Tea or Coffee: టీ లేదా కాఫీ రెండింటిలో హెల్త్‌కు ఏది మంచిది..

ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు తెలియకుండానే ఏదో ఒకటి తాగేస్తుంటే..

Tea or Coffee: టీ లేదా కాఫీ రెండింటిలో హెల్త్‌కు ఏది మంచిది..

Tea Or Coffee Which Is A Healthier Pick For You

Tea or Coffee: ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు తెలియకుండానే ఏదో ఒకటి తాగేస్తుంటే.. మరికొందరు రుచి కోసం కావాలని తాగేవాళ్లుంటారు. కానీ, మన మూడ్ ను మార్చే ఈ ఛాయ్ లేదా కాఫీ ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇస్తుందనే కారణంతోనే తాగుతున్నామా.. అసలు ఈ రెండింటిలో మనకు ఏది బెటర్.

టీ తాగుతారా
టీలో బ్రెయిన్ ను స్టిమ్యులేట్ చేయించే యాంటీ ఆక్సిడెంట్ అయిన థీనైన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల అలర్ట్‌నెస్ పెరగడమే కాకుండా ఫోకస్, అటెన్షన్, చురుకుదనం పెరుగుతాయి. రెగ్యూలర్‌గా టీ తాగేవాళ్లలో ఎముక సాంద్రత ఎక్కువ ఉండటం, బెటర్ ఇమ్యూనిటీ గమనించారు.

టీ తాగితే పళ్లపై మరకలు, వాటిని పసుపు రంగులో మార్చే గుణం ఉందని నమ్ముతారు. టీలో ఆహారం నుంచి ఐరన్ శోషించుకునే శక్తి తక్కువగానే ఉంటుంది. స్టడీ ప్రకారం.. ఆహారంతో పాటు టీ తాగితే 62శాతం ఐరన్ గ్రహించే శక్తిని కోల్పోతాం. అదే కాఫీలో అయితే 35శాతంగా ఉంటుంది.

కాఫీయే ఛాయీస్
కాఫీ.. కొందరు నిపుణుల అంచనా ప్రకారం.. కెఫ్ఫైన్ అనేది వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది వర్కౌట్ కు ముందు బ్లాక్ కాఫీ తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అందులో కొవ్వును కరిగించే గుణం ఉంటుంది. ఇక కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యల రిస్క్ కూడా తగ్గుతుందని తెలిసింది.

కాకపోతే గ్యాస్ట్రిక్, కడుపులో సమస్యలు ఏవైనా ఉంటే కాఫీ వాటిని రెట్టింపు చేస్తుంది. ఇంకా ఫిల్టర్ చేయని కాఫీ మనలో ఉండే కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతుంది. రోజుకు 4కప్పుల కంటే కాఫీ ఎక్కువ తాగితే బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. వాటి వల్ల ఎముకలు బోలుగా మారి గాయాలకు, విరిగిపోవడానికి కారణమవ్వొచ్చు.

రెండింటిలో ఏది బెటర్
కెఫ్ఫైన్ లెవల్స్ పరంగా చూస్తే.. కాఫీ కంటే టీ బెటర్. ఒక కప్పు బ్లాక్ టీలో 14-70మిల్లీ గ్రాముల కెఫ్ఫైన్ ఉంటుంది. అదే కాఫీలో అయితే 95-200మిల్లీగ్రాముల కెఫ్ఫైన్ ఉంటుంది.

ఇక టీ లేదా కాఫీ బెటర్ అని ఎంచుకోవాలంటే.. అది తయారుచేసే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక రెండింటిలో ఏది తాగాలన్నా ఒక్కసారి మాత్రమే బాయిల్ చేసి గ్లాసులో పోసుకుని తాగేయాలి. అప్పుడే ఫ్లేవర్లు, యాంటీ ఆక్సిడెంట్లు అలాగే ఉంటాయి.

మీరు కాఫీకి డై హార్డ్ లవర్ అయితే.. రోజుకు రెండు కప్పులకు మించి తాగకపోవడం మంచిది. కొద్ది మొత్తంలోనే టీ లేదా కాఫీ తీసుకోవడమే చాలా ఉత్తమం. అప్పుడే మనం అనుకున్నట్లు సంతృప్తిపడటమే కాక కెఫ్ఫైన్ ఓవర్ డోస్ కాకుండా ఉంటుంది.