ఫీవర్‌ను పసిగట్టే స్మార్ట్ రింగ్.. కరోనా కావొచ్చు.. చెక్ చేసుకోండి!

  • Published By: sreehari ,Published On : December 15, 2020 / 12:24 PM IST
ఫీవర్‌ను పసిగట్టే స్మార్ట్ రింగ్.. కరోనా కావొచ్చు.. చెక్ చేసుకోండి!

Smart Ring detects Fever COVID-19 : కరోనావైరస్ ప్రధాన లక్షణల్లో జ్వరం ఒకటి. ప్రస్తుత కరోనా కాలంలో ఏ కొంచెం జ్వరంగా అనిపించినా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అసాధారణ స్థితిలో ఒళ్లు వేడిగా ఉంటే.. వామ్మో..  కరోనా జ్వరం వచ్చిందేమోనని ఆందోళన చెందుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా ముందుగా ఎవరికైనా ఫీవర్ ఉందో లేదో చెకింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.

చాలా దేశాల్లోనూ కరోనాకు మొదటి సంకేతంగా బాడీ టెంపరేచర్ చెకింగ్ చేయడం కామన్ అయిపోయింది. ఎక్కువగా షాపింగ్ మాల్స్ లేదా ఎయిర్ పోర్టు ప్రాంగణాల్లో స్పాట్ చెకింగ్ చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలో జ్వరం ఉందో లేదో నిర్ధారణ చేసుకోవచ్చు.

అయితే దీనికి మంచి ప్రత్యామ్నాయంగా శాన్ డియోగోలోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన బయోఇంజినీరింగ్ ప్రొఫెసర్ Benjamin Smarr ఒక కొత్త స్మార్ట్ రింగు వేరబుల్ డివైజ్ కనిపెట్టారు. దీనికి సంబంధించి స్మార్ తన తోటి సైంటిస్టులతో కలిసి స్మార్ట్ రింగును రూపొందించారు.

ఈ Oura smart ring ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు 65వేల మందిపై ట్రయల్స్ నిర్వహించారు. ఈ వేరబుల్ డివైజ్ ను ఫిన్నీస్ స్టార్టప్ (Oura) కంపెనీ డెవలప్ చేసింది. ఈ స్మార్ట్ రింగును ఎవరైనా ధరిస్తే వారిలో బాడీ టెంపరేచర్ సాధారణం కంటే ఎక్కువగా ఉంటే వెంటనే చెప్పేస్తుంది.

అంతేకాదు.. హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేటు, ఫిజికల్ యాక్టివిటీ లెవల్స్ అన్నింటిని రీడింగ్ చేయగలదు. ఈ ట్రయల్స్ లో పాల్గొన్న వారిలో 50మందికి కరోనా ఉందని ఈ స్మార్ట్ రింగ్ ద్వారా గుర్తించినట్టు తెలిపారు.

రింగ్ డేటా ఆధారంగా వారిలో ఏమైనా కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో ముందుగానే అంచనా వేయొచ్చునన్నారు.