Sweet Potato : చిలగడదుంపతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు!

శరీరంలో విటమిన్ ఎ లోపం పొడి చర్మానికి ఒక పెద్ద కారణం. తీపి చిలగడదుంపలు బీటా కెరోటిన్ యొక్క అద్భుతమైన మూలం. ఇది మన శరీరంలో విటమిన్ ఎగా మారే యాంటీఆక్సిడెంట్లు మన చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.

Sweet Potato : చిలగడదుంపతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు!

beauty of the skin!

Sweet Potato : చిలగడ దుంపలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. చిలగడదుంపల్లో ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది గట్ సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చిలగడదుంపల్లో మెగ్నీషియం మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

చిలగడదుంపల ద్వారా లభించే యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల కాన్సర్ల నుండి మనలని రక్షించడంలో సాయపడతాయి. చిలగడదుంపలోని ఆంథోసైనిన్లు మంటను తగ్గించి ఫ్రీ రాడికల్ డామేజ్ ను తగ్గించటంలో తోడ్పడతాయి తద్వరా మెదడు పనితీరు మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

శరీరంలో విటమిన్ ఎ లోపం పొడి చర్మానికి ఒక పెద్ద కారణం. తీపి చిలగడదుంపలు బీటా కెరోటిన్ యొక్క అద్భుతమైన మూలం. ఇది మన శరీరంలో విటమిన్ ఎగా మారే యాంటీఆక్సిడెంట్లు మన చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. క్లియర్ స్కిన్ ను అందించడానికి చిలగడదుంప బాగా సహాయపడుతుంది.

చర్మసౌందర్యం కోసం చిలగడ దుంపలతో ఇలా చేయండి ;

ఒక పెద్ద సైజు చిలగడదుంపని తీసుకుని నీటిలో ఉడికించుకోవాలి. తరువాత దాని పైన ఉండే తొక్కను తొలగించాలి. ఇలా తొలగించిన చిలగడదుంపను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్
చేయాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, రెండు టేబుల్ స్పూన్లు గ్రైండ్ చేసి పెట్టుకున్న చిలగడదుంప
మిశ్రమం వేసుకోని దానిలో పచ్చి పాలు కొన్ని పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త అందంగా అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు అలా వదిలేయాలి. తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రెండు రోజులకు
ఒకసారి ఈ చిట్కాను పాటిస్తే చర్మంపై మచ్చలు మొటిమలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు వంటివి తొలగిపోతాయి.