Hyderabad : ఎలర్జీ సమస్యలతో బాధ పడుతున్నారా..డోంట్ వర్రీ

మీరు దీర్ఘకాలిక ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నారా? పేరు మోసిన డెర్మటాలజిస్టులను సంప్రదించినా తగ్గడం లేదా?

Hyderabad : ఎలర్జీ సమస్యలతో బాధ పడుతున్నారా..డోంట్ వర్రీ

Chest Hospital

Hyderabad Chest Hospital : మీరు దీర్ఘకాలిక ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నారా? పేరు మోసిన డెర్మటాలజిస్టులను సంప్రదించినా తగ్గడం లేదా? అయితే మీ సమస్యలకు పరిష్కారం ఇకపై హైదరాబాద్‌ చెస్ట్‌ ఆస్పత్రిలో దొరకుతుంది. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ఎలర్జీ క్లినిక్‌ను ప్రారంభించనుంది.  ఇక్కడి వైద్యులు ఇమ్యూనోథెరపీ ద్వారా ఎలర్జీలకు శాశ్వతంగా చెక్ పెట్టనున్నారు. కోవిడ్‌ తర్వాత చాలా మందిలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు ఎలర్జీ సమస్యలు కూడా బాగా పెరిగాయి. డబ్బున్నవారు ప్రముఖ ఆస్పత్రుల్లో చేరి క్యూర్ అవుతుండగా పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం సరైన ట్రీట్‌మెంట్‌ తీసుకోలేకపోతున్నారు.

Read More : TRS : నేతలకు క్లాస్ తీసుకున్న మంత్రి కేటీఆర్?

హైదరాబాద్‌ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రికి వచ్చే రోగుల్లో ఎక్కువ మంది అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఎలర్జీ పేషెంట్లకు వైద్యం అందించేందుకు చెస్ట్ ఆస్పత్రిలోనే ఎలర్జీ క్లినిక్ ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో ప్రతి బుధవారం ఎలర్జీ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా క్లినిక్ తెరుస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతిరోజు ఎలర్జీ రోగుల ఓపీ.. ఐపీలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు దానికి తగినట్లుగా కసరత్తు చేస్తున్నారు.

Read More :Siddharth: మోసగాళ్లు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు.. సమంతా గురించేనా?

సాధారణంగా స్కిన్ ఎలర్జీ.. శ్వాసకోశ సంబంధిత ఎలెర్జీ, కొంతమందికి మెడిసిన్ పడకపోవడంతో కూడా ఎలర్జీలు వస్తుంటాయి. కొంతమందిలో ఆహారం పడక ఇన్‌ఫెక్షన్‌ అవుతూ ఉంటుంది. డస్ట్ ఎలర్జీ , వాతావరణంలో  మార్పుల వల్ల కూడా ఎలెర్జీలు వస్తుంటాయి. వీటన్నిటికీ ఎలర్జీ క్లినిక్‌లో చికిత్స అందించనున్నారు. 90 రకాల ఎలర్జీ లకు టెస్ట్ లు చేయనున్నారు. దేనివల్ల ఎలర్జీ వస్తుందో తెలుసుకుని ఇమ్యూనో థెరపి ద్వారా మళ్లీ ఆ సమస్య రాకుండా చేస్తామంటున్నారు వైద్యులు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే  చెస్ట్‌ ఆస్పత్రిలోనే అడ్మిట్ చేసుకొని చికిత్స అందించనున్నారు. అత్యంత ఖరీదైన ట్రీట్‌మెంట్‌ను ప్రజలకు ఉచితంగానే అందించనుంది ప్రభుత్వం.