Rainy Season : వర్షాకాలం ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు!

వర్షాకాలంలో నీరు కలుషితమై ఉంటుంది. అందువల్ల సీ ఫుడ్ తినడం మానుకోవాలి. చేపలు తినడం వల్ల కలరా లేదా డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసిడిటీతో బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహారం తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు మానుకోండి.

Rainy Season : వర్షాకాలం ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు!

Rainy Season

Rainy Season : వర్షాకాలం ఆరోగ్యంపై తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కాలంలో అనేక రోగాలు చుట్టుముట్టి బాధిస్తుంటాయి. వర్షాలు పడడంతో దోమలు, ఈగలు వంటి కీటకాల బెడద పెరుగుతుంది. ఇవి వైరల్ ఫీవర్లు, ఇన్‌ఫెక్షన్లు కలిగిస్తాయి. తరచూ జలుబు, దగ్గు వంటివి రావడంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ట్రోఎంటెరిటిస్, అల్సర్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి.

అధిక వర్షాల వల్ల ఆరోగ్యానికి ముప్పు కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని నిరోధించడానికి క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అందువల్ల, సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, జంక్, స్పైసీ, జిడ్డుగల ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ కలిగిన పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి. అవి మన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇచ్చే మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. పచ్చి ఆకు కూరలను తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి సూక్ష్మక్రిములతో నిండి ఉంటాయి. ఒకవేళ తినాలని భావిస్తే మితంగా తినండి, ప్రేగులకు అనుకూలమైన, తేలికగా జీర్ణమయ్యే తేలికైన ఆహారాన్ని ఎంచుకోండి.

ముడి కూరగాయలకు బదులుగా ఆవిరి లేదా ఉడికించిన కూరగాయలను తినాలి. ఎందుకంటే రెండోవి బ్యాక్టీరియా, వైరస్‌లను దరిచేరకుండా చూసుకోవచ్చు. కాసి చల్లార్చిన నీరు తాగడం అవసరం. వర్షాకాలంలో కడుపు, పేగు, కాలేయ ఇన్‌ఫెక్షన్‌లతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా ఇన్ఫెక్షన్ల కారణంగా రోగాలు అకస్మాత్తుగా దరిచేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వేడి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాలు తినరాదు.

వర్షాకాలంలో నీరు కలుషితమై ఉంటుంది. అందువల్ల సీ ఫుడ్ తినడం మానుకోవాలి. చేపలు తినడం వల్ల కలరా, డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసిడిటీతో బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహారం తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు మానుకోండి. వర్షం కారణంగా వ్యాయామాలు చేసేందుకు బయటకు వెళ్ళలేని పరిస్ధితి ఉంటుంది కాబట్టి జీర్ణ క్రియలు సాఫీగా ఉండాలంటే ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చర్మపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వేడినీటితో రోజు రెండు పూటలా స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై పేరుకున్న మురికి , క్రిములు తొలగిపోతాయి. అలర్జీలు, చర్మ సమస్యలు దరి చేరకుండా చూసుకోవచ్చు. వర్షకాలంలో స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఆహారం కలుషితమై ఉండే అవకాశాలు ఉన్నందున ఆరోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. తినే ఆహారం తక్కువ మొత్తంలో ఉండేలా చూసుకోవాలి. అధిక మొత్తంలో ఆహారం తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. అధిక మొత్తంలో తినటం వల్ల జీర్ణ వ్యవస్ధపై భారం పడుతుంది. నూనె తో తయారు చేసిన పదార్ధాల జోలికి వెళ్ళవద్దు.