Cholesterol : అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా!…మీ డైట్ ప్లాన్ ఎలాగంటే?

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తులు గుడ్డులోని పచ్చసొన, మటన్, వంటి మాంసాలు తీసుకోకూడదు. ఎందుకంటే అవి కొలెస్ట్రాల్ స్థాయిని మరింత పెంచేందుకు అవకాశం ఉంటుంది.

Cholesterol : అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా!…మీ డైట్ ప్లాన్ ఎలాగంటే?

Cholesterol : శరీరంలో జీవసంబంధ విధులు నిర్వర్తించాలంటే కొలెస్ట్రాల్ అనేది చాలా అవసరం. కొలెస్ట్రాల్ లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి అధిక సాంధ్రత కలిగిన లిపో ప్రొటీన్ దీనినే హెచ్ డీఎల్ అని అంటారు. రెండవది తక్కువ సాంధ్రత కలిగిన లిపోప్రొటీన్ దీనిని ఎల్ డిఎల్ అంటారు. హెచ్ డీ ఎల్ ని మంచి కొలెస్ట్రాల్ గా పిలుస్తారు. ఇది గుండో ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. అయితే ఎల్ డీ ఎల్ గా పిలవబడే కొలెస్ట్రాల్ హృదయ సంబంధిత సమస్యలకు మూలకారకంగా చెప్పవచ్చు.

రక్తంలో ఎల్ డి ఎల్ స్ధాయిలు ప్రమాదకరంగా ఉంటే ధమనుల గోడలకు అంటుకుని రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. తద్వారా గుండె పోటు ప్రమాదాలు సంభవించేందుకు కారణమౌతుంది. ఇటీవలి కాలంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. దీనికి ముఖ్యకారణం జీవనశైలిలో మార్పులు, కొవ్వు కలిగిన ఆహారపదార్ధాలను అధిక మోతాదులో తీసుకోవటమే. శరీరంలో పెరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటానికి వైద్యులు సూచించిన మందులకు తోడుగా మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాలు సైతం కీలక పాత్ర పోషిస్తాయి.

రక్తపరీక్ష చేయించుకోవటం ద్వారా మన శరీరంలో రక్తంలో కొలెస్ట్రాల్ స్ధాయి ఎంతవుందో తెలుసుకోవచ్చు. రక్త పరీక్షల ద్వారా శరీరంలో ఉండే నాలుగు రకాల కొవ్వుల స్ధాయిలను తెలుసుకోవచ్చు. హెడ్ డిఎల్, ఎల్ డిఎల్, విఎల్డిఎల్ తోపాటుగా తక్కవ సాంధ్రత కలగిన లిపోప్రొటీన్ , ట్రైగ్లిజరైడ్స్ స్ధాయిలను పరీక్షల్లో కనుగొనవచ్చు. కొలెస్ట్రాల్ మొత్తం 200ఎంజి కంటే తక్కువగా ఉంటే సదరు వ్యక్తి ఆరోగ్యవంతునిగా చెప్పవచ్చు. అదేక్రమంలో ఎల్ డి ఎల్ స్ధాయి మాత్రం కొలెస్ట్రాల్ యొక్క సాధారణ స్ధాయిని మించకూడదు. శరీరంలో సాధారణంగా ఉండాల్సిన కొలెస్ట్రాల్ స్ధాయిలకు సంబంధించి హెచ్ డిఎల్ 50ఎంజి,డిఎల్ అంతకంటే తక్కువగా ఉండాలి. ఎల్ డిఎల్ 100ఎంజి,డిల్ నుండి 150ఎంజి.డిఎల్ వరకు ఉండవచ్చు. విఎల్ డిఎల్ 25ఎంజి.డిఎల్ అంతకంటే తక్కువగా ఉండాలి. టిజి 150ఎంజి.డిఎల్ అంతకంటే తక్కువగా ఉండాలి.

కొలెస్ట్రాల్ స్థాయిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ,పోషకమైన ఆహారాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ ,ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న రోగులు ఎక్కువ ఫైబర్ ఆహారాలు,వోట్స్, హోల్ వీట్, మిల్లెట్స్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లను తీసుకోవటం ఉత్తమని ద్వారకాకు చెందిన అకాష్ హెల్త్ కేర్ నిపుణురాలు అనూజా గౌర్ సూచిస్తున్నారు.

ఆహారంలో ఆయాసీజన్లు వారిగా లభించే ఆకు కూరలను తీసుకోవటం మంచిది. ఆకు కూరలు వారానికి నాలుగు సార్లు తీసుకోవాలని అనూజా గౌర్ సూచిస్తున్నారు. వాటితోపాటు సీజనల్ గా లభించే ఫ్రూట్‌ను కూడా తీసుకోవాలి. ముఖ్యంగా సి విటమిన్ కలిగిన ఫ్రూట్స్ తోపాటు బాదం ,వాల్‌నట్‌లు స్నాక్స్ గా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కూరల్లో నూనెను తక్కువగా వినియోగించాలి. తక్కువ కొవ్వులు కలిగిన పాల ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలి. వీలైనంత వరకు తగ్గించటం మంచిది.

