Sudden Miscarriage : అకస్మిక గర్భస్రావం.. ఎందుకో తెలుసా?..

గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన జాగ్రత్తలు పాటించటం ముఖ్యం. మందులు, వాడుకుని, విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగు చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మనివ్వవచ్చు.

Sudden Miscarriage : అకస్మిక గర్భస్రావం.. ఎందుకో తెలుసా?..

Early Miscarriage (1)

Sudden Miscarriage : గర్భందాల్చడం అనేది మహిళలకు ఒక వరం లాంటిది. గర్భం దాల్చిన క్షణాలు వారిలో ఎంతో సంతోషాన్ని నింపుతాయి. ఈ మధ్యకాలంలో పెద్ద సంఖ్యలో గర్భస్రావాలు ఎదుర్కొంటున్నారు. గర్భం దాల్చిన మొదటి 13 వారాలలో చాలా గర్భస్రావాలు జరుగుతాయి. గర్భం పొందిన మొదటి త్రైమాసికంలో గర్భస్రావం జరగడానికి అత్యంత సాధారణ కారణం శిశువు క్రోమోజోమ్ వంటి అసాధారణతలు. గర్భాశయంలో అండాలు దెబ్బతినడం లేదా స్పెర్మ్ నాణ్యత, స్పెర్మ్ కౌంట్, మోటిలిటీ వంటి కారకాలు ముఖ్య కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఫలదీకరణ జరిగే ప్రక్రియలో సమస్య ఏర్పడటం కూడా కారణం కావచ్చు.

మహిళల్లో హార్మోన్ సమస్యలు, తల్లి ఆరోగ్యం లేదా ఇన్ఫెక్షన్స్ ప్రభావం కావచ్చు. గర్భం ధరించిన ఇరవై వారాలలోపు స్రావం జరిగితే అది అబార్షన్ లేదా గర్భస్రావం అని చెప్పాలి. సాధారణంగా మొత్తంగా గర్భం అనేది 40 వారాలపాటు మహిళ కలిగి వుంటుంది. గర్భస్రావాలు చాలావరకు 13 వారాలలోపే జరుగుతాయి. కాని కొన్ని సార్లు అకస్మాత్ గా కూడా అబార్షన్ జరిగేందుకు అవకాశాలు ఉంటాయి.

పిండం తయారీలో లోపం అన్నింటికన్నా ముఖ్యం. ఈ లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగి గర్భస్రావమవుతుంది. జన్యుపరమైన కారణాలు ఒక్కోసారి గర్భస్రావానికి కారణమైనా కూడా పదే పదే ఇలా జరగదు. కాబట్టి ఒకసారి గర్భస్రావం అయితే దాని గురించి ఎక్కు వగా కంగారు పడాల్సిన అవసరం లేదు. వరుసనే ఎక్కువ సార్లు గర్భ స్రావం జరగడానికి అనేక కారణా లున్నాయి.

గర్భస్రావానికి కారణాలు…

తల్లి వయసు : 19 నుంచి 24 ఏళ్ల వయసులో గర్భం దాల్చ డానికి అన్నింటి కన్నా క్షేమ మైనా వయసు. 29 ఏళ్ల వరకు పర్వాలేదు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత రిస్కు అధికంగా ఉంటుంది. కనీసం 50 శాతం గర్భస్రావాలకు జన్యుపరమైన సమస్యలు కారణంగా చెప్పవచ్చు. మొదటి మూడు నెలల్లోనే ఇవి చాలావరకు జరుగుతాయి. ప్రతీసారి ఇదే తరహాలో జరగకపోయినా జన్యుపరమైన లోపాలు గలిగిన పిండం ఎదగకుండా గర్భస్రావానికి దారితీయవచ్చు.

పుట్టకతో గర్భకోశంలో ఉన్న లోపాల వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, సర్విక్స్‌ వదులగా ఉండటం, గర్భకోశ ఆకారం పిండం ఎదుగులకు సరిపోకపోవడం, చిన్నగా ఉండటం వంటివి జరగొచ్చు. దీని వల్ల మూడో నెలలోపు లేదా నాలుగు ఐదు నెలల పిండంగా ఉన్నప్పుడు కూడా గర్భస్రావాలు జరిగే అవకాశాలున్నాయి. సర్విక్స్‌ వదులుగా ఉండి గర్భం నిలువకపోవడం అనేది పుట్టుకతో వచ్చిన లోపం మాత్రమే కాకుండా క్రితం జరిగిన ప్రసవంలో చిరిగిపోవడం వల్ల అనేక మార్లు గర్భస్రావం జరగడం వల్ల, ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా గర్భస్రావం అయ్యే అవకాశముంది. పిండానికి ఎలాంటి ఇన్‌ఫెక్షను సోకకుండా సర్విక్స్‌ కాపాడుతుంది. అది వదులు అయినప్పుడు గర్భకోశానికి, పిండానికి సోకే ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా నొప్పులు ముందే మొదలైన గర్భస్రావం జరగొచ్చు.

రక్తం గడ్డకట్టడంలో తేడాలు, ఎపిఎల్‌ఎ సిండ్రోం, ధూమపానం, పెల్విక్‌ ఇన్‌ఫెక్షన్లు, మానసికంగా అశాంతి, ఉద్యోగంలో పనిఒత్తిడి వంటివి కూడా గర్భస్రావానికి దారితీయవచ్చు. కంతులు గర్భకోశం లోపలివైపు ఉన్నప్పుడు పిండం ఎదగడానికి సరైన రక్తప్రసరణ జరగకపోవడం, ముందే కాన్పు, నొప్పులు రావడం అసలు గర్భం ధరించడానికే ఆలస్యం అవడం జరగొచ్చు. ఇవే కంతులు గర్భకోశానికి బయటివైపు ఉన్నప్పుడు గర్భస్రావం జరగడానికి అవకాశం అధికంగా ఉంటుంది.

గర్భస్రావానికి ముందస్తు సంకేతాలు…

గర్భస్రావం అయ్యే ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. పొట్టలో నొప్పి రావటం. పొట్టలో కనుక, ప్రత్యేకించి, ఒకే వైపున నొప్పి వున్నట్లయితే, వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవటం మంచిది. తీవ్రమైన వెన్నునొప్పి వస్తుంది. ఇది సాధారణంగా పీరియడ్స్ లో వచ్చే వెన్నునొప్పి కంటే మరింత అధికంగా ఉంటుంది. ఇలా ఉంటే అనుమానించాలి. బరువు తగ్గడం, తెలుపు,గులాబీ రంగులో గల్ల రావడం. నొప్పితో కూడిన, లేదా లేకుండా బ్రౌన్ లేదా ఎర్రటి రక్త స్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పొట్ట ఉదరంలో కంట్రోల్ చేసుకోలేని విధంగా ఆబ్డోమినల్ పెయిన్ మరియు తిమ్మెరిగా అనిపించినప్పుడు వెంటనే గైనిక్ ను సంప్రదించాలి . అలాగే, ఇది ఖచ్చితమైన కారణం కాకపోయుండొచ్చు కూడా. అయితే కొంత మంది మహిళల్లో ఈ లక్షణం గర్భధారణ కాలం మొత్తం ఉంటుంది . కానీ క్రాంపింగ్ తో పాటు బ్లీడింగ్ ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన జాగ్రత్తలు పాటించటం ముఖ్యం. మందులు, వాడుకుని, విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగు చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మనివ్వవచ్చు. గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్‌ వదులుగా ఉండటం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషను ద్వారా సరిదిద్దవచ్చు. లేదా నాలుగో నెలలో సర్విక్స్‌కు కుట్టువేసి వదులవడాన్ని నిరోధించవచ్చు. గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్‌ యాసిడ్‌ వాడుకుని మళ్లీ గర్భం ప్లాన్‌ చేయొచ్చు. అబార్షన్‌ అయినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి, ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో వివాహం అయితే దంపతులకు కెరియోటైపు పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగు, థైరాయిడ్‌ టెస్టులు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.