Night Sleep : రాత్రిళ్ళు సరిగా నిద్రపోకపోతే జరిగేది ఇదే…

మన శరీరాన్ని మనం రిపేరు చేసుకోవటానికి అవకాశం కల్పించే సాధనంగా నిద్రను నిపుణులు చెప్తుంటారు. మనిషి ఒక రోజంతా నిద్రపోకపోతే అతని మెదడు పనితీరులో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అతని ఏకాగ్

Night Sleep : రాత్రిళ్ళు సరిగా నిద్రపోకపోతే జరిగేది ఇదే…

Night Sleep

మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. కనీసం ఒక రోజులో ఏడు నుండి తొమ్మిది గంటల సేపు నిద్రపోకపోతే మనిషి మెదడులో ఏర్పడే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న ఆధునిక ప్రపంచంలో ఈ జీవన శైలి మారుతూ వస్తోంది. ప్రతి నిమిషం ఫోన్‌ను చెక్‌ చేసుకుంటూ ఉండటం, మెయిల్స్‌ వచ్చాయో లేదో చూసుకోవటం, ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత టీవీ లేదా ల్యాప్‌టాప్‌ చూడటం మొదలైన వాటి వల్ల శరీరంలో కోర్టిసోల్‌ వంటి సె్ట్రస్‌ హార్మోన్ల ఉత్పత్తి బాగా పెరిగిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మన శరీరాన్ని మనం రిపేరు చేసుకోవటానికి అవకాశం కల్పించే సాధనంగా నిద్రను నిపుణులు చెప్తుంటారు. మనిషి ఒక రోజంతా నిద్రపోకపోతే అతని మెదడు పనితీరులో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అతని ఏకాగ్రత దెబ్బతింటుందట. నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువగా అందరి మీద చిరాకు పడుతుంటారు. రోజుకు 9 గంటలు నిద్రపోయేవారికన్నా మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారి మెదడు పనితీరులో అనేక మార్పులు తలెత్తినట్లు పలు పరిశోధనల్లో తేలింది.

మన శరీరంలో ప్రతి అవయవానికి శక్తి అవసరం. ఈ శక్తిని ఉత్పత్తి చేసే క్రమంలో అది కొన్ని వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. దీనికి వివిధ అవయవాలలో వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే విశ్రాంతి అనేది మనిషికి తప్పనిసరి. సరిగ నిద్ర లేక పోవడం వల్ల అనేక సమస్యల బారిన పడవలసి వస్తుందట. కరోనా నేపధ్యంలో అంతా ఎక్కువగా ఇంట్లోనే ఉండటం వల్ల, వేళాపాళ లేకుండా నిద్రపోవటం అలవాటైపోయింది. ఈ పరిస్ధితి వల్ల సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక ఉద్యోగస్తులైతే రాత్రిపూట తక్కువగా నిద్రపోయి ఉదయం పూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యపరంగా వివిధ రకాల సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి. భోజనం సరిగా తినకపోవడం,వాతావరణ కాలుష్యం,ఇలా కొత్త కొత్త రోగాలతో మనుషుల రాత్రి నిద్రకు భంగం కలిగేలా చేస్తున్నాయి.

రోజుకు తగినంత నిద్ర లేని వారి మెదడు వయస్సు త్వరగా పెరిగిపోతుందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వృద్ధాప్యంలో మెదడులోని గిలాల్‌ కణాల పనితీరు మందగిస్తుంది. దీనివల్ల మెదడులోని ఫ్రీరాడికల్స్‌ సంఖ్య బాగా పెరిగిపోతుంది. దీని ప్రభావం న్యూరాన్ల మీద, ఆరోగ్యకరమైన కణాలపైన పడుతుంది. రాత్రి సమయంలో సరైన నిద్రపోని వారు వారి మానసిక స్థితిని కోల్పోతారు. మెదడు తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. అలా ఒత్తిడికి గురవడం వల్ల దాని ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రించటం అనేది ఆరోగ్యపరంగా చాలా మంచిదన్న విషయం గుర్తుంచుకోవాలి.