Rajinikanth Diet Secrets : 70లలో ఫిట్‌గా ఉండేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ అనుసరిస్తున్న డైట్ ఫార్ములా ఇదే !

ఈ వయస్సులో కూడా ఆయన అంత యాక్టివ్ గా ఉన్నారంటే స్వీయ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ప్రధాన కారణమని చెప్పవచ్చు. క్రమశిక్షణ, పట్టుదల ఉన్న వ్యక్తిగా రజనీకాంత్ గుర్తింపుపడ్డారు. అవే దశాబ్దాల పాటు సినీరంగంలో ఆయన్ను అగ్రస్థానంలో నిలిచేలా చేశాయి.

Rajinikanth Diet Secrets : 70లలో ఫిట్‌గా ఉండేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ అనుసరిస్తున్న డైట్ ఫార్ములా ఇదే !

Rajinikanth Diet Secrets

Rajinikanth Diet Secrets : తమిళ నటుడు రజినీకాంత్ అంటే తెలియని వారుండరు. సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు తెచ్చుకున్నారు. భారతదేశంతోపాటు ఇతర దేశాలలోను ఆయనకు అభిమానులు ఉన్నారు. చిత్ర పరిశ్రమలోనే ఆయనకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. 72 ఏళ్ల వయస్సులో కూడా రజనీకాంత్ తన అభిమానులను ఆకట్టుకోవటంతోపాటుగా, చలకీగా, ఉత్సహంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.

READ ALSO : Eating Disorder : పెరిగిన ఒత్తిడి మోతాదుకు మించి ఆహారం తీసుకునే రుగ్మతకు ఎలా దారి తీస్తుంది?

ఈ వయస్సులో కూడా ఆయన అంత యాక్టివ్ గా ఉన్నారంటే స్వీయ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ప్రధాన కారణమని చెప్పవచ్చు. క్రమశిక్షణ, పట్టుదల ఉన్న వ్యక్తిగా రజనీకాంత్ గుర్తింపుపడ్డారు. అవే దశాబ్దాల పాటు సినీరంగంలో ఆయన్ను అగ్రస్థానంలో నిలిచేలా చేశాయి.

రజనీకాంత్ డైట్ సీక్రెట్స్ ;

1. మొక్కల ఆధారిత ఆహారం

రజనీకాంత్ ఆహారంలో ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, గింజలు మరియు ధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకుంటారు. వీలైనంత వరకు ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటారు. వీలు దొరికినప్పుడల్లా తాజాగా, ఆర్గానిక్ ఫుడ్స్‌ను ఎంచుకుంటారు. రజనీకాంత్ ఆహారం ప్రధానంగా మొక్కల ఆధారితమైనా, పాలను మితంగా తీసుకుంటాడు. చక్కెరతోపాటు ఇతర అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాన్ని నివారిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించాలనుకునే ఎవరికైనా ఈ తరహా విధానం సరైందని నిపుణులు సతైం చెబుతున్నారు.

READ ALSO : Vitamin D : రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు !

2. బయటి ఆహారం కంటే ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ;

రజనీకాంత్ ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు. దూరప్రాంతాలకు వెళితే తప్పనిసరి పరిస్ధితుల్లో తప్ప బయట తినరు. అవసరమైతే స్థానికంగా లభించే పదార్ధాలను తెప్పించుకుని తనే స్వంతంగా భోజనాన్ని సిద్ధం చేసుకుంటాడు. ఇదే రజినీకాంత్ ఫిట్‌నెస్‌కు కీలకం విషయం.

3. ఫిట్ నెస్ వ్యాయామాలు ;

రజనీకాంత్ ఫిట్‌నెస్ విషయానికి వస్తే కార్డియోవాస్కులర్ వ్యాయామాలు, యోగా వంటివాటిని అనుసరిస్తారు. రన్నింగ్ చేయటం , వీలున్నప్పుడు వారంలో కొన్నిసార్లు జిమ్ కు వెళ్ళటం వంటివి చేస్తారు.

READ ALSO : Plant-Based Ingredients : మీ ఆహారంలో మొక్కల ఆధారిత పదార్ధాలను తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు !

4. యోగా, ధ్యానం ;

విశ్రాంతి తీసుకోవడానికి , పనిపై దృష్టి కేంద్రీకరించడానికి ధ్యానం , శ్వాస వ్యాయామాలు చేయడంతో పాటు, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును కాపాడుకోవడానికి యోగాను కూడా అభ్యసిస్తారు. యోగా శరీరం, మనస్సు , ఆత్మను సమతుల్యం చేయడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, ఒత్తిడి , ఆందోళనను తగ్గిస్తుందని రజినీకాంత్ నమ్ముతారు.

5. సాధారణ రోజు వారీ భోజన విధానం ; రజనీకాంత్ సాధారణంగా కాఫీ, టోస్ట్ మిల్క్, పండ్లతో కూడిన తేలికపాటి అల్పాహారంతో రోజును ప్రారంభిస్తారు. ఉడికించిన కూరగాయలు ,ఉడికించిన గుడ్లు వంటి తేలికపాటి భోజనం తీసుకుంటారు. రాత్రి భోజనంలో సాధారణంగా పప్పు, కూరలు , అన్నం వంటి శాఖాహార వంటకాలు ఉండేలా చూసుకుంటారు. వేయించిన ఆహారం కంటే ఉడికించిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు.

READ ALSO : Bloating : ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నాకడుపు ఉబ్బరంగా ఉంటుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారాన్ని అనుసరించడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయటం ద్వారా, సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ వయస్సులోను యాక్టివ్ గా ఉండగలుగుతున్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మనం కూడా ఆయన్ను అనుసరించటం వల్ల మనం కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడప వచ్చు.

గమనిక ; ఈ సమచారాన్ని అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు పొందగలరు.