Diabetes : మధుమేహంతో బాధపడుతున్నారా? భయపడాల్సిన పనిలేదు

ప్రతి రోజు మన శరీరానికి శారీరక శ్రమ అనేది అవసరం. వృత్తిరీత్యా అది వీలయ్యే వారిని పక్కకి పెడితే, మిగతావారు మాత్రం రోజులో తప్పనిసరిగా ఒక గంట సేపు శరీరానికి ఏదో ఒక రకమైన శ్రమను కలిగించాలి.

Diabetes : మధుమేహంతో బాధపడుతున్నారా? భయపడాల్సిన పనిలేదు

Diabetes

Diabetes : ప్రపంచంలో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులే దీనికి ప్రధానమైన కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే చక్కెర వ్యాధి బారిన పడిన వారు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవటం తోపాటు, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది.

మధుమేహంతో బాధపడుతుంటే ;

ప్రతి రోజు మన శరీరానికి శారీరక శ్రమ అనేది అవసరం. వృత్తిరీత్యా అది వీలయ్యే వారిని పక్కకి పెడితే, మిగతావారు మాత్రం రోజులో తప్పనిసరిగా ఒక గంట సేపు శరీరానికి ఏదో ఒక రకమైన శ్రమను కలిగించాలి. నడక, జాగింగ్, వ్యాయామం వంటివి చేయాలి. అధిక బరువు పెరగకుండా.. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్‌లని తీసుకోవడం బాగా తగ్గించాలి.

ఆహారం తీసుకునే సమయంలో ఒక క్రమశిక్షణను పాటించాలి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తీసుకున్న ఆహారంతో పోలిస్తే.. రాత్రి సమయాల్లో చాలా తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడం మంచిది. భోజనంలోకి తీసుకునే వైట్ రైస్ స్థానంలో బ్రౌన్ రైస్ లేదా క్వినోవా రైస్‌ని తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

మంచి పోషకాలను అందించే పండ్లను తినాలి. బొప్పాయి, గ్రీన్ యాపిల్, కివి, జామకాయ, కీరా దోసకాయ వంటివి తినాలి. 30 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా డయాబెటిక్ టెస్ట్ చేయించుకుని, వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. అతి ఆకలి, అతి దాహం, రాత్రి వేళల్లో నాలుగు సార్లు అంతకన్నా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడం, త్వరగా అలిసిపోవటం, బరువు పెరగడం , తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించటం మంచిది.