Ear Infection : చెవి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారా! వెల్లుల్లితో..

వెల్లుల్లి ఆయిల్ ను చెవిలోపల ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో మూడు డ్రాప్స్ వేసి కాటన్ పెట్టి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Ear Infection : చెవి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారా! వెల్లుల్లితో..

Ear Infection : పెద్దవారిలో కంటే శిశువులలో చెవి ఇన్ ఫెక్షన్లు అధికం. చెవి ఇన్ ఫెక్షన్ల సంకేతాలు అందరిలో ఒకేలాగ ఉండవు. చెవి పోటు, వికారం, నిద్రలేమి,శబ్దాలకి పెద్దగా స్పందించకపోవడం, తీవ్ర జ్వరం,తలనెప్పి,చెవిలో లాగుతున్నట్లుండడం, చెవి నుండి ద్రవం లాంటిది కారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. పోషకాహార లోపం, అంతర్గత గాయాలు, పర్యావరణ సంబంధిత ఎలర్జీలు, అడినాయిడ్ గ్రంధుల వాపు, ఇంఫెక్షన్లు, సైనస్ ఇంఫెక్షన్లు, పొగ త్రాగడం, జలుబు, శ్వాశ కోశ ఇన్ ఫెక్షన్లు, చెవిలో గులిమి పేరుకుపోవడం లాంటివి చెవి ఇన్ ఫెక్షన్లకి కారణంగా చెప్పవచ్చు.

చెవి నొప్పిని తగ్గించుకోవడానికి వెల్లుల్లి ఎంతో ఉపకరిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ వైరల్ మరియు యాంటీ ఆక్సిడైజ్డ్ గుణాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను నివారించడంలో సహాయపడతాయి. చెవి వాపు, నొప్పి తగ్గించటంలో ఉపకరిస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. చెవిలోపల నొప్పిని తగ్గిస్తుంది. చెవి ఇన్ ఫెక్షన్లు నివారించటంలో వెల్లుల్లి ఏవిధంగా ఉపయెగపడుతుందో తెలుసుకుందాం…

ముందుగా 5 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా మరిగించాలి. కొద్దిసేపటి తరువాత ఉడికిన వెల్లుల్లిని క్లాత్ లో వేసి, కొద్దిగా ఉప్పును వేసి నొప్పి, ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో మర్దన చేయాలి. ఇలా చేయటం వల్ల చెవి నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే వెల్లుల్లి ఆయిల్ ను రెండు మూడు చుక్కలను చెవిలో వేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజు వారిగా ఇలా చేస్తుంటే ఇన్ఫెక్షన్ తో పాటు, నొప్పి కూడా తగ్గుతుంది.

వెల్లుల్లి ఆయిల్ ను చెవిలోపల ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో మూడు డ్రాప్స్ వేసి కాటన్ పెట్టి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక టీస్పూన్ ఆవనూనె తీసుకుని, అందులో నువ్వుల నూనె ఒక టీ స్పూన్ వేసి కలుపుకోవాలి. అందులోనే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొన్ని నిముషాలు మరిగించాలి. నొప్పి, వాపు ఉన్న ప్రదేశంలో ఆ నూనెను అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఒక క్లాత్ లో వేసి చెవి చుట్టూ మర్ధన చేయాలి. ఇలా చేయటం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల నుండి సేకరించి అందించటమైనది. చెవికి సంబంధించిన ఎలాంటి ఇన్ ఫెక్షన్లు ఉన్నా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.