Clove Powder : తలనొప్పితో బాధపడుతున్నారా? తలనొప్పి నివారిణిగా లవంగాల పొడి!

తలలోని రక్తనాళాలు లో రక్తప్రసరణ సరిగ్గా జరగక పోతే తల నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక రోజూ ఎనిమిది గంటలపాటు నిద్రపోకపోవడం కూడా తలనొప్పికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

Clove Powder : తలనొప్పితో బాధపడుతున్నారా? తలనొప్పి నివారిణిగా లవంగాల పొడి!

Clove Powder :

Clove Powder : చలికాలంలో తలనొప్పి అనేది చాలా మందిలో సర్వసాధారణంగా కనిపించే సమస్య. నొప్పితగ్గటం కోసం పెయిన్ కిల్లర్స్‌, టాబ్లెట్లను వేస్తుంటారు. అయితే ప్రతిసారి టాబ్లెట్లను వాడడం మన ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబతున్నారు. తలనొప్పి తీవ్రత కారణంగా ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి మందగించడం, తరచుగా చికాకు,మొదలైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే తలనొప్పి సమస్యను పరిష్కరించేందుకు కొన్ని గృహచిట్కాలు బాగా ఉపకరిస్తాయి. అలాంటి వాటిలో ఇంటి పోపుల పెట్టేలో ఉండే లవంగాలు కూడా ఒకటి.

లవంగాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లవంగాలను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే తలనొప్పిని తగ్గించడంలో కూడా లవంగాలు మనకు ఎంతగానో ఉపకరిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో దోహదపడతాయి. అలాగే లవంగాలు పెయిన్ కిల్లర్ గా కూడా పనిచేస్తాయి. తలనొప్పితో పాటు కీళ్ల నొప్పులు, దంతాల నొప్పులును తగ్గించడంలో కూడా లవంగాలు సహాయకారిగా పనిచేస్తాయి.

తలనొప్పి తగ్గటం కోసం ముందుగా 6 లవంగాలను తీసుకోవాలి. వీటిని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిలో పావు టీ స్పూన్ సైంధవ లవణాన్ని వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో వేసి కలిపి తలనొప్పి అనిపించగానే తాగాలి. ఇలా పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల నిమిషాల్లో తలనొప్పి తగ్గుతుంది.

తలలోని రక్తనాళాలు లో రక్తప్రసరణ సరిగ్గా జరగక పోతే తల నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక రోజూ ఎనిమిది గంటలపాటు నిద్రపోకపోవడం కూడా తలనొప్పికి కారణమని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి తో ఇబ్బంది పడేవారు చాక్లెట్, మాంసం, వెన్న వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ ను తీసుకోకూడదు. విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి 12, మాంసకృత్తులు, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. తాజా పండ్లు, ఆకుకూరలను ఆహారంగా తీసుకోవాలి. తగినంత నీటిని తాగాలి. రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి.