షుగర్ పేషెంట్స్ కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే!

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 02:55 AM IST
షుగర్ పేషెంట్స్ కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే!

సాధారణంగా ఎవరికైనా షుగర్ వ్యాధి రాగానే ఏదైనా తినాలంటే చాలా అనుమానాలుంటాయి. పండ్లు తిందామంటే ఏవి తినాలో, ఏవి తినకూడదోనన్న సందేహాలు వస్తుంటాయి. అలాంటి వారు ఈ పండ్లను ఏమాత్రం భయంలేకుండా తీసుకోవచ్చు. అవేంటంటే..

ఆపిల్స్:

fruit
ఆపిల్స్‌ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. సాధారణంగా ఆపిల్ రోజు తినే పండు. చాలా మంది వైద్యులు మరియు నిపుణులు రోజుకు ఒక ఆపిల్ అయిన తినమని సలహా ఇస్తుంటారు. కారణం, ఆపిల్లో మన శరీరానికి కావలసిన అన్ని పోశాకలు అందించబడతాయి.   

ద్రాక్ష : 

grapes
ద్రాక్షపండ్లు రక్తప్రసరణను మెరుగుపరచడంలో ముందుంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని కొవ్వుశాతం కూడా తగ్గుతుంది. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని, వర్షాకాలంలో సమతుల్యత గల పండ్లను తినడం వల్ల మనిషి శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేసి జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. అవన్నీ ద్రాక్షలో మీకు లభిస్తాయి.

దానిమ్మపండు:

promogranate
ఈ పండ్లలో చక్కెర నిల్వలు స్వల్పంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి షుగర్ పేషెంట్లు ఏమాత్రం భయపడకుండా ఈ పండ్లను తినొచ్చు. 

పుచ్చకాయలు:
wm

దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పొటాషియం కిడ్నీల పనితీరుని మెరుగ్గా చేస్తుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండుని తీసుకోవచ్చు. విటమిన్ సి కలిగిన పండ్లు డయాబెటిస్ పేషెంట్లకి ఎంతో మంచిది. 

కమలా పండ్లు: 

orange
కమలా పండ్లు తినడం వల్ల అందులోని క్యాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. ఈ పండులో అధిక మోతాదులో లభించే విటమిన్ ‘ఎ’ వల్ల దృష్టి లోపాలను నివారిస్తుంది. ఇందులో  క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, సోడియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇందులోని ఏ, సీ విటమిన్లతో పాటు థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్ తదితరాలు మెండుగా ఉంటాయి.

నేరేడుపండ్లు:

neredu
ఈ పండ్లని తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రో‌ల్‌లో ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. కేవలం ఈ పండ్లే కాదు వీటి గింజలను పౌడర్ చేసుకుని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌ లో ఉంటుంది. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.  విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం.సమ్మర్‌లో ఎక్కువగా లభించే ఫ్రూట్స్‌లో నేరేడు ఒకటి.

జామపండ్లు:

g
జామపండులో ఎన్నో పోషకాలున్నాయి. విటమిన్ ఎ, సి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఈ పండ్లు మధుమేహులకు చాలా మంచివి. ఆరెంజ్‌లోని విటమిన్ సి జామపండులో నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. జామకాయను తినడం ద్వారా దంతాలు, చిగుళ్లకు బలం చేకూరుతుంది. జామపండును రోజుకు రెండేసి తీసుకోవడం ద్వారా షూగర్ ను కంట్రోల్ లో పెట్టవచ్చు.

పైనాపిల్: 

pineapple
యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్న పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్య రక్షణకి అవసరమైన విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న పండు పైనాపిల్. ఎముకలకు ఇది బలం. పెరిగే పిల్లలకూ, వృద్ధులకూ ఇది చాలా మంచిది. దగ్గుకీ, జలుబుకీ ఇది మంచి మందు. ఇందులో బ్రొమిలైన్‌ దగ్గు రాకుండా చేస్తుంది.

అంజీర్:

an
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న అంజీరా పండ్లు ఇన్సులిన్ ఫంక్షన్‌ని కంట్రోల్ చేస్తుంది. కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంజీర్‌తో విటమిన్-ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతోపాటు క్లోరిన్ లభిస్తాయి. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లని తీసుకోవచ్చు.