Good Sleep : కంటి నిండా నిద్రకోసం ఈ పానీయాలు బెస్ట్!

మెంతులు నానబెట్టిన ఆ నీటిని క్రమం తప్పకుండా తాగటం వల్ల ఒంట్లో వేడి ఎక్కువై బరువు పెరగకుండా చూసుకోవచ్చు. జీర్ణవ్యవస్ధ మెరుగైన పనితీరు కోసం మెంతుల నీళ్లు ఉపయోగపడతాయి. నిద్రకు అరగంట ముందు తాగితే నిద్ర బాగా పడుతుంది.

Good Sleep : కంటి నిండా నిద్రకోసం ఈ పానీయాలు బెస్ట్!

Good Night's Sleep (1)

Good Sleep : నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రాత్రి సుఖంగా నిద్రపోతే రోజంతా శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రస్తుతం చాలా మందికి నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. కంటి నిద్ర లోపిస్తే ఇన్సులిన్ స్ధాయిల్లో హెచ్చుతగ్గులు, ఎమోషనల్ ఈటింగ్ మొదలైన సమస్యలు వస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కంటినిండా నిద్ర తప్పనిసరి. కొన్ని రకాల పానీయాలు సుఖనిద్రకు ఎంతగానో తోడ్పడతాయి. ప్రస్తుతం నిద్రకు దోహదపడే ఆపానీయాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

దాల్చిన చెక్క, తేనీరు ; దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఏజెంట్లు ఉంటాయనే విషయం తెలుసు. నిద్రకు ముందు ఈ చెక్క పొడితో తయారు చేసిన తే నీరు తాగితే మెటబాలిజం పెరుగుతుంది. శరీరంలోని మలినాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. సులభంగా బరువు తగ్గుతారు.

మెంతులు నీళ్లు ; మెంతులు నానబెట్టిన ఆ నీటిని క్రమం తప్పకుండా తాగటం వల్ల ఒంట్లో వేడి ఎక్కువై బరువు పెరగకుండా చూసుకోవచ్చు. జీర్ణవ్యవస్ధ మెరుగైన పనితీరు కోసం మెంతుల నీళ్లు ఉపయోగపడతాయి. నిద్రకు అరగంట ముందు తాగితే నిద్ర బాగా పడుతుంది.

ద్రాక్ష రసం ; గాఢ నిద్ర పట్టడంతోపాటు, కొవ్వు కరిగేలా చేసే గుణం ద్రాక్ష రసానికి ఉంది. ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్సులిన్ స్రావాన్ని క్రమపరిచి జీవగడియారం కరెక్టుగా పనిచేసేలా తోడ్పడతాయి.

పాలు ; పాలలోని ట్రిప్టోఫాన్, కాల్షియం, కెసీన్ ప్రొటీన్ లు గాఢ నిద్రలోకి జారుకునేందుకు తోడ్పడతాయి. కెసీన్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి గాఢనిద్రలో ఉండగా కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది. ఫలితంగా కండరాలు బలపడి, ఫిట్ నెస్ సొంతం చేసుకోవచ్చు.