Long Covid Symptoms : క‌రోనా నుంచి కోలుకున్నా.. వెంటాడుతున్న ఆ మూడు ల‌క్ష‌ణాలు ఇవే..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. భారతదేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారిని కూడా కరోనా వదలడం లేదు.

Long Covid Symptoms : క‌రోనా నుంచి కోలుకున్నా.. వెంటాడుతున్న ఆ మూడు ల‌క్ష‌ణాలు ఇవే..

Three Long Covid Symptoms

Three Long Covid Symptoms : ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. భారతదేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారిని కూడా కరోనా వదలడం లేదు. దీర్ఘ కాలిక లక్షణాలతో ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ ప్ర‌మాద‌క‌ర వైర‌స్ దీర్ఘ‌కాల ప్ర‌భావాల‌పై శాస్త్ర‌వేత్త‌లు, వైద్య నిపుణులు, ప్ర‌భుత్వ‌రంగ ఆరోగ్య సంస్థ‌లు అధ్య‌య‌నం చేశారు.

కరోనా బాధితులు మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకున్న త‌ర్వాత నెగెటివ్ వ‌చ్చినా చాలామందిలో దీర్ఘ‌కాలికంగా ల‌క్ష‌ణాలు కనిపిస్తున్నాయి. దీన్ని లాంగ్ కొవిడ్ అని పిలుస్తారు. క‌రోనా వైర‌స్ ఉండ‌దు. కానీ, ప్ర‌భావం మాత్రం వారిపై ఉంటుంది. ఈ లాంగ్ కొవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిలో ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, మెద‌డు లాంటి అవ‌య‌వాల‌కు న‌ష్టం జ‌రుగ‌వ‌చ్చునని నిపుణులు చెబుతున్నారు.

లాంగ్ కొవిడ్ లక్ష‌ణాలా..? లేదంటే ఇత‌ర వ్యాధి ల‌క్ష‌ణాలా..? అనే విష‌యం సులభంగా గుర్తించవచ్చునన్నారు. ఛాతిలో నొప్పి, శ్వాస‌లో ఇబ్బంది, ఫాగ్ బ్రెయిన్‌ వంటివి క‌నిపిస్తే ఆ మూడు లాంగ్ కొవిడ్ ల‌క్ష‌ణాలనేనని అంటున్నారు.

క‌రోనా వైర‌స్ కారణంగా ఊపిరితిత్తుల‌పై ప