Sugarcane Juice : చర్మ సౌందర్యానికి చెరుకు రసం..

ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యానికి కూడా చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.

Sugarcane Juice : చర్మ సౌందర్యానికి చెరుకు రసం..

Sugar Cane

Sugarcane Juice  : మండే ఎండలో దాహం తీర్చే చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి సత్వరం గ్లూకోజ్ అందడం వల్ల అలసట దరిచేరకుండా చేస్తుంది. డీహైడ్రేషన్‌, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ సమస్యలు వేసవిలో ఎక్కువగా వేధిస్తుంటాయి. వీటిని తరమడానికి చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నవారికైనా చక్కని ఆహారం షుగర్ కేన్ జ్యూస్ గా చెప్పవచ్చు. చెరుకు రసం.. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడి దీనిని తీసుకుంటుంటారు. రుచి అద్భుతంగా ఉండే చెరుకు రసంలో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి.

ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్‌, ఎలక్ట్రోలైట్స్, కార్బొహైడ్రేట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు చెరుకు రసం ద్వారా పొందొచ్చు. అందుకే చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు. గర్భిణులకు చెరుకు రసం చాలా మంచిది. ఇందులో ఇనుము, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. జుట్టు ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. వృద్ధాప్య ఛాయల్నీ అడ్డుకుంటాయి. చెరకు రసంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యానికి కూడా చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. ముఖంపై మొటిమలను తగ్గించడంలో చెరుకు రసం బాగా సహాయపడుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోలో చెరుకు రసం మరియు నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకుని.. ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే.. క్రమంగా మొటిమలు మటుమాయం అవుతాయి.

చర్మ కాంతిని రెట్టింపు చేయడంలోనూ చెరుకు రసం ఉపయోగపడుతుంది. ఒక బౌల్‌లో చెరుకు రసం మరియు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. నెమ్మదిగా మసాజ్ చేయాలి. బాగా డ్రై అయిన తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.. ముఖం కాంతివంతంగా, అందంగా మెరుస్తుంది.  చెరుకు రసాన్ని ముఖానికి  అప్లై చేసి.. నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు వేళ్లతో మెల్ల మెల్లగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత పావు గంట పాటు వదిలేసి.. అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే.. చర్మంపై ముడతలు, సన్నని గీతలు పోయి ముఖం యవ్వనంగా, మృదువుగా తయారవుతుంది.