Body Fat : శరీరంలో కొవ్వును కరిగించే….ఉత్తమ ఆహారాలు ఇవే!…

భారతీయ వంటకాల్లో విరివిగా వాడే మసాల దినుసుగా పసుపును చెప్పవచ్చు. పసుపులో ఔషధగుణాలతో పాటు యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు, శరీరంలోని కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి,కొవ్వును కరిగిస్తుంది.

Body Fat : శరీరంలో కొవ్వును కరిగించే….ఉత్తమ ఆహారాలు ఇవే!…

Fat

Body Fat : మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటి వల్ల అనేక ఆనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. మనం రోజు వారిగా తీసుకునే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేయటం ద్వారా శరీరంలోని అదనపు కొవ్వులను కరిగించుకునేందుకు వీలుంటుంది. ఇలా చేయటం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు వంటి ప్రమాదాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు నిల్వలను కరిగించుకునేందుకు కొన్ని రకాల ఉత్తమ ఆహారాలు మీకోసం…

పసుపు: భారతీయ వంటకాల్లో విరివిగా వాడే మసాల దినుసుగా పసుపును చెప్పవచ్చు. పసుపులో ఔషధగుణాలతో పాటు యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు, శరీరంలోని కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి,కొవ్వును కరిగిస్తుంది.

తేనె: పంచదార కంటే అరచెంచా తేనె ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. శరీరంలోని కొవ్వు కరిగించుకోవాలంటే, తేనె ఒక అద్భుత ఔషధంగా చెప్పవచ్చు. శరీరంలోని కొవ్వులు కరిగించటంలో తేనె ప్రభావ వంతంగా పనిచేస్తుంది.

పచ్చి ఉల్లిపాయ : ఉల్లిపాయలోని రసం శరీరంలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి, కొవ్వును కరిగిస్తుంది. భోజనం చేసే సందర్భంలో టచ్చింగ్ ఉల్లిపాయలను తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరంలోని అదనపు కొవ్వులు కరిగించటంలో ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది.

యాలకలు: మసాలా దినుసుల్లో ఇది ఒకటి. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. ఆహారాన్ని అధిక మోతాదులో తీసుకున్న సందర్భంలో యాలకను నోట్లో వేసుకొని నమలటం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తుంది.

వెల్లుల్లి: మీ శరీరంలో కొవ్వును కరిగించుకోవాలనుకుంటే, మీరు ప్రతి రోజూ మీ వంటల్లో తప్పనిసరిగా వెల్లుల్లిని చేర్చడం మర్చిపోకండి . వెల్లుల్లిలో కొవ్వు కరిగించే కొన్ని యాసిడ్స్ పుష్కలంగా ఉండి, ఇన్సోలబుల్ ఫ్యాట్స్ ను కరిగిస్తుంది.

రాగులు: మీ శరీరంలో బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకొన్నప్పుడు రాగులు ఒక అద్భుత పరిష్కార మార్గం. ఒక కప్పు రాగుపిండి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే బరువు తగ్గటంతోపాటు, కొవ్వులు కరిగిపోతాయి.

పచ్చిమిర్చి: త్వరగా బరువు తగ్గాలనుకొనే వారికి పచ్చిమిర్చి బాగా సహాయపడుతుంది. మీ రెగ్యులర్ డైట్ లో పచ్చిమిర్చిలను తీసుకోవాలి, పచ్చిమిర్చిలోని పెప్పైన్ కంటెంట్ కొవ్వు కరగించడానికి అద్భుతంగా సమాయపడుతుంది.

ఓట్ మీల్: బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో ఓట్ మీల్ తీసుకోవటం మంచిది. ఓట్ మీల్ అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. ఓట్స్ ఫ్యాట్ ను కరిగించడం మాత్రమే కాదు. బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తుంది.

క్యాబేజ్: తాజాగా ఉండే క్యాబేజ్ ను రోజులో ఒక సారి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. త్వరగా బరువు తగ్గాలనుకొనే వారు, క్యాబేజ్ జ్యూస్ బాగా హెల్ప్ అవుతుంది.

గుడ్లు: ఉడికించి గుడ్లు ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ప్రతి రోజూ రెండు గుడ్లను ఉడికించి తీసుకోవచ్చు. అయితే అందులోని తెల్లని పదార్ధాన్ని మాత్రమే తీసుకోవటం మంచిది. దీని వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందటమే కాక, బరువును తగ్గించుకోవచ్చు.