మంచిది.

Read More : Auto Driver : ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఆటో డ్రైవర్

కృత్రిమ చక్కెర : అనేక ప్రాసెస్ చేసిన ఆహారాలు కృత్రిమ స్వీటెనర్లతో నిండి ఉంటాయి. ఈ కృత్రిమ చక్కెరలు మైగ్రేన్‌కి కారణం అవుతుంటాయి. వీటిని పూర్తిగా తగ్గించినా వచ్చే నష్టమేమి లేదని వైద్యులు చెబుతున్నారు.

మోనోసోడియం గ్లూటామేట్ఉన్న ఆహారాలు: అమెరికన్ మైగ్రెయిన్ ఫౌండేషన్ ప్రకారం, ఇది తీవ్రమైన మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది.

క్యూర్డ్‌ మీట్స్‌ : రంగు, రుచిని కాపాడే నైట్రేట్లు.. డెలి మాంసాలు, హామ్, హాట్ డాగ్‌లు, సాసేజ్‌లలో కనిపిస్తాయి. ఈ ఆహారాలు రక్తంలోకి నైట్రిక్ ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి. మెదడులోని రక్తనాళాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉంటాయి.

ఏజ్డ్‌ చీజ్ లేదా టైరమైన్ : టైరమైన్ కూడా మైగ్రేన్‌కు ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. ఇది పులియబెట్టిన లేదా పాతబడిన చీజ్‌, సోయా సాస్ వంటి ఆహారాలలో కనిపిస్తుంది.