Super Vaccine : ప్రపంచానికి గుడ్‌న్యూస్.. సూపర్ వ్యాక్సిన్ వచ్చేసింది.. అన్ని కరోనావైరస్‌లను ఒకేసారి అంతం చేయగలదు!

Super Vaccine : ప్రపంచానికి గుడ్‌న్యూస్.. సూపర్ వ్యాక్సిన్ వచ్చేసింది.. అన్ని కరోనావైరస్‌లను ఒకేసారి అంతం చేయగలదు!

Scientists Invent New Vaccine That Can Fight All Forms, Mutations And Strains Of Coronaviruses (2)

Super Vaccine Can Fight All Forms of Coronaviruses : ప్రపంచాన్ని పట్టిపీడించే కరోనావైరస్ మహమ్మారిని నిర్మూలించే అద్భుతమైన కొత్త వ్యాక్సిన్ ఒకటి వచ్చేస్తోంది. అదే సూపర్ వ్యాక్సిన్.. ఎలాంటి కరోనావైరస్ జాతినైనా ఇట్టే చంపేయగలదు.. కరోనా మ్యుటేషన్, స్ట్రయిన్, వేరియంట్ల వంటి కరోనావైరస్ లను సమూలంగా నాశనం చేయగల సామర్థ్యం కొత్త సూపర్ వ్యాక్సిన్‌కు ఉందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సూపర్ వ్యాక్సిన్‌ను సైంటిస్టులు కనిపెట్టేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు గత కొన్ని నెలలుగా ప్రపంచమంతా అందుబాటులోకి వచ్చేశాయి. కానీ, ఈ వ్యాక్సిన్లు కరోనా మ్యుటేషన్లు, వేరియంట్లపై ప్రభావంతంతంగా ఎదుర్కొనే సత్తా లేదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.

Vaccine



అన్ని పక్షులను ఒకే రాయితో నేలకూల్చినట్టుగా.. పరిశోధకులు అన్ని రకాల వైరస్‌లను అంతమొందించే కొత్త యూనివర్శల్ వ్యాక్సిన్ కనిపెట్టేశారని అధ్యయనం చెబుతోంది. అన్ని కరోనావైరస్ ల నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యం, శక్తి ఈ వ్యాక్సిన్ కు ఉందని అంటోంది. వర్జీనియాకు చెందిన జియాంగ్ జిన్ మెంగ్, యూవీఏ హెల్త్ కు చెందిన స్టీవెన్ ఎల్.జియెచెన్నర్ పరిశోధకులు ఈ కొత్త విధానాన్ని కనుగొన్నారు. అన్ని కరోనావైరస్ లను ఒకేసారి అంతం చేయగల సత్తా గలదు. ఈ సూపర్ వ్యాక్సిన్ ప్రస్తుత కరోనా వైరస్ లపై మాత్రమే కాదు.. భవిష్యత్తులో రాబోయే కోవిడ్ స్ట్రయిన్లపై కూడా ప్రభావంతంగా పోరాడగలదు.

Super Vacc

ఒక వ్యాక్సిన్ కరోనావైరస్‌లన్నింటిపై ఎలా పోరాడగలదు? :
రీసెర్చర్లు Zeichner, Meng అనే ఇద్దరు యూనివర్శల్ వ్యాక్సిన్ క్రియేట్ చేశారు. కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్‌ భాగాన్ని వైరల్ ఫ్యూజన్ పెప్టైడ్ (viral fusion peptide) అని పిలుస్తారు. దీని లక్ష్యంగా సూపర్ వ్యాక్సిన్ తయారుచేశారు. ఈ ఫ్యూజన్ పెప్టైడ్ యూనివర్శల్ గా అన్ని కరోనావైరస్ లపై పోరాడుతుంది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది రోగుల నుండి పొందిన SARS-CoV-2 జన్యు శ్రేణులలో ఏమాత్రం మారలేదు లేదా విభిన్నంగానూ లేదని గుర్తించారు. ఈ స్పైక్ ప్రోటీన్ భాగాన్ని లక్ష్యంగా చేసుకునే టీకా సామర్థ్యం అన్ని కరోనావైరస్‌లపై ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు.


వ్యాక్సిన్ ప్రయోజనాలేంటి? :
ఈ సూపర్ వ్యాక్సిన్ పనితీరును, ప్రభావాన్ని పరీక్షించేందుకు పరిశోధకులు రెండు టీకాలను తయారు చేశారు. అందులో ఒకటి మానవులలో COVID-19 నుంచి రక్షించడానికి టీకా.. మరొకటి పందులలోని పోర్సిన్ ఎపిడెమిక్ డయేరియా వ్యాక్సిన్ (PEDV) నుంచి రక్షించడానికి తయారుచేశారు. ఈ రెండు వ్యాధులు కరోనావైరస్ కారణంగానే వ్యాప్తి చెందుతాయి. ఈ రెండు టీకాలు వేర్వేరు గ్రూపుల పందులకు ఇచ్చారు. PEDV వ్యాక్సిన్… SARS-CoV-2 వ్యాక్సిన్.. PEDV వల్ల కలిగే అనారోగ్యం నుంచి పందులను రక్షించింది. వ్యాక్సిన్లు వ్యాప్తిని పూర్తిగా నిరోధించలేదు.. కానీ, తీవ్రమైన లక్షణాల నుంచి పందులను రక్షించాయి. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసినట్టు గుర్తించారు.

Coronavirus Vaccine


పందులలో PEDV వ్యాధిపై అధ్యయనం చేయటానికి పరిశోధకులు ఎంచుకున్నారు. కరోనావైరస్ వ్యాప్తిపై టీకా పనితీరును విశ్లేషించారు. ఫిజియాలజీ, మానవులకు రోగనిరోధక శాస్త్రంలో పందులకు చాలా దగ్గరి పోలిక ఉంటుంది. అన్ని కరోనావైరస్లపై టీకా ప్రభావాన్ని పరీక్షించేందుకు అదనపు ట్రయల్స్, హ్యుమన్ ట్రయల్స్ మరిన్ని అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సూపర్ వ్యాక్సిన్లను వేగంగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది.

చాలా తక్కువ ఖర్చుతో చేయొచ్చునని అంటున్నారు. వ్యాక్సిన్ సులభంగా చౌకగా ఉత్పత్తి చేయొచ్చునని చెబుతున్నారు. సాధారణ బ్యాక్టీరియా E. coli జన్యు మార్పును కలిగి ఉంటుంది. ఈ పద్ధతిని ఉపయోగించి తయారుచేసిన వ్యాక్సిన్లలో చనిపోయిన కణాలను టీకాలుగా వేస్తారు. కలరా, పెర్టుస్సిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడానికి చనిపోయిన మొత్తం-సెల్ టీకాలు ప్రస్తుతం విస్తృతంగా వాడుకలో ఉన్నాయని జీచ్నర్ వివరించారు.