Neck Wrinkles : మెడపై ముడతలను నివారించే సహజపదార్ధాలు ఇవే!

చర్మానికి మేలైన మాయిశ్చరైజర్ తేనె. స్కిన్ లేయర్స్ లోకి అద్భుతంగా షోషింపబడుతుంది, ఇందులో ఉండే విటమిన్ బి మరియు పొటాషియంలు స్కిన్ ఎలాసిటి పెంచడంలో సహాయపడుతుంది.

Neck Wrinkles : మెడపై ముడతలను నివారించే సహజపదార్ధాలు ఇవే!

Wrinkles On The Neck

Neck Wrinkles : ముఖంలో చారలు, ముడుతలను నివారించుకోవడానికి చాలా మంది మహిళలు వివిధ రకాల పద్దతులను అనుసరిస్తుంటారు. అయితే ముఖం క్రింద ఉండే మెడ భాగం విషయంలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. మెడకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మెడ మీద చర్మం ముఖ చర్మం కంటే మందంగా, చారలు, ముడతలతో కనిపిస్తుంది. ఎండవేడి కారణంగా వచ్చే యూవి కిరణాలు మెడ మీద పడటంతో ముడతలు ఎక్కువ కనబడతాయి. జెనటిక్ సమస్యలు, స్ట్రెస్, ఇతర కారణాలు సైతం మెడ మీద ముడతలకు కారణమౌతాయి. స్కిన్ ఆరోగ్యంగా ఉండాలంటే చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి చాలా అవసరం. చర్మంలో ఉత్పత్తి అయ్యే కొల్లాజెన్ స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి సరిగా లేనప్పుడు చర్మంలో సన్నని చారలు, ముడుతలు ఏర్పడతాయి.

మెడ మీద ముడుతలను నివారించుకోవడానికి ఫేస్ మాస్క్ లు అంతగా ఉపయోగపడవు. అయితే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను ఉపయోగించి ముడుతలను కనబడకుండా చేసుకోవచ్చు. ముఖంలో, మెడ మీద చారలను, ముడతలను నివారించుకోవడానికి నేచురల్ పదార్థాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మెడపై ముడతలను తొలగించటంలో సహాయపడే సహజపదార్ధాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

బొప్పాయి : మెడపై ముడుతలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ లో బొప్పాయి ఒకటి. బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ , పెక్టిన్ చర్మంలో ముడతను నివారించడంలో సమాయపడుతుంది. బాగా పండిన బొప్పాయిని ముక్కలుగా చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీనికి కొద్దిగా తేనె, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు కూడా అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

అరటిపండ్లు: అరటిపండ్లలో ఉండే విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ మెడమీద ముడుతలను నివారిస్తుంది. ఇవి ముడుతలను నివారించడం మాత్రమే కాదు, చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. బాగా పండిని అరటిపండును స్మూత్ గా పేస్ట్ చేసి మెడకు అప్లై చేయాలి. గంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని వారంలో రెండు రోజులు ఫాలో అయితే చాలు మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర జెల్ : అలోవెర జెల్లో మాలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెడపై ఉండే ముడతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలోవెర లీఫ్ ను కట్ చేసి అందులోని జెల్ తీసుకుని, మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మెడనలుపు కూడా తగ్గుతుంది. దీనికి కొద్దిగా నిమ్మరసం కూడా మిక్స్ చేయాలి. అలాగే దీనికి కొద్దిగా నిమ్మరసం కూడా జోడించాలి. దీన్ని మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. పావుగంట తరువాత నిముషాల తర్వాత చల్లటి నీటితో శుబ్రం చేసుకోవాలి.

బాదం ఆయిల్ : బాదంను రెగ్యులర్ గా తినడం లేదా బాదం ఆయిల్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంలో మ్యాజిక్ జరగుతుంది. ముడుతలను నివారిచడంలో  సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ , ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ మరియు ఓలియక్ యాసిడ్ స్కిన్ హెల్త్ కు మేలుచేస్తాయి. కొద్దిగా బాదం ఆయిల్ తీసుకుని, గోరువెచ్చగా చేసి , మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ : ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఇ మరియు ఎ లు ఫుష్కలంగా ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ చర్మానికి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మం డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్లో అర టీస్సూన్ ఆర్గానిక్ హనీ మిక్స్ చేయాలి. అందులోనే కొన్ని చుక్కల గ్లిజరిన్ మిక్స్ చేసి , మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. మెడ క్రింది నుండి పైకి మసాజ్ చేయాలి.

తేనె : చర్మానికి మేలైన మాయిశ్చరైజర్ తేనె. స్కిన్ లేయర్స్ లోకి అద్భుతంగా షోషింపబడుతుంది, ఇందులో ఉండే విటమిన్ బి మరియు పొటాషియంలు స్కిన్ ఎలాసిటి పెంచడంలో సహాయపడుతుంది. తేనెను మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. చర్మం టైట్ గా మారే వరకు అలాగే ఉండే తర్వాత చల్లటి నీటితో శుబ్రం చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ మాయిశ్చరైజర్ గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు: మెంతులు, మెంతి ఆకులలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ఇది ఫైన్ లైన్స్ మరియు ముడతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో ఫ్రీక్వెంట్ గా ముఖం శుభ్రం చేస్తుండాలి. దాంతో చర్మం చూడటానికి టైట్ గా మారుతుంది. చర్మం స్మూత్ గా తయారవుతుంది.

నిమ్మరసం : మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది మెడ మీద ముడుతలను నివారిస్తుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. ఏజింగ్ లక్షణాలను పోగొడుతుంది. నిమ్మరసంలో ఉండే లక్షణాలు ముడుతలను, మచ్చలను నివారిస్తాయి. రెండు మూడు చెంచాల నిమ్మరసం అప్లై చేసి అరంగంట తరువాత తర్వాత మెడను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

క్యారెట్: క్యారెట్ లో బీటా కెరోటీన్ మరియు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ రీజనరేషన్ ను ప్రోత్సహిస్తుంది, కొల్లాజెన్ ప్రొడక్షన్ ను ఉత్పత్తి చేస్తుంది. క్యారెట్ జ్యూస్ చేసి, ఆ రసాన్ని ముఖానికి అప్లై చేయాలి. ప్రతి రోజూ అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.