Stuffy Nose : ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడుతున్నారా? రిలీఫ్ కోసం సహజ చిట్కాలు!

ముక్కు దిబ్బడగా ఉన్న సమయంలో ముక్కులో అధిక శ్లేష్మం కలిగి ఉండటం, ముక్కులో ఎదో కూరుకుపోయిన అనుభూతి, ముక్కు కారటం, సైనసెస్, ముఖం నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Stuffy Nose : ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడుతున్నారా? రిలీఫ్ కోసం సహజ చిట్కాలు!

Suffering from a stuffy nose

Stuffy Nose : ముక్కు దిబ్బడ పెద్దలు, పెద్ద పిల్లలలో సాధారణంగా కనిపిస్తుంది. నాసికా మార్గం లోపలి పొరలు ఎర్రబడినప్పుడు, దిబ్బడని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముక్కులోని రక్త నాళాలు ఉబ్బినప్పుడు, అది ముక్కు మూసుకుపోయేలా చేస్తుంది. ముక్కు దిబ్బడ సాధారణ జలుబు, అలెర్జీ లేదా సైనస్ ఇన్ఫెక్షన్‌తో ముడిపడి ఉండే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటుగా అనేక కారణాలు ముక్కు దిబ్బడకి కారణం కావచ్చు.

ముక్కు దిబ్బడగా ఉన్న సమయంలో ముక్కులో అధిక శ్లేష్మం కలిగి ఉండటం, ముక్కులో ఎదో కూరుకుపోయిన అనుభూతి, ముక్కు కారటం, సైనసెస్, ముఖం నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారం రోజులకు పైగా నిరంతరం ముక్కు దిబ్బడతో బాధపడటం, జ్వరం, శ్వాస సమస్యలు, అసౌకర్యం కలిగి ఉంటే వైద్యుడిని సంప్రదించటం మంచిది. తర్వాత చికిత్స ప్రారంభించడం ఉత్తమం.

ముక్కు దిబ్బడ తొలగించే సహజ చిట్కాలు ;

వాముని కొద్దిగా తీసుకుని మెత్తగా దంచి పలుచటి గుడ్డలో ఒంటి పొర మీద మూటగట్టి గట్టిగా వాసన పీల్చండి. పదే పదే ఇలా పీలుస్తుంటే తుమ్ములు, ముక్కు దిబ్బడ వేయడం, జలుబు భారం తగ్గుతాయి. తలనొప్పి నెమ్మదిస్తుంది. ఇన్ హేలర్ల వాడకం మంచిది కాదు, అతిగా వాడితే నెత్తురు కారడం ముక్కు లోపలి పొరల్లో ఇరిటేషన్ రావడం జరుగుతోంది.

నీటిని ఎక్కువగా తీసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల శరీరం టాక్సిన్స్‌ను బయటకు పంపి, మీ సైనస్‌ల నుండి శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. సూప్‌లు మరియు ఉడకబెట్టిన పులుసుల వంటి వెచ్చని ద్రవాలను తాగడం వల్ల దిబ్బడ నుండి ఉపశమనం పొందవచ్చు.

హారతికర్పూరాన్ని కూడా  వాసన చూడవచ్చు, కానీ ఇది వాములాగా సౌమ్యంగా పనిచేయదు, అతిగా పీలిస్తే ఇరిటేషన్ కలిగిస్తుంది.

నిద్రిస్తున్నప్పుడు తలను ఎత్తులో ఉంచేలా కింద దిండు పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. శ్వాసను సులభతరం చేయడానికి ముఖంపై వెచ్చని టవల్‌ను ఉంచవచ్చు.

ఆవిరి పీల్చడం దిబ్బడను వదిలించేందుకు సహాయపడుతుంది. వేడినీటిలో కొంచెం పుసుపు వేసుకుని ఆవిరిపట్టవచ్చు. దీని వల్ల కొద్ది సేపట్లోనే ముక్కు దిబ్బడ నుండి రిలీఫ్ కలుగుతుంది.