Anger : కోపంతో ఊగిపోతున్నారా! అయితే జాగ్రత్త పడాల్సిందే
కోపం రాకుండా చూసుకోవటంతోపాటు మానిసికంగా ధృఢంగా మారేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం ప్రతిరోజు ధ్యానం చేయటం అలవాటుగా చేసుకోవాలి. దీని వల్ల కోపాన్ని తగ్గించుకోవచ్చు.

Anger : మనిషి అన్నవాడు ఎప్పుడో ఒకప్పుడు కోపం అనే భావోద్వేగానికి గురికావాల్సి వస్తుంది. మనకు చాలా ఇష్టమైన వాళ్ళు బాధపెట్టిన సందర్భంలోనో , మాటల ద్వారానో, పనుల ద్వారానో కోపాన్ని కలిగిస్తారు. కోపం వల్ల జీవితంలో అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి రావటంతోపాటుగా, ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడుతుంది. కోపం అధికంగా ఉండే వారిలో వ్యాధినిరోధకశక్తి తగ్గిపోతుంది. దానివల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. తరచూ కోపం రావడం వల్ల గొడవకి సిద్ధపడే విధంగా హార్మోన్స్ విడుదలవుతాయి. మన ఆలోచన శక్తి, జీర్ణశక్తిపై ఆప్రభావం పడుతుంది.
కోపం కారణంగా కొన్ని సందర్భాల్లో మంచి స్నేహ సంబంధాలు సైతం దెబ్బతింటాయి. రోజు వారిగా మనం చేసే పనులపై ఏకాగ్రతతోపాటు, సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. కోపాన్ని అదుపు చేసుకోలేక కొన్ని సందర్భాల్లో తీవ్రమైన దుష్ఫరిణామాలకు దారితీసేందుకు కారణభూతమౌతుంది. పూర్తిస్ధాయి ఆరోగ్యం దెబ్బతినేందుకు కోపం కారణంగా మారే అవకాశం ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలతోపాటు, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. మానసిక ప్రశాంతతను కోల్పోవటంతోపాటు, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. తలపోటు, అధిక రక్తపోటు, పునరుత్పత్తి శక్తి తగ్గిపోవటం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తరుచూ కోపం రావటం అది మీ శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది పూర్తి స్ధాయి ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తుంది.
కోపం రాకుండా చూసుకోవటంతోపాటు మానిసికంగా ధృఢంగా మారేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం ప్రతిరోజు ధ్యానం చేయటం అలవాటుగా చేసుకోవాలి. దీని వల్ల కోపాన్ని తగ్గించుకోవచ్చు. శరీరాన్ని, మైండ్ ను చురుకుగా ఉంచుకోవటంతోపాటు కోపం రాకుండా చూసుకునేందుకు యోగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలు ఆహారం రూపంలో అందేలా చూసుకోవాలి. పోషకాల లోపం కారణంగా కూడా శక్తి తగ్గి కోపం వచ్చే ప్రమాదం ఉంటుంది. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవరుచు కోవాలి. దీని వల్ల భావోద్వేగాల నుండి బయటపడవచ్చు. వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, వంటి వాటిని రోజువారిగా అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చేస్తే శులభంగా కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
1Pm modi: నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. రెండున్నర గంటలు పర్యటన.. షెడ్యూల్ ఇలా..
2Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
3Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
4McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
5VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
6Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
7CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
8TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
9Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
10Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
-
Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
-
Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
-
Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?