Suffering From Insomnia : నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? ప్రశాంతమైన నిద్రకోసం ఈ ఆయిల్స్ ట్రై చేయండి!

రోజుకి కనీసం ఏడుగంటల నిద్ర ఆరోగ్యాన్నిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి పెద్ద సమస్యగా మారి అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రశాంతంగా నిద్రపట్టేలా చేసేందుకు కొన్ని రకాల ఆయిల్స్ ఎంతో ఉపకరిస్తాయి.

Suffering From Insomnia : నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? ప్రశాంతమైన నిద్రకోసం ఈ ఆయిల్స్ ట్రై చేయండి!

Suffering from insomnia

Suffering From Insomnia : అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు ప్రశాంతమైన నిద్ర కూడా చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామందికి నిద్ర పట్టకపోవడం అన్నది పెద్ద సమస్యగా మారింది. రోజుకి కనీసం ఏడుగంటల నిద్ర ఆరోగ్యాన్నిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి పెద్ద సమస్యగా మారి అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రశాంతంగా నిద్రపట్టేలా చేసేందుకు కొన్ని రకాల ఆయిల్స్ ఎంతో ఉపకరిస్తాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

లావెండర్‌ నూనె : దిగులు, ఒత్తిడి ఇంకా ఆందోళన తగ్గిస్తుంది. ఇది పార్శ్వనొప్పి నుంచీ కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మనసుకు ప్రశాంతను ఇస్తుంది. శరీరం రిలాక్స్ అయ్యేలా చేయడం మాత్రమే కాదు. నీరసంని కూడా చాలా ఈజీగా దూరం చేస్తుంది. చర్మం ఇంకా అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

సంపెంగ నూనె: నిద్రపుచ్చే గుణాలు ఇందులో పుష్కలం. నిద్రపోయే ముందు రెండు చుక్కల నూనె వేసిన గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చాలు. ఈ సువాసన ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది.

పెప్పర్‌మెంట్‌ నూనె : పెప్పర్‌మెంట్‌ నూనె తలనొప్పి, కండరాల నొప్పి, దురద ఇంకా అలాగే జీర్ణ సమస్యలను ఈజీగా తగ్గిస్తుంది. ఈ నూనె నిద్ర బాగా పట్టేలా కూడా చేస్తుంది.

గంధంనూనె: రక్తపోటుతో నిద్రకు దూరమయ్యేవారికి ఔషధంలా పనిచేస్తుంది. రాత్రుళ్లు పదే పదే మెలకువ వచ్చేవారు వలేరియన్‌ వేరు నూనెను మూడునాలుగు చుక్కలు ఒక గిన్నెలో వేసి పడకగదిలో ఉంచితే చాలు.

ఫ్రాంకిన్‌సెన్స్: ఈ ఎసెన్షియల్‌ ఆయిల్‌ మెదడుకు విశ్రాంతినిచ్చి ఒత్తిడి, ఆందోళన దూరమయ్యేలా చేస్తుంది. చిన్న గిన్నెలో నాలుగైదు చుక్కల నూనె వేసి పడకగదిలో ఓమూల ఉంచితే చాలు. లావెండర్‌ నూనెలో ముంచిన దూది ఉండలను నిద్రపోయే ముందు వాసన చూసినా, మంచం పక్కగా నాలుగైదు చుక్కల ఈ నూనె వేసి గిన్నె ఉంచితే మెదడును ప్రశాంతంగా మారి నిద్రలేమిని తొలగిపోతుంది.

బెంజోన్‌ ఎస్సెన్షియల్‌: సాంబ్రాణి నుంచి తయారయ్యే ఈ నూనె శ్వాసను తేలికగా తీసుకునేలా చేసి నిద్రపట్టడానికి సహాయపడుతుంది. ఇందులో ముంచిన దూది ఉండను పడుకునే ముందు వాసన చూస్తే సరి. ఒత్తిడి, శ్వాసనాళాల వాపువల్ల కలిగే నిద్రలేమి సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.

చమోమిలే ఆయిల్ : చమోమిలే ఆయిల్ నిద్ర పట్టించటంలో బాగా తోడ్పడుతుంది. శరీరం యొక్కఉష్ణోగ్రతపై ఈ నూనె యొక్క ప్రత్యక్ష ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ గాలిలో వ్యాపించినప్పుడు, సూక్ష్మమైన పూల వాసన మనస్సుపై ప్రశాంతత మరియు విశ్రాంతి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దాని వాసనతో ఆందోళన సైతం దూరమౌతుంది.

సెడార్వుడ్ ఆయిల్ ; గంధపు ఎసెన్షియల్ ఆయిల్ లాగానే అదే విధమైన చెక్క వాసనతో, సెడార్‌వుడ్ నూనె ఉంటుంది. ఒత్తిడిని తగ్గించడానికి, పడకగదిలో మంచి నిద్రపట్టేలా చేయటానికి ఉపయోగపడుతుంది.