Covid-19 Mutate : వుహాన్‌లో పుట్టిన కరోనావైరస్.. 6,600 కన్నా ఎక్కువ సార్లు మ్యుటేట్ అయింది

కరోనా మహమ్మారిని వ్యాప్తిచేసే (Sars-CoV-2 virus) అనే వైరస్.. తన ప్రత్యేకమైన స్పైక్ ప్రోటీన్ ను 6,600 కంటే ఎక్కువ సార్లు మ్యుటేట్ అయిందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.

Covid-19 Mutate : వుహాన్‌లో పుట్టిన కరోనావైరస్.. 6,600 కన్నా ఎక్కువ సార్లు మ్యుటేట్ అయింది

Coronavirus That Causes Covid 19 Has Mutated More Than 6,600 Times

Covid-19 mutated more than 6,600 times : మొట్టమొదటగా చైనాలోని వుహాన్‌లో ఉద్భవించిన కరోనా మహమ్మారిని వ్యాప్తిచేసే (Sars-CoV-2 virus) అనే వైరస్..  2019 డిసెంబర్ నుంచి తన ప్రత్యేకమైన స్పైక్ ప్రోటీన్ 6,600 కంటే ఎక్కువ సార్లు మ్యుటేట్ అయిందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. వైరస్‌‌లు ఎప్పటికప్పుడూ తమ రూపాన్ని మార్చుకుంటుంటాయి. ఇలా రూపాంతంరం చెందే క్రమంలో వైరస్ లు మ్యుటేట్ అవుతుంటాయి. అప్పుడు వాటి స్పైక్ ప్రోటీనులో జన్యు కోడ్‌కు మార్పు జరిగి కొత్తగా రూపాంతరం చెందుతుంటాయి. వైరస్ లు మనుగడ సాగించడం కోసమే ఇలా మ్యుటేట్ అవుతుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ క్రమంలో వైరస్ మరిన్ని కాపీలను తయారుచేసుకుంటుంది.

గత ఏడాది ఫిబ్రవరిలో విస్తృతంగా వ్యాపించిన D614G మ్యుటేషన్.. ఇప్పుడు ఈ వైరస్ అన్ని శాంపిల్స్ లో కనిపిస్తోంది. అది ఏ వేరియంట్ అయినా ఈ మ్యుటేట్ ఉంటోంది. ఈ వేరియంట్ చాలా విస్తృతంగా మారింది.. దీనిని G క్లాడ్‌గా గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), G క్లాడ్‌లో ఇన్ఫెక్టివిటీ ట్రాన్స్‌మిషన్ పెరిగిందని వెల్లడించింది. దీని తీవ్రత ఎక్కువ ఉండదు.. ఇది డయాగ్నస్టిక్స్, ట్రీట్మెంట్ లేదా టీకాలను ప్రభావితం చేయలేదు కూడా.

ఈ G-క్లాడ్, దాని ఉప క్లాడ్స్‌గా కలిసి గత ఏడాది జూలైలో యుకె వేరియంట్ B-117 పేరుతో వచ్చింది.. గత ఏడాదిలో మధ్యకాలం నుండి అన్ని కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లకు కారణమయ్యాయి. వూహాన్‌లో ఉద్భవించిన అసలు వైరస్ పూర్తిగా మారిపోయింది. ఈ మ్యుటేట్ తొందరగా వ్యాపిస్తుంది.. తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది.. అంతేకాదు.. యాంటీబాడీలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది. చికిత్స తీసుకున్నా దీని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. టీకాలు కూడా సరిగా పనిచేయలేవు. వైరస్ వేరియంట్లు.. సాధారణంగా ఐదు నుండి 15 మ్యుటేట్లను కలిగి ఉంటాయి.

ప్రస్తుతం భారతదేశంలో మూడు VOC వేరియంట్లు మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదట కనుగొన్న రెండు వేరియంట్లు ఇందులో ఉన్నాయి. గత నెలలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదలకు ఇవే కారణమయ్యాయి. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. 22 మిలియన్ల కేసులు, 235,000 కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి.

కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్ 2019 డిసెంబర్‌లో ఉద్భవించినప్పటి నుంచి 6,600 కన్నా ఎక్కువ ప్రత్యేకమైన మ్యుటేషన్లు జరిగాయని పరిశోధక బృందం గుర్తించింది. పగలు లేదా రాత్రి సమయాల్లో ప్రతి రెండు గంటలకు ఒక ప్రత్యేకమైన మ్యుటేషన్‌ జరుగుతుంటుంది. టీకాలు వేసిన వ్యక్తులలో సార్స్-కొవి-2 వ్యాప్తి రేటు 1 శాతం కంటే తక్కువగా ఉందని పలు నివేదికల్లో వెల్లడైంది.