Omega 3 : ఒమెగా 3 లభించే శాఖాహారాలు ఇవే!

ఒమెగా 3 ఎక్కువగా చేపల్లో ఉంటుంది. చేపలను తమ ఆహారంలో భాగం చేసుకునే నాన్ వెజిటేరియన్స్ కు ఇది పుష్కలంగా అందుతుంది. వీరిలో దీనిలోపం చాలా తక్కువగా కనిపిస్తుంది.

Omega 3 : ఒమెగా 3 లభించే శాఖాహారాలు ఇవే!

Omega 3 (1)

Omega 3 : మనిషి శరీరానికి అవసరమైన పోషకాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఒకటి. ఇది రోజువారిగా శరీరానికి తగిన మోతాదులో అవసరమౌతుంది. చర్మ ఆరోగ్యం నుండి గుండె సమస్యలు, కీళ్ల నొప్పులు వరకు ఒమేగా -3 లు అనేక వైద్య పరిస్థితులను నివారించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఒమెగా 3 ఎక్కువగా చేపల్లో ఉంటుంది. చేపలను తమ ఆహారంలో భాగం చేసుకునే నాన్ వెజిటేరియన్స్ కు ఇది పుష్కలంగా అందుతుంది. వీరిలో దీనిలోపం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎటొచ్చి నాన్ వెజ్ ముట్టుకుండా వెజిటేరియన్ ఆహారాలను మాత్రమే తీసుకునే వారిలో ఒమేగా 3 లోపం కనిపిస్తుంది. దీని లోపం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అనారోగ్యాలు దరి చేరకుండా ఉండాలంటే శాఖాహారులు ఒమెగా 3 ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఒమెగా 3 పోషకానికి సబంధించి పెద్దవాళ్లకు రోజుకు సగటున 1.5 గ్రాముల నుండి 2గ్రాముల వరకు ఒమెగా 3 అవసరం అవుతుంది. ప్రతిరోజు 5 వాల్ నట్స్ తింటే సగటున 600 మిల్లీ గ్రాముల ఒమెగా 3 అందుతుంది. అలాగే మూడు టీ స్పూన్ల వరకు చియా సీడ్స్ లేదా ఫ్లాక్స్ సీడ్స్ , గుమ్మడి గింజలు తింటే రోజుకు కావాల్సిన ఒమెగా 3 లో 90శాతం శరీరానికి అందుతుంది. ఆవ నూనెలో సైతం ఒమేగా 3 ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ ఆవనూనెలో 1.28 గ్రాముల ఒమేగా 3 లభిస్తుంది. పాలు, పెరుగలలో సైతం ఒమెగా 3 లభిస్తుంది. అయితే వీటిలో చాలా తక్కువ మోతాదులో ఇది ఉంటుంది. బ్రస్సెల్స్ మొలకలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలంగా చెప్పవచ్చు. సోయాబీన్ నూనెలో గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ నూనె ఒమేగా -3 కొవ్వు అమ్లాలతో నిండివుంటాయని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ బీన్స్ గా పిలవబడే రాజ్మా, సముద్రపు పాచి వంటి ఆహారాల్లో సైతం ఒమెగా 3 కొవ్వు అమ్లాలు లభిస్తాయి.