చిన్నారులే టార్గెట్ : ఆ మూడు డేటింగ్ యాప్స్ డిలీట్

చిన్న పిల్లలే లక్ష్యంగా ఆన్ లైన్ లో రోజురోజుకీ చెత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. చిన్నారులను ఎట్రాక్ట్ చేసేలా అభ్యంతరకంగా ఫొటోలు, వీడియోలు పెడుతున్నారు. ఆన్ లైన్ స్టోర్లలో డేటింగ్ యాప్స్ ఓపెన్ చేసేందుకు చిన్నారులకు యాక్సస్ ఇస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : May 7, 2019 / 10:43 AM IST
చిన్నారులే టార్గెట్ : ఆ మూడు డేటింగ్ యాప్స్ డిలీట్

చిన్న పిల్లలే లక్ష్యంగా ఆన్ లైన్ లో రోజురోజుకీ చెత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. చిన్నారులను ఎట్రాక్ట్ చేసేలా అభ్యంతరకంగా ఫొటోలు, వీడియోలు పెడుతున్నారు. ఆన్ లైన్ స్టోర్లలో డేటింగ్ యాప్స్ ఓపెన్ చేసేందుకు చిన్నారులకు యాక్సస్ ఇస్తున్నారు.

వాషింగ్టన్ : చిన్న పిల్లలే లక్ష్యంగా ఆన్ లైన్ లో రోజురోజుకీ చెత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి.అభ్యంతరమైన ఫొటోలు, వీడియోలతో చిన్నారులను ఎట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆన్ లైన్ స్టోర్లలో డేటింగ్ యాప్స్ ఓపెన్ చేసేందుకు చిన్నారులకు యాక్సస్ ఇస్తున్నారు. దీంతో 12ఏళ్ల లోపు పిల్లలు వీటిని చూసి పాడైపోతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC)సంస్థ డేటింగ్ యాప్స్ చిన్నారులపై చెడు ప్రభావం చూపిస్తున్నాయంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ఎఫ్ టీసీ సూచనలతో ఐటీ దిగ్గజాలు ఆపిల్, గూగుల్ తమ ఆన్ లైన్ స్టోర్లలో నుంచి 3 డేటింగ్ యాప్ లను తొలగించాయి.

ఇటీవల ఉక్రేయిన్ ఆధారిత వైల్డ్ ఎల్ఎల్ సీ సంస్థను FTC హెచ్చరించింది. ఉక్రేయిన్ సంస్థ మీట్24, ఫాస్ట్ మీట్, మీట్ 4యూ అనే పేరుతో మూడు డేటింగ్ యాప్స్ ను ఆపరేట్ చేస్తోంది. ఈ మూడు యాప్స్ చైల్డ్ ఆన్ లైన్ ప్రైవసీ ప్రొటక్షన్ యాక్ట్ (COPPA), FTC Actను ఉల్లంఘించేలా ఉండటంతో ఈ యాప్స్ ను డిలీట్ చేయాల్సిందిగా గూగుల్, ఆపిల్ సంస్థలకు ఎఫ్ టీసీ కమిషన్ సూచించింది. ‘ఎఫ్ టీసీ సూచనల మేరకు.. గూగుల్, ఆపిల్ యాప్ స్టోర్ల నుంచి డేటింగ్ యాప్స్ డిలీట్ చేయడం జరిగింది’ అని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డేటింగ్ యాప్స్.. చిన్నారుల పుట్టినతేదీలు, ఈమెయిల్ అడ్రస్ లు, ఫొటోగ్రాఫ్, రియల్ టైం లోకేషన్ సేకరిస్తున్నట్టు గుర్తించారు. 

ఈ మూడు యాప్స్ లో 13ఏళ్లలోపు యూజర్లకు అనుమతి లేదని తమ ప్రైవసీ పాలసీల్లో స్పష్టం చేశాయి. అయినప్పటికీ.. 13లోపు పిల్లలను ఈ డేటింగ్ యాప్స్ వాడకుండా బ్లాక్ చేయడంలో విఫలం అవుతున్నాయి. డేటింగ్ యాప్స్ పై ఎఫ్ టీసీ సిబ్బంది రివ్యూ చేయగా.. ఇందులో 12ఏళ్ల లోపు చిన్నారులే అధికంగా ఉన్నట్టు గుర్తించారు. అడల్ట్ యూజర్లు చిన్నారులతో కమ్యూనికేట్ అయ్యేలా అనుమతించడం చట్టరీత్యా నేరం. వైల్డ్ డెక్ యాప్స్ ద్వారా పిల్లలతో కాంటెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించిన వారంతా క్రిమినల్ కేసులను ఎదుర్కోంటున్నట్టుగా ఎఫ్ టీసీ తెలిపింది.

ఈ విషయంలో చిన్నారుల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని, వారు ఇంటర్నెట్ లో ఏం చూస్తున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తు ఉండాలని FTC, COPPA నిబంధనలు సూచిస్తున్నాయి. 13ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాలంటే ముందుగా వారి తల్లిదండ్రుల సమ్మతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించాయి. ఆన్ లైన్ యాప్ సంస్థలు తమ ప్రైవసీ పాలసీల్లో 13ఏళ్లలోపు చిన్నారులకు సంబంధించి కచ్చితమైన పాలసీలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.