Tea Tree Oil : గోరు చుట్టు సమస్యతో బాధపడుతున్నారా? టీ ట్రీ అయిల్ తో ఇలా చేసి చూడండి!

గోరుచుట్టు అనేది ఒక రకమైన బాక్టీరియా, ఫంగస్ లేదా శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది. ఇది వచ్చిన చోట గోరు ఎర్రగా మరి చీము పట్టి చాలా బాధను కలుస్తుంది దీని కోసం టీ ట్రీ ఆయిల్ ఉపయోగించవచ్చు. టీ ట్రీ ఆయిల్ యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఫంగస్ ను తొలగించడం ద్వారా గోరుచుట్టు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Tea Tree Oil : గోరు చుట్టు సమస్యతో బాధపడుతున్నారా? టీ ట్రీ అయిల్ తో ఇలా చేసి చూడండి!

tea tree oil

Tea Tree Oil : టీ ట్రీ ఆయిల్ ను టీ ఆకుల నుండి తయారు చేస్తారు. దీనిని సాధారణం లభించే టీ ఆకులు నుంచి కాకుండా ఆస్ట్రేలియా చెందినది టీ మొక్క బెరడు నుంచి తీస్తారు. ఈ టి ట్రీ మొక్క తో చేసిన నూనె మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ట్రీ ఆయిల్ లో అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చర్మానికి చాలా మేలు చేస్తుంది. మొటిమలు, రింగ్‌వార్మ్ మరియు దురద వంటి చర్మ సంబంధిత సమస్యలలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్యాక్టీరియా మరియు ఫంగల్ చర్మ పరిస్థితులకు చికిత్సకు టీ ట్రీ ఆయిల్ ఉపయోగడుతుంది.

గోరుచుట్టు అనేది ఒక రకమైన బాక్టీరియా, ఫంగస్ లేదా శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది. ఇది వచ్చిన చోట గోరు ఎర్రగా మరి చీము పట్టి చాలా బాధను కలుస్తుంది దీని కోసం టీ ట్రీ ఆయిల్ ఉపయోగించవచ్చు. టీ ట్రీ ఆయిల్ యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఫంగస్ ను తొలగించడం ద్వారా గోరుచుట్టు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ అయిల్ లో యాంటీమైకోటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది ఫంగస్ ను తొలగించడం ద్వారా గోరుచుట్టు పోగొట్టేందుకు తోడ్పడుతుంది.

ఇందుకోసం చేయాల్సిందల్లా వేడి నీటిలో 2 టీ స్పూన్ పసుపు ,రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్ ని వేయాలి. తరువాత గోరుచుట్టు వేళ్ళను ఈ నీటిలో 20 నిమిషాలు ఉంచాలి. తరువాత దూది తీసుకుని గోరుచుట్టు ఉన్న ప్రాంతంలో క్లీన్ చేయాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గోరు చుట్టు సమస్య త్వరగా తొలగిపోతుంది. టీ ట్రీ ఆయిల్ ఉపయోగించడం చాలా సులభం. సాంప్రదాయ ఔషధాల మాదిరిగానే దీనిని ఉపయోగించవచ్చు.