Cholesterol : ఎన్నో ఆరోగ్య సమస్యలకు మూలం అదే ! దానితో జాగ్రత్త?

చెడు కొవ్వులు నియంత్రణలో ఉండాలంటే పీచు అధికంగా ఉండే ఆహారాలైన ఆకు కూరలు, కూరగాయలు, కాల్షియం అధికంగా ఉండే పాలు, గుడ్లు, చేపలు, పండ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.

Cholesterol : ఎన్నో ఆరోగ్య సమస్యలకు మూలం అదే ! దానితో జాగ్రత్త?

That is the source of many health problems! Careful with that?

Cholesterol : గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇలా అనేక సమస్యలకు ముఖ్యకారణం ఊబకాయం. శరీరంలో కొవ్వులు పేరుకుపోవటంతో చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలో కొవ్వులు పెరిగితే రక్తంలో కొలెస్ట్రాల్ స్ధాయి కూడా పెరుగుతుంది. అయితే కొవ్వుల్లోను మంచివి, చెడ్డవి రెండు రకాలుగా ఉంటాయి. చెడు కొవ్వులను ఎల్డీఎల్ గా పిలుస్తుండగా, మంచి కొవ్వులను హెచ్ డిఎల్ గా పిలుస్తారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అన్నది తక్కువ మోతాదులో ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

అధునిక జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవలికాలంలో చాలా మంది ఊబకాయం, అధిక కొవ్వుల సమస్యతో బాధపడుతున్నారు. చెడు కొవ్వుల స్ధాయి మోతాదుకు మించి ఉండటంతో అనేక జబ్బుల బారిన పడాల్సిన పరిస్దితి ఎదురవుతుంది. దీంతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండె సమస్యలు అకస్మాత్తుగా ఉత్పన్నం అవుతాయి. ఈ చెడు కొవ్వుల స్ధాయి రక్తంలో తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

చెడు కొవ్వులు తగ్గాలంటే మంచి కొవ్వులు పెరిగేలా చూసుకోవాలి. దీనికి గాను తీసుకునే ఆహారంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. హెచ్ డీఎల్ కొవ్వు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్లు అని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండె జబ్బుల సమస్యలు దరిచేరవు.

చెడు కొవ్వులను నియంత్రించుకునేందుకు ;

చెడు కొవ్వులు నియంత్రణలో ఉండాలంటే పీచు అధికంగా ఉండే ఆహారాలైన ఆకు కూరలు, కూరగాయలు, కాల్షియం అధికంగా ఉండే పాలు, గుడ్లు, చేపలు, పండ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అంతేకాకుండా ఒమేగా 3 కొవ్వులు, ఓట్స్, గ్రీన్ టీ, ఆలివ్ నూనె, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, మొలకెత్తిన ధాన్యాలు వంటివి తీసుకోవాలి. నీలి రంగులో ఉండే కూరగాయలు, పండ్లు తీసుకుంటే మంచి కొవ్వులను క్రమేపి పెంచుకోవచ్చు. అదే సమయంలో చెడు అలవాట్లైన మద్యపానం, ధూమపానం కు దూరంగా ఉండాలి.