Body Ache : శరీరంలో నొప్పులు బాధిస్తున్నాయా! కారణాలు ఇవే? |Suffering from body aches! What are the reasons?

Body Ache : శరీరంలో నొప్పులు బాధిస్తున్నాయా! కారణాలు ఇవే?

జలుబు, జ్వరం రెండూ వాపుకు కారణమయ్యే వైరల్ ఇన్ఫెక్షన్లు. ఈ అంటువ్యాధులు మీ శరీరంపై దాడి చేస్తాయి. రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా గొంతు, ఛాతీ మరియు ఊపిరితిత్తులలో వాపు, బాధకలిగిస్తుంది.

Body Ache : శరీరంలో నొప్పులు బాధిస్తున్నాయా! కారణాలు ఇవే?

Body Ache : శరీరంలో నొప్పులు అనేవి సర్వ సాధారణం. అయితే జ్వరం వచ్చిన సందర్భంలో శరీరమంతా నొప్పులు కలుగుతాయి. నొప్పుల సమస్యను దైనందిన జీవితంలో చాలా మంది ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రత్యేకించి ఎక్కువసేపు నిలబడి, నడవడం లేదా వ్యాయామం చేసే సందర్భంలో నొప్పులు ఉంటాయి. పాదాలు, చేతులు, నడుము, భుజాలు, మెడ తదితర ప్రాంతాల్లోని నెప్పులు ఎక్కువగా బాధిస్తుంటాయి. శరీరం నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి విశ్రాంతితోపాటు, ఇంట్లో కొంత చికిత్స అవసరం కావచ్చు. అయితే కొన్ని నొప్పులు చాలా కాలం పాటు ఉంటే, మరికొన్ని నొప్పులు అంతర్లీనంగా ఉండిపోతాయి. ఈ సందర్భంలో రోగ నిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. నొప్పులు, ఇతర లక్షణాల నుండి ఉపశమనానికి దీర్ఘకాలిక చికిత్స అందిస్తారు. అసలు శరీరంలో నొప్పులకు కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఒత్తిడి: మీరు ఒత్తిడికి గురైనప్పుడు, రోగనిరోధక వ్యవస్థ పెద్దగా ప్రతిస్పందించదు. ఫలితంగా, శరీరం సాధారణంగా ఇన్ఫెక్షన్‌లు లేదా అనారోగ్యం సమస్య ఎదురైనప్పుడు ఫైట్ చేసే శక్తిని కలిగి ఉండదు. దీంతో శరీరం నొప్పులకు కారణమవుతుంది. అధిక హృదయ స్పందన రేటు పెరిగిన రక్తపోటు, వేడి ఆవిర్లు, చల్లని చెమటలు, హైపర్వెంటిలేటింగ్, వణుకు, టెన్షన్ తలనొప్పి,మైగ్రేన్ల కారణంగా ఒత్తిడి శరీర నొప్పులకు కారణమవుతుందని నిపణులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోవడానికి మీ రోజువారీ జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవటం మంచిది. శ్వాసపై దృష్టి పెట్టడం,ఒత్తిడిని కలిగించే వ్యక్తులు లేదా సంఘటనల నుండి మనస్సును మరల్చటం, ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని వదిలివేయటం, సమయానుకూలంగా నిద్ర వంటి పద్దతులను అనుసరించటం ద్వారా
నొప్పులను దరి చేరకుండా చూసుకోవచ్చు.