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తులు గుడ్డులోని పచ్చసొన, మటన్, వంటి మాంసాలు తీసుకోకూడదు. ఎందుకంటే అవి కొలెస్ట్రాల్ స్థాయిని మరింత పెంచేందుకు అవకాశం ఉంటుంది. శుద్ధి చేసిన పిండి, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకరీ ఉత్పత్తులు, వెన్న, చీజ్ మరియు నెయ్యి వంటి శుద్ధి చేసిన ,అధిక కొవ్వు కలిగిన ఆహార ఉత్పత్తులను ఆహారం నుండి మినహాయించాలి.

కొలెస్ట్రాల్ ను తగ్గించే డైట్ ప్లాన్ :

సోమవారం ; ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ లేదంటే రెండు డైజెస్టీవ్ బిస్కట్స్ తోపాటు కప్పు టీ తాగవచ్చు. మధ్యాహ్నం బోజనానికి ముందుగా అంటే సుమారుగా 11గంటల సమయంలో పండ్లు కాని కొబ్బరి నీరుగాని తాగాలి. మధ్యాహ్నం భోజనంగా ఒక బౌల్ రైస్ పప్పు,పెరుగు,సలాడ్ లతో కలిపి తీసుకోవాలి. సాయంత్రం 5గంటల సమయంలో వెటిటేబుల్ సూప్ , రాత్రికి డిన్నర్ గా 2 చపాతీలు కర్రీతో పాటు, గ్లాసు వెన్నతీసిన పాలు తాగాలి.

మంగళవారం ; ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా మెంతికూర చపాతీ, అందులోకి కర్రీ, భోజనానికి ముందుగా ఒక యాపిల్ , మధ్యాహ్నం భోజనంగా కప్పు రైస్, పప్పు, ఫిష్ కర్రీ, సాయంత్రం స్నాక్స్ గా ఉడకబెట్టిన గింజలు, రాత్రికి డిన్నర్ గా 2చపాతీలు క్యారెట్ కర్రీతోపాటు సూప్ గాని, సలాడ్ గాని తీసుకోవచ్చు.

బుధువారం ; ఉదయం బ్రేక్ పాస్ట్ గా డ్రై ఫ్రూట్స్, మధ్యాహ్నం భోజనానికి ముందుగా ఒక అరటి పండు, మధ్యాహ్నం భోజనంలో 2 చపాతీ, ఎగ్ ఆమ్లెట్, సాయంత్రం స్నాక్స్ గా చక్కెర లేకుండా మిల్క్ షేక్, రాత్రి డిన్నర్ గా ఒక కప్పు రైస్ పెసరపప్పుతో కలపి తీసుకోవాలి.

గురువారం ; ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా రెండు ఇడ్లీలు, ఒక కప్పు సాంబర్ , మధ్యాహ్నం భోజనానికి ముందుగా మిక్స్ డ్ ఫ్రూట్ సలాడ్, మధ్యాహ్నం భోజనంగా ఒక కప్పు రైస్, తక్కువ ఫ్యాట్ కలిగిన పన్నీర్ కర్రీ, గ్రీన్ వెజిటేబుల్ కర్రీ, సాయంత్రం స్నాక్స్ గా క్యారెట్ సూప్, రాత్రి డిన్నర్ గా 2 చపాతీ, కప్పు పప్పు, ఒక రసగుల్లా తినాలి.

శుక్రవారం ; ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా మిక్స్ డ్ వెజిటబుల్ పోహా, భోజనానికి ముందుగా కోకోనట్ వాటర్ తోపాటు ఒక యాపిల్, మధ్యాహ్నం భోజనంగా 2 చపాతీలు, కర్రీ, పప్పు, రెండు చికెన్ ముక్కలు , సాయంత్రం స్నాక్స్ గా టీ తోపాటు డైజెస్టీవ్ బిస్కెట్లు రెండు, రాత్రి డిన్నర్ గా రెండు చపాతీలు, ఒక గ్లాసు పాలు తీసుకోవాలి.

శనివారం ; ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా 2 దోశలు,ఒక కప్పు సాంబర్, భోజనానికి ముందుగా ఒక కప్పు దానిమ్మ గింజలు, మధ్యాహ్నం భోజనంగా ఒక కప్పు అన్నం, కప్పు పప్పు, పెరుగు, లేదంటే కోడిగుడ్డు కర్రీ, సాయంత్రం స్నాక్స్ గా గుమ్మడికాయ సూప్, రాత్రికి డిన్నర్ గా 2 చపాతీలు, ఒక కప్పు క్యారెట్, బీన్స్,బంగాళ దుంపలతో చేసిన కర్రీ, ఒక గ్లాసు పాలు తీసుకోవాలి.

ఇలా పత్యేకమైన డైట్ చార్ట్ ను రూపొందించుకుని క్రమం తప్పకుండా ఆహారనీయమాలు పాటిస్తే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గించుకోవచ్చు. డైట్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా నిపుణులను సంప్రదించి వారు సూచించిన విధంగా డైట్ చార్ట్ ను రూపొందించుకుంటే సులభంగా కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు వీలుంటుంది.