దక్షిణాది వంటకాన్ని ఖూనీ చేసి పాలక్ పన్నీర్ ఇడ్లీ అని పేరు పెట్టేశారు.. ట్వీట్లతో తట్టుకోలేనన్ని చివాట్లు

దక్షిణాది వంటకాన్ని ఖూనీ చేసి పాలక్ పన్నీర్ ఇడ్లీ అని పేరు పెట్టేశారు.. ట్వీట్లతో తట్టుకోలేనన్ని చివాట్లు

అరుదైన వంటకాల గురించి చెప్తే చాలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. అది పరవాలేదు కానీ, మరీ ఇంత ఘోరంగా చేసేసి నార్త్‌ని.. సౌత్ ని కలిపేద్దామంటే ఎవరికీ మాత్రం చికాకుపుట్టదు. దక్షిణాదికి చెందిన ఇడ్లీ.. నార్త్ లో చాలా తక్కువగా దొరుకుతుంది. అక్కడవరకూ ఓకే కానీ, పాలక్ పన్నీర్ స్పెషల్ గా వండుకుని ఇష్టంగా తినే నార్త్ కల్చర్ ను.. సౌత్ తో కలిపేశానంటూ ఓ బ్లాగర్ పెట్టిన పోస్టు కాంట్రవర్సీ అయింది.

దక్షిణాది వంటలకు మార్పులు చేసి పంజాబీ వంటకాలుగా చేసేస్తున్నారు. ఇలాగే పాలక్ పన్నీర్ ఇడ్లీ అని తయారుచేసి.. సౌత్ ను నార్త్ తో కలిపేశానని చెప్పుకొస్తుంది. బెంగళూరుకు చెందిన పాపులర్ ఫుడ్ బ్లాగర్ మీనా.. ఈ వంటకాన్ని షేర్ చేశారు. మీనా సంప్రదాయ వంటకాలను తీసుకుని ప్రయోగాలు చేస్తుంటారు. పలు మార్లు కొత్త వంటాకలను షేర్ చేసిన ఆమె ఈ స్టైల్లోనే మంగళవారం పాలక్ పన్నీర్ ఇడ్లీ తయారీ విధానం గురించి చెప్పారు.

పాలక్-పన్నీర్ అనేది సాంప్రదాయకమైన కాంబినేషన్. ఇది ఉత్తరాధి వంట. నార్త్-సౌత్ కలిపి టేస్ట్ చేయాలనుకునేవారికి ఇది బాగా సెట్ అవుతుంది. పన్నీర్ స్టఫ్ తో పాలక్ ఇడ్లీలు అనేది ఓ డెలీషియస్ కాంబినేషన్. అని ఆమె చెప్తున్నారు.. రెగ్యూలర్ ఇడ్లీని తోటకూరతో కూడా ట్రై చేసిందట.

ట్విట్టర్ యూజర్లు.. అందులోనూ గ్రీన్ కలర్ ను ఇష్టపడని వారు మాత్రం మీనాను ఆటాడేసుకుంటున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయకండి మహాప్రభో అని వేడుకుంటున్నారు. దీనిపై పలు రకాల స్పందనలు వినిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పొగడ్తలు కురుస్తుంటే ట్విట్టర్లో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కొన్ని వంటకాలు ఒరిజినల్ గానే బాగుంటాయి చెడగొట్టొద్దని సలహాలు ఇస్తున్నారు.



ఇడ్లీని అమితంగా ఇష్టపడే వాళ్లు వేరే దానితో కలిపి చూడలేమంటూ.. ఇలాంటి ప్రయోగాలు చేయకండి మహాప్రభో అని వేడుకుంటున్నారు. మరి ఆ ఇడ్లీ కలర్ చూస్తే మీరేమంటారో..