Diabetes : వాయుకాలుష్యంతో మధుమేహం ముప్పు! పట్టణ వాసుల్లోనే అధికమా?

ఇప్పటి వరకు మధుమేహానికి జీవనశైలి, అధిక రక్తపోటు, ఊబకాయం, వంటి కారణాలు ఉన్నట్లు చెప్పుకుంటూ వచ్చాం. అయితే అశ్ఛర్యం కలిగించే విషయం ఏటంటే వాయు కాలుష్యం, క్రిమి సంహారకాల వినియోగించిన ఆహారపదార్ధాలు తీసుకోవటం సైతం మధుమేహానికి కారణమౌతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Diabetes : శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించనప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు పెరుగుతాయి. ఈ పరిస్ధితి దీర్ఘకాలికంగా గుండె, మూత్ర పిండాల వైఫల్యాలకు దారి తీస్తుంది. ఆహారంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తామో అప్పుడే మధుమేహం అదుపులోకి వస్తుంది. మధుమేహాన్ని అదుపుచేయని పక్షంలో ఆది శరీరంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది.

ఇప్పటి వరకు మధుమేహానికి జీవనశైలి, అధిక రక్తపోటు, ఊబకాయం, వంటి కారణాలు ఉన్నట్లు చెప్పుకుంటూ వచ్చాం. అయితే అశ్ఛర్యం కలిగించే విషయం ఏటంటే వాయు కాలుష్యం, క్రిమి సంహారకాల వినియోగించిన ఆహారపదార్ధాలు తీసుకోవటం సైతం మధుమేహానికి కారణమౌతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్య పల్లె వాసులకంటే పట్టణ వాసులే ఈ తరహా మధుమేహం బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

మధుమేహానికి దారి తీస్తున్న వాయు కాలుష్యం ;

ముఖ్యంగా పట్టణాల్లో సూక్ష్మ దూళి కణాలతో కూడిన నుసి పదార్ధం ఊపిరితిత్తులు, గుండె జబ్బులతో పాటు మధుమేహానికి కారణమౌతుంది. కణాల పై రక్షణపొర పనితీరును మార్చటం ద్వారా ఇన్సులిన్ నిరోధకత పెరిగేలా చేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. దీని వల్ల ఇన్సులిన్ కణాల స్పందన మందగిస్తుంది. వాయు కాలుష్యం అధికంగా ఉన్న చోట ఆప్రాంత నివాశితులలో ఎక్కువ మంది మధుమేహం బారిన పడుతుండటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

వాయు కాలుష్యం కారణంగా మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో సంచరించే సమయంలో ముక్కుకు మాస్కులు ధరించటం తప్పనిసరి చేసుకోవాలి. పరిశ్రమల నుండి వెదజల్లే పొగ, వ్యర్ధాల వాసనలకు కాస్త దూరంగా ఉండటం మంచిది. క్రిమిసంహారక మందులను ఉపయోగించి పండించిన ఆహారాలు సైతం మధుమేహానికి దారితీస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి క్రిమి సంహాకర మందులను వినియోగించిన ఆహారాపదార్ధాలను తీసుకోవటం మానేయాలి. సేంద్రీయ ఆహార ఉత్పత్తులను తీసుకోవటం ద్వారా మధుమేహం బారిన పడకుండా చూసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు