Kidney Stone : కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు రోజు వారిగా వీటిని తీసుకుంటే!

యూరిన్ లోనున్న క్రిస్టల్స్ పేరుకుపోవడం ద్వారా గట్టిగా రాళ్ళల్లా ఏర్పడతాయి. ఇవి యూరినరీ ట్రాక్ట్ కి అడ్డుపడటం ద్వారా నొప్పిని కలిగిస్తాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవటం మంచిది. వీటి వల్ల కిడ్నీలో రాళ్లు కరగటంతోపాటు, వ్యర్ధాలు బయటకు పంపేందుకు సహాయపడతాయి.

Kidney Stone : కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు రోజు వారిగా వీటిని తీసుకుంటే!

suffering from kidney stone

Kidney Stone : కిడ్నీ అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవం. ఇటీవలి కాలంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతుంది. కిడ్నీ అనేది మనిషి శరీరంలో ఫిల్టర్ లా పనిచేస్తుంది, శరీరంలోని టాక్సిన్స్ ను అలాగే అదనపు నీటిని యూరినేషన్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఎక్కువమంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యూరిన్ లోనున్న క్రిస్టల్స్ పేరుకుపోవడం ద్వారా గట్టిగా రాళ్ళల్లా ఏర్పడతాయి. ఇవి యూరినరీ ట్రాక్ట్ కి అడ్డుపడటం ద్వారా నొప్పిని కలిగిస్తాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవటం మంచిది. వీటి వల్ల కిడ్నీలో రాళ్లు కరగటంతోపాటు, వ్యర్ధాలు బయటకు పంపేందుకు సహాయపడతాయి. ఎలాంటి ఆహారాలు మేలు చేస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారాలు ;

దానిమ్మ రసం : దానిమ్మల్లో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్నా, రసం తాగినా కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా పొటాషియం కాపాడుతుంది, ఇందులో ఉన్న యాస్ట్రింజెంట్ గుణాల వల్ల కిడ్నీల్లో ఉన్న టాక్సిన్స్ బైటికి వెళ్ళిపోతాయి.

తులసి : తులసిలోని డీటాక్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలని శుభ్రపరచి, కిడ్నీలోని రాళ్ళని కరిగేలా చేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా మారతాయి. ఇందులో ఉన్న ఎసిటిక్ యాసిడ్ కిడ్నీ లోని రాళ్ళు చిన్న చిన్న ముక్కలు గా విడిపోయి యూరిన్ ద్వారా బైటికి పోయేలా చేస్తుంది. తులసి నొప్పి నివారిణి గా పని చేస్తుంది.

ఖర్జూరాలు: ఎండు ఖర్జూరాలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్న గింజలు తీసేసి తినడం వల్ల కూడా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. దీని వల్ల కొత్తగా రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. ఇందులో ఉన్న మెగ్నీషియం వలన కిడ్నీలు శుభ్రపడతాయి. వీటితో పాటూ, కీరదోసకాయ రసం, చెర్రీలు, కొబ్బరి నీరు కూడా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోయేలా చేస్తాయి.

యాపిల్ సైడర్ వెనిగర్ : యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లను కరిగించేందుకు సహాయపడుతుంది. బ్లడ్ లోనూ, యూరిన్ లోనూ ఉన్న యాసిడ్ ని తగ్గించి స్టోన్స్ మళ్ళీ ఏర్పడకుండా చూస్తుంది. రోజువారిగా కొద్దిమోతాదులో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ ఉంటే శరీరం లోని వ్యర్ధపదార్ధం బైటికి వెళ్లిపోతుంది.

పుచ్చకాయ: పుచ్చకాయలో ఉన్న పొటాషియం యూరిన్ లోని ఎసిడిక్ స్ధాయిని నియంత్రిస్తుంది. పుచ్చకాయ రసం లో చిటికెడు ధనియాల పొడి వేసుకుని తీసుకుంటే ఈ సమస్యకి సులభంగా చెక్ పెట్టవచ్చు.

​లెమన్, ఆలివ్ ఆయిల్ : లెమన్స్ లో ఉన్న సిట్రేట్ వలన కొత్త రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి, ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. ఆలివ్ ఆయిల్ వలన కరిగిపోయిన రాళ్ళు తేలికగా బైటికి వెళ్ళిపోతాయి.