White Poison : పంచదార..వైట్ పాయిజన్…దానిజోలికెళ్లొద్దు

చక్కెరను తినడం వలన నోటిలోని ఖాళీలలో మిగిలిపోయిన చక్కెర, బాక్టీరియాల ప్రభావము వలన విభజన చెంది ఆమ్లాలుగా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

White Poison : పంచదార..వైట్ పాయిజన్…దానిజోలికెళ్లొద్దు

Sugar

White Poison :  పంచదారను వైట్ పాయిజన్ గా పిలుస్తుంటారు. సాధారణంగా ఆనందానికి నోటిని తీపి చేసుకోవటం అందరికి అలవాటు. శుభసమయాల్లో, ఆనంద క్షణాల్లో తీపి పదార్ధాలను అందిస్తుంటారు. రుచికి బాగానే ఉన్నా మన ఆరోగ్యానికి వాటి వల్ల కలిగే హానిని మాత్రం ఎవరు గ్రహించరు. పూర్వ కాలంలో తిపి పదార్ధాలు తినటం పండుగో, పబ్బానిగో జరిగేది. అయితే ప్రస్తుతం ఉదయం మొదలుకొని, రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఏదోఒక సందర్భంలో తిపి పదార్ధం నోట్లోకి వెళ్ళకుండా ఉండలేకపోతున్నారు.

తీపి స్వీట్ల పుణ్యమా అంటూ ఈ ఇటీవలి కాలంలో మనుషుల్లో రోగాలు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రులు షుగర్ పేషెంట్లతోపాటు వివిధ రకాల జబ్బులతో కిటకిటలాడుతున్నాయి. చెరుకు రసం తెల్లటి పంచదారగా రావాలంటే ఎన్ని రసాయనిక మార్పులు జరగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివిధ ప్రక్రియలకు చెరకురసం లోనవుతుంది. అందులోనున్న పీచు పదార్థం పంచదార పలుకులకు అడ్డం లేకుండా ఉండటానికి పీచును పూర్తిగా వడకట్టేస్తారు. పీచు పదార్థం లేకుండగా తీపిదనంవల్ల ఆరోగ్యానికి అపకారం ఎక్కువ ఉంటుంది.

పలుకులు గట్టిగా బిగుసుకొని పోవడానికి బైండింగ్ ఏజంట్లు, వాతావరణంలో తేమ, పంచదారను కరిగించకుండా యాంటీ ఆక్సిడెంట్లు, పంచదారలో బాక్టీరియా క్రిములు చేరకుండా నిలువ ఉండడానికి ప్రిజర్వేటివ్స్, త్వరగా నోటిలో మరియు నీటిలో పంచదార కరగటానికి సాల్యుబుల్ ఏజంట్లు, తెల్లగా మెరిసేలా చేయడానికి కలరింగ్ ఏజంట్లు వాడతారు. అన్ని రకాల రసాయనిక విషపదార్థాలు కలిపితేగాని మనకంటికి, తెల్లగా, కళ్ళకి యింపుగా కనిపించడం లేదు. అందుకే పంచదారను అవసరానికి వాడుకొంటే ఆరోగ్యానికి పెద్దగా అపకారం ఉండదు. అతిగా వాడుకుంటే మాత్రం ఆరోగ్యానికి ముప్పుతప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చక్కెరను తినడం వలన నోటిలోని ఖాళీలలో మిగిలిపోయిన చక్కెర, బాక్టీరియాల ప్రభావము వలన విభజన చెంది ఆమ్లాలుగా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. నెమ్మదిగా ఈ ఆమ్లాలు పళ్ళలోని కాల్షియంను చెడగొట్టడానికి తోడ్పడతాయి. చక్కెరకు భిన్నంగా తేనె యాంటీబయాటిక్ ధర్మాలను కలిగి ఉంటుంది. అలాగే దీనికి బలమైన క్షారగుణం కూడా ఉంటుంది. ఈ ధర్మాల పుణ్యమా అని నోటిలోని ఖాళీలలో రోగ క్రిములు లేకుండా తేనె శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా తేనెలో ఫ్లోరిన్ ఉంటుంది. ఇది కూడా పళ్ళమీద చక్కటి ప్రభావాన్ని కలిగిస్తుంది. పంచదార వల్ల పళ్ళు చెడిపోవడానికి, పుచ్చిపోవడానికి దగ్గర సంబంధం ఉంది. పంచదారకు మూలమయిన చెరకుగడలను ఎన్ని తిన్నప్పటికీ పళ్ళకు ఏవిధమయిన అపకారం జరుగదని పలు పరిశోధనల్లో తేలింది.

పంచదారను ఎక్కువగా వాడడం వలన రక్తంలో కొవ్వు పదార్థాలయిన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ శాతం ఎక్కువగా పెరుగుతుంది. ఈ మార్పు గుండెజబ్బులకు, బి.పి.లకు, రక్తనాళాలు మూసుకుపోవడానికి దారితీస్తుంది. పంచదార కన్నా చెరకు రసం వాడుకోవటం ఆరోగ్యానికి మంచిది. చెరకు రసంలో ఉండే పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్ కారణంగా ఏ విధమైన కొవ్వూ రక్తంలో పెరిగే అవకాశం ఉండదు. అదే విధంగా పండ్లలో, తేనెలో, ఎండిన పండ్లలో పంచదారలో ఉన్న ‘సుక్రోజు’ అసలు ఉండదు. వీటిలో వుండే షుగరు గ్లూకోజు, మరియు ‘ఫ్రక్టోజ్’, పండ్లు, ఖర్జూరం, తేనె, ఎండిన పండ్లు మొదలగు వాటిలో నున్న షుగరుతోపాటు, ఉపయోగపడే మినరల్స్, విటమిన్స్, పీచు, మాంసకృత్తులు మరియు క్రొవ్వు పదార్థాలతో కలసి ఉండడం వలన ఆరోగ్యానికి ఏ విధమైన ఇబ్బంది కలుగదు.

పంచదారంత అపకారం బెల్లం చేయకపోయినా ఆరోగ్యానికి కొంత నష్టం మాత్రం కలిగించటం ఖాయం.ఆరోగ్యానికి అపకారం చెయ్యకుండా, ఆహారంగా, ఔషధంగా ఉపయోగపడే తీపి పదార్థం తేనె ఒక్కటే..