Brain Function : మెదడు పనితీరు మెరుగు పరిచే ఆహారాలు ఇవే!..

జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. ఉండే ఆంథోసయనిన్, క్వెర్సెటిన్.. అనే రెండు యాంటీఆక్సిడెంట్లే దీనికి కారణం.

Brain Function : మెదడు పనితీరు మెరుగు పరిచే ఆహారాలు ఇవే!..

Food

Brain Function : శరీరానికి శక్తి ఎంత అవసరమో మెదడు చురుగ్గా ఆలోచించేందుకు ఎంతోకొంత శక్తి అవసరమవుతుంది. మనం రోజువారి తీసుకునే ఆహార పదార్ధాల మెనూలో మన శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్ధాలతోపాటు మెదడు పనితీరుకు ఉపయోగపడే ఆహారపదార్ధాలను తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. తద్వారాజ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే ఇందుకోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూద్ధాం…

శరీరంలో నీటిస్థాయి తగినంత ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడంతో పాటు మెదడు కూడా చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు, పండ్ల రసాలు తాగడం ఉత్తమం. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే వాల్‌నట్స్, చేపలు.. మొదలైన ఆహార పదార్థాలు జ్ఞాపకశక్తిని పెంచడంలో తోడ్పడతాయి. అలాగే ఈ ఆమ్లాలు మెదడులోని న్యూరోట్రాన్స్‌మిట్టర్స్‌ పనితీరును మెరుగుపరిచి మెదడుకు రక్షణనిస్తాయి. వాల్‌నట్స్‌లో ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ బి6, మెగ్నీషియం.. మెదడును సురక్షితంగా ఉంచడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి.

జ్ఞాపకశక్తిని పెంపొందించే గుణం టమాటాలకు ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఉండే ‘లైకోపీన్’ అనే యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు కణజాలాల్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. అలాగే ఎవరైతే రోజూ టమాటాల్ని ఆహారంలో భాగంగా తింటారో వారి మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. ఉండే ఆంథోసయనిన్, క్వెర్సెటిన్.. అనే రెండు యాంటీఆక్సిడెంట్లే దీనికి కారణం. జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ సహాయపడే పానీయం గ్రీన్ టీ. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజూ కనీసం మూడు కప్పుల గ్రీన్‌టీ తాగితే అటు శరీర ఆరోగ్యానికి, మెదడుపనితీరుకు మంచిది.

బాదంపప్పులో ఒమేగా-3, 6 ఫ్యాటీ ఆమ్లాలు, ‘బి6’, ‘ఇ’ విటమిన్లు అధికంగా లభిస్తాయి. ఇవి కూడా జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి చక్కగా ఉపకరిస్తాయి. కాబట్టి ఐదారు బాదం పప్పుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తింటే మంచి ఫలితం ఉంటుంది.మెదడు చురుకుదనాన్ని పెంచే శక్తి పసుపుకి ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ఇందులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం అల్జీమర్స్ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. కాబట్టి దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

రోజూ అర కప్పు చొప్పున బ్లూబెర్రీలను ఆహారంలో భాగంగా తినాలి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు గ్రాహక శక్తిని రెట్టింపు చేస్తాయి. యాపిల్స్‌పై ఉండే తొక్క తొలగించకుండా తింటే జ్ఞాపకశక్తిని పెంచే క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరానికి అందుతుంది. విటమిన్ సి అధికంగా లభించే నిమ్మ, దానిమ్మ.. వంటి వాటిని కూడా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తిని బాగా పెంచుకోవచ్చు. తేనె తీసుకోవటం ద్వారా అందులో ఉండే మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ బి.. మొదలైనవన్నీ మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. వీటితో పాటు తేనెలో ఉండే ఫ్రక్టోజ్ మెదడుకు ఇంధనంలా పని చేస్తుంది.

జ్ఞాపకశక్తిని మరింత రెట్టింపు చేసుకోవాలంటే రోజుకో బైట్ చొప్పున డార్క్ చాక్లెట్ తినడం మంచిది.ఇందులో ఉండే కెఫీన్ మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం..గుమ్మడి గింజల్లో ఉండే జింక్ మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తాయి.మోనోఅన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొవ్వుల స్థాయులు తగ్గిపోతాయి. శరీర భాగాలన్నింటికీ రక్తప్రసరణ బాగా జరిగి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.