ఇద్దరు హెయిర్ స్టెయిలిస్టులకు కరోనా వచ్చినా… కస్టమర్లు సేఫ్. కారణం మాస్కులంట!

  • Published By: sreehari ,Published On : July 17, 2020 / 12:13 AM IST
ఇద్దరు హెయిర్ స్టెయిలిస్టులకు కరోనా వచ్చినా… కస్టమర్లు సేఫ్. కారణం మాస్కులంట!

కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే.. సామాజిక దూరాన్ని పాటించాల్సిందే.. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని రద్దీ ప్రాంతాల్లో తిరగొద్దని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కఠినమైన చర్యలు చేపట్టనప్పటికీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

అసింపథిటిక్ (లక్షణ రహిత) కేసులు కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. లాక్ డౌన్ నుంచి భారీగా జుత్తు పెంచేసుకున్న వారంతా కటింగ్ షాపులు తెరవడంతో సెలూన్ల బాట పడుతున్నారు. చాలామంది సామాజిక దూరం, మాస్క్ లు, శానిటైజర్లతో ఎప్పటికప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటేనే ఉన్నారు. కానీ, కరోనా లక్షణాలు కనిపించని వారి నుంచి ఇతరులకు వైరస్ సోకుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.

ఇప్పటివరకూ ఇద్దరు హెయిర్ స్టయిలిస్టుల నుంచి 139 కస్టమర్లకు కరోనా సోకినట్టు అధ్యయనంలో గుర్తించారు. కానీ, కొందరు స్టయిలిస్టులు మాస్క్ ధరించడం వంటి జాగ్రత్త చర్యల ద్వారా కస్టమర్లపై కరోనా ప్రభావం కనిపించలేదని గుర్తించారు.

ఫేస్ కవరింగ్ వంటి మాస్క్ లను ధరించడంతో రెండో దశ కరోనా కేసులు నమోదు కాలేదు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి విడుదల చేసిన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. మిస్సోరిలోని స్ప్రింగ్‌ఫీల్డ్‌లో కరోనా వ్యాప్తిని మాస్క్‌లే నిరోధించాయి.

ఈ పరిశ్రమకు సంబంధించి పలు కార్యకలాపాలను ఎక్కువగా యుఎస్ అంతటా తిరిగి తెరవడానికి దారితీసింది. శాస్త్రీయ సలహాలు, జనాభా, మాస్క్ తో ముఖాన్ని కవర్ చేయడం ద్వారా కరోనావైరస్ వ్యాప్తిని నివారించడంలో సాయపడిందని ఈ అధ్యయనం తేల్చింది. కరోనా సోకిన స్టైలిస్టులతో 15 నుంచి 45 నిమిషాల వరకు కటింగ్ చేయించుకున్నారు.

వీరిలో 139 మంది కస్టమర్లు హెయిర్ కటింగ్స్, ఫేషియల్, హెయిర్ ట్రిమ్మింగ్, పర్మ్ చేయించుకున్నారు. వీరంతా కరోనా బారినపడ్డారు. సెలూన్ దగ్గరకు వచ్చినవారిని ట్రేసింగ్ చేసి పరీక్షించగా వారిలో ఎవరూ అనారోగ్యానికి గురైనట్టు దాఖలాలు కనిపించలేదు. కారణం… వారు ముఖానికి మాస్క్ ధరించి ఉండటమేనని అధ్యయనం తెలిపింది.