డీహైడ్రేషన్: శరీరం యొక్క సాధారణ, ఆరోగ్యకరమైన పనితీరుకు నీరు ఒక ముఖ్యమైన అంశం. అది లేకుండా, మీ శరీరం శ్వాస, జీర్ణక్రియతో సహా అనేక ముఖ్యమైన ప్రక్రియలను సరిగ్గా నిర్వహించలేదు. నిర్జలీకరణానికి గురైనప్పుడు, ఈ ప్రక్రియలు బాగా పని చేయనప్పుడు, ఫలితంగా శారీరక నొప్పుల పరిస్ధితి ఎదురవుతుంది. ఆయాసం, విపరీతమైన దాహం, మైకం, వంటిల క్షణాలు డీహైడ్రేషన్ కు ప్రధాన లక్షణాలు. ప్రతిరోజు 8గ్లాసుల నీరు తప్పనిసరిగా తీసుకోవాలని గుర్తుంచుకోండి . శారీరక శ్రమ చేసేవారైతే ఎక్కువ మోతాదులో నీరు తాగటం మంచిది. అతిసారం వంటి పరిస్థితి కారణంగా డీహైడ్రేషన్‌కు గురైతే, పుష్కలంగా నీరు త్రాగటం మంచిది. అదనపు ఎలక్ట్రోలైట్‌లతో కూడిన నీరు లేదా పానీయాలు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడవచ్చు. కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేయవచ్చు. డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు శరీరమంతా నొప్పి అనుభూతి కలుగుతుంది.

నిద్ర లేకపోవడం: తగినంత నిద్ర లేకపోవడం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతిరోజు రాత్రి కనీసం 6 నుండి 8 గంటల నిద్ర అవసరం. శరీరం యొక్క కణజాలాలు, కణాలు ఆరోగ్యంగా ఉండటానికి సరైన నిద్ర అవసరం. మెదడు రిఫ్రెష్ అవ్వటానికి యాక్టివ్ గా ఉండేందుకు నిద్ర అవసరం. సరైన సమయం విశ్రాంతి లేకుంటే శరీరం నొప్పికి దారి తీస్తుంది. నిద్రలేమి కారణంగా గందరగోళం, దిక్కుతోచని స్థితి, పగటిపూట తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకోవడం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, సరిగ్గా మాట్లాడటానికి ఇబ్బంది, విషయాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రశాంతంగా నిద్రించేందుకు అనువైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. నిద్రలేకపోవటం వల్ల శరీరంలో అలసట ఏర్పడి శరీరంలో నొప్పులు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటి నుండి బయటపడేందుకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయటం వల్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.

జలుబు, జ్వరం ; జలుబు, జ్వరం రెండూ వాపుకు కారణమయ్యే వైరల్ ఇన్ఫెక్షన్లు. ఈ అంటువ్యాధులు మీ శరీరంపై దాడి చేస్తాయి. రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా గొంతు, ఛాతీ మరియు ఊపిరితిత్తులలో వాపు, బాధకలిగిస్తుంది. మీ శరీరం ఇన్‌ఫెక్షన్‌తో పోరాడేందుకు చాలా కష్టపడుతుంది. దీంతో శరీరంలోని మిగిలిన భాగాల్లో నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. గొంతు మంట, తుమ్ములు, దగ్గు, తలనొప్పి, చెవినొప్పులు వంటి సందర్భాల్లో ఒంటినొప్పులు ఉంటాయి. నొప్పిని తగ్గించడానికి విశ్రాంతి తీసుకోవడం, పుష్కలంగా నీరు త్రాగడం, గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వంటివి చేస్తే జలుబు, జ్వరం నుండి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. మరీ ఇబ్బంది కరంగా ఉంటే వైద్యులను సంప్రదించటం మంచిది.

విటమిన్ డి లోపం ; హైపోకాల్సెమియా, లేదా తక్కువ రక్త కాల్షియం స్థాయి, శరీరంలో తగినంత విటమిన్ డి లేనప్పుడు సంభవిస్తుంది. మూత్రపిండాలు, కండరాలు వంటి శరీరంలోని చాలా ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి కాల్షియంపై ఆధారపడతాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం కూడా అవసరం. కాల్షియంను గ్రహించడంలో మీకు తగినంత విటమిన్ D లేకపోతే, ఈ అవయవాలలో, ఎముకలలో నొప్పులు కలుగుతాయి. శరీరం తిమ్మిరి, కండరాల సంకోచం, దుస్సంకోచాలు, మైకము, గందరగోళం వంటి లక్షణాలు ఉన్న సందర్భంలో శరీరమంతా నొప్పులు వస్తాయి.

ఇవి కాకుండా అనేక ఇతర కారణాలు కూడా శరీరం నొప్పులకు దారితీస్తాయి. అయితే నొప్పుల తీవ్రతను బట్టి వైద్యుసహాయం పొందటం మంచిది.

×