Ribs Catching : అకస్మాత్తుగా పక్కటెముకలు పట్టేస్తున్నాయా! కారణం తెలుసా?

ఇలాంటి పక్కటెముకల నొప్పి కలగటానికి డయాఫ్రం పొర అసంకల్పితంగా సంకోచించటం కారణమని నిపుణులు చెబుతున్నారు. రక్త సరఫరా ఎక్కువ కావటం దీనికి ప్రధాన కారణమని భావిస్తారు. లోపలి అవయవాలు డయాఫ్రం పొరను కిందికి లాగటం కారణం కావొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే శారీరక శ్రమ చేయటం వంటి చేయరాదు.

Ribs Catching : అకస్మాత్తుగా పక్కటెముకలు పట్టేస్తున్నాయా! కారణం తెలుసా?

Ribs Catching :

Ribs Catching : పక్కటెముకలు మీ గుండె మరియు ఊపిరితిత్తులతో సహా మీ ఛాతీ లోపల మీ శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలను రక్షిస్తాయి. ఛాతీకి ప్రతి వైపున 12 పక్కటెముకలు ఉన్నాయి మరియు అవి మీ వెన్నెముక నుండి వెనుకవైపు మీ స్టెర్నమ్ లేదా రొమ్ము ఎముక వరకు ముందు భాగంలో ఉంటాయి. మృదులాస్థి ద్వారా మీ రొమ్ము ఎముకకు అనుసంధానించబడి ఉంటాయి. శ్వాస సమయంలో పక్కటెముకలు విస్తరిస్తాయి. ఇంటర్‌కోస్టల్ కండరాలు అని పిలువబడే కండరాలు పక్కటెముకల మధ్యగా వెళుతూ ఛాతీ గోడను కదిలించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా శ్వాస సమయంలో. పక్కటెముకలో నొప్పి ఏ భాగంలోనుండైనా ఎదురవ్వవచ్చు.

వ్యాయామం చేస్తున్న సమయంలో లేదంటే ఆటలు ఆడుతున్న సందర్భంలో, వంగి లేస్తున్నప్పుడు అక్మాత్తుగా పక్కటెముకలు పట్టేస్తుంటాయి. ఆసమయంలో నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలా జరగటం వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినప్పటికీ హాఠాత్తు పరిణామంతో చాలా మంది భయాందోళనకు లోనవుతుంారు. అంతేకాకుండా తాము నిర్వర్తించాల్సిన కార్యకలాపాలకు ఈ నొప్పి ఆటంకంగా మారుతుంది. ఏపని చేసుకోలేకుండా అసౌకర్యం కలిగిస్తుంది. ఎక్కువగా దగ్గడం వల్ల పక్కటెముక నొప్పి కలుగుతుంది. దగ్గటం వల్ల పదేపదే కదలిక, ప్రత్యేకించి కండరాలు లాగి నొప్పి లేదా పక్కటెముకల నొప్పిని కలిగిస్తుంది.

ఇలాంటి పక్కటెముకల నొప్పి కలగటానికి డయాఫ్రం పొర అసంకల్పితంగా సంకోచించటం కారణమని నిపుణులు చెబుతున్నారు. రక్త సరఫరా ఎక్కువ కావటం దీనికి ప్రధాన కారణమని భావిస్తారు. లోపలి అవయవాలు డయాఫ్రం పొరను కిందికి లాగటం కారణం కావొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే శారీరక శ్రమ చేయటం వంటి చేయరాదు. అలా చేస్తే డయాఫ్రం పొర సంకోచించటానికి దారితీస్తుంది. ఆ సమయంలో తిన్న ఆహారం జీర్ణం కావటానికి శరీరం జీర్ణాశయానికి రక్త సరఫరాను ఎక్కువ చేస్తుంది. దీంతో డయాఫ్రం పొరకు రక్త సరఫరా తగ్గుతుంది. రక్తంలో క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి ఎలక్టోలైట్ల మోతాదులు తక్కువగా ఉండటం కూడా ఈసమస్యకు దారితీయవచ్చని నిపుణులు చెప్తున్నారు.