Sugar Levels : షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచే ఆహారాలు ఇవే!
చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఎసెన్షియల్ ఆయిల్ పుష్కలంగా ఉంటాయి. చికెన్, గుడ్లు , చేపలు ప్రోటీన్ యొక్క మంచి మూలం. అదనపు కేలరీలను నివారించడానికి గ్రిల్ చేసుకుని తినటం మంచిది.

Sugar Levels : శరీరంలో చక్కెర హెచ్చుతగ్గుల వల్ల కలిగే అనారోగ్యాన్ని వ్యాధి అని అంటున్నారు. వాస్తవానికి ఇది వ్యాధి కాదు. చక్కెర స్ధాయిలను అదుపులో ఉంచగలిగితే ఎంతకాలమైనా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ రావటానికి పోషకాలు లేని ఆహారం, జీవనశైలి, ముఖ్యమైన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. జన్యుపరమైన కారణాలు కూడా చక్కెర వ్యాధి రావటానికి దారి తీస్తాయి.
మనం ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలో చక్కెర ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా అదనంగా ఉత్పత్తి అయిన చక్కెర కాలేయంలో నిల్వ ఉంటుంది. పాంక్రియాస్ అనే అవయవం ఇన్‌సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. చక్కెరను జీర్ణం చేయడంలో పాంక్రియస్‌దే కీలకపాత్ర. చక్కెరను గ్లూకోజ్‌గా మార్చి నిల్వచేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ పాంక్రియస్ బాధ్యత. బ్లడ్ షుగర్ అనేది శరీరంలో ఇంధనం లాంటిది. మెదడు, నాడీ వ్యవస్ధ, శరీరంలోని ఇతర అవయవాల పనితీరుకు తోడ్పతుంది.
శరీరంలో చక్కెర స్ధాయి ఒక సాధారణ పరిమాణంలో ఉండాలి. కొంత మందిలో ఎక్కవగా, మరికొందరిలో తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర మోతాదులు అధికంగా ఉంటే తగ్గించాలి. లేదంటే డయాబెటిస్ బారిన పడతారు. అంతేకాకుండా నరాలు దెబ్బతినటం, కిడ్నీ వైఫల్యాలు,గుండె జబ్బులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. మధుమేహం సమస్య దరిచేరకుండా ఉండాలంటే రోజువారి తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆహార ఎంపికల్లో అవగాహన కలిగి ఉంటే జీవితకాలం చక్కెర హెచ్చుతగ్గులకు గురికాకుండా చూసుకోవచ్చు.
రోజువారిగా తీసుకునే ఆహారంలో ఫైబర్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల మెటబాలిక్ డిజార్డర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. ఊబకాయం వంటి అనేక జీవనశైలి వ్యాధులు దరిచేరవు. బీన్స్, గింజలు, విత్తనాలు లేదా టోఫు, చేపలు, సముద్రపు ఆహారం, చికెన్ , ఇతర పౌల్ట్రీ, గుడ్లు మరియు తక్కువ కొవ్వు పాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్లు మధుమేహం ఉన్నవారు తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నోటికి రుచికరంగా ఉంటుంది కదా అని ఏదిపడితే అదితినటం తగ్గించాలి. ఇలా తినటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. తినే ఆహారం విషయంలో సమతుల్యం పాటిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుచుకోవచ్చు.
చక్కెర స్ధాయిలను నియంత్రణలో ఉంచే ఆహారాలు;
నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. బాదం,వాల్‌నట్ వంటి నట్స్‌లో ఒమేగా-3,ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. వేపిన గింజలు అల్పాహారంగా తీసుకోవటం మంచిది. మధుమేహులకు నట్స్ మంచి మేలు చేస్తాయి. తృణధాన్యాలు మదుమేహులకు మంచి ఆహారంగా చెప్పవచ్చు. ఇవి విటమిన్లు ,ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ యొక్క గొప్ప మూలాన్ని కూడా కలిగి ఉంటాయి. జీర్ణక్రియలోను ఎంతో సహాయపడతాయి. బ్లాక్ వీట్, బార్లీ, ఓట్స్, క్వినోవా, రాగి వంటి తృణధాన్యాలను తీసుకోవటం మంచిది. బెర్రీలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్‌గా చెప్పవచ్చు. వాటిలో విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాపిల్, బెర్రీలు , పియర్ వంటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఎసెన్షియల్ ఆయిల్ పుష్కలంగా ఉంటాయి. చికెన్, గుడ్లు , చేపలు ప్రోటీన్ యొక్క మంచి మూలం. అదనపు కేలరీలను నివారించడానికి గ్రిల్ చేసుకుని తినటం మంచిది. ఆకలిని అరికట్టడంలో వీటిలో ఉండే ప్రోటీన్ సహాయపడుతుంది, ఎక్కువ గంటలు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. బరువు పెరగటానికి అవకాశం ఉండదు. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ రోజువారి ఆహారంలో బాగం చేసుకోవాలి. వీటిలో విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి . ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బచ్చలికూర, పాలకూర, ఉసిరి ఆకులు వంటి ఆకుకూరల్లో కార్బోహైడ్రేట్లు ,కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని సలాడ్‌లు, సూప్‌లుగా భోజనానికి ముందు తీసుకోవాల్సి ఉంటుంది. కొవ్వు,పిండి పదార్థాలు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులను ఆహారంగా ఎంచుకోవాలి. పుదీనా మజ్జిగ , తక్కువ కొవ్వు తో కూడిన పెరుగు వంటి వాటిని తీసుకోవటం మంచిది.
1Jobs : సీ డ్యాక్ లో ఉద్యోగాల భర్తీ
2Leopard : కర్నూలు జిల్లా కోసిగిలో చిరుత పులి కలకలం
3Andhra Pradesh: ఉచితంగా చేసుకున్న ఎంవోయూలో అవినీతి ఎలా జరుగుతుంది?: మంత్రి బొత్స
4Chandrababu Warning : వచ్చేది నేనే.. తప్పుడు అధికారులను వదలను- చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
5Telangana: తెలంగాణకు వచ్చి, రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి: మోదీకి కేటీఆర్ లేఖ
6Prophet row: దేశంలో నెలకొన్న పరిస్థితులకు కారణం నుపూర్ శర్మ కాదు: రాహుల్
7Srivari Salakatla Brahmotsavam: సెప్టెంబర్ 27 నుండి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక దర్శనాలు రద్దు
8Dasara: దసరా.. ఫిర్ షురూ!
9Banned on WhatsApp : మీ వాట్సాప్ బ్యాన్ అయిందా? అకౌంట్ అప్పీల్ ఇలా చేసుకోవచ్చు!
10Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ
-
Instagram Account : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ ఈజీగా డిలీట్ చేయొచ్చు!
-
Mahankali Bonalu : భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం
-
Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు
-
Manchu Mohan Babu: మంచు వారి ‘అగ్ని నక్షత్రం’!
-
TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
-
Sree Vishnu: నిజాయితీకి మారుపేరు.. అల్లూరి!
-
Tirumala Srivaru : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!