Curry Leaves : ఈ ఆకు రక్తహీనతకు చికిత్సగా ప్రకృతి ప్రసాదించిన వరం !

కరివేపాకు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. చర్మం పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలకు కరివేపాకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మంపై నూనెను తగ్గించి, మొటిమలు లేకుండా చేస్తాయి.

Curry Leaves : ఈ ఆకు రక్తహీనతకు చికిత్సగా ప్రకృతి ప్రసాదించిన వరం !

treatment for anemia

Curry Leaves : కరివేపాకు అనేక రుగ్మతల చికిత్సలో సహాయపడుతుంది. మన వంటగదిలో మసాలాగా ఉపయోగిస్తారు. తాలింపు గింజలతో పాటు దీనిని కలిపి కూరల్లో వేస్తారు. రోజువారిగా దీనిని ఉపయోగించటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కరివేపాకు రక్తహీనతకు తొలగించటంలో సహాయపడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది.

READ ALSO : Coconut Oil Vs Olive Oil : కొబ్బరి నూనె , ఆలివ్ ఆయిల్ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనది?

కరివేపాకు యొక్క ప్రయోజనాలు:

1. రక్తహీనతను నయం చేయడంలో ;

కరివేపాకు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నయమవుతుంది. రక్తహీనత నిరోధక లక్షణాలతో పాటు, అధిక మొత్తంలో కాల్షియం, ఐరన్ మరియు జింక్ కూడా ఇందులో ఉన్నాయి, ఇది రక్తహీనతతో పోరాడటానికి సహాయపడుతుంది.

READ ALSO : Curry Juice : రక్తపోటును తగ్గించటంతోపాటు, పొట్ట కొవ్వులను కరిగించే కరివేపాకు జ్యూస్ !

2. చర్మంపై పసుపురంగు ;

కరివేపాకు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. చర్మం పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలకు కరివేపాకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మంపై నూనెను తగ్గించి, మొటిమలు లేకుండా చేస్తాయి.

READ ALSO : కరివేపాకును తినకుండా పారేస్తున్నారా?

3. ఐరన్ లోపం ;

ఆకులలోని ఫోలిక్ యాసిడ్ శరీరం ఇనుమును ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో ఐరన్ స్థాయిలను మెరుగుపరచాలనుకుంటే, రోజూ కొన్ని కరివేపాకులను తినటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

READ ALSO : రక్తహీనత పోగొట్టి, శరీరంలో కొవ్వు స్ధాయిలను తగ్గించే కరివేపాకు!

4. అల్సర్ సమస్య ;

కరివేపాకును నోటిపూతలకు కూడా ఉపయోగించవచ్చు. కరివేపాకు పొడిని తేనెతో కలిపి నోటిపూత ఉన్న చోట రాయాలి. 2-3 రోజుల్లోనే ఈ రకమైన సమస్య నుండి బయటపడతారు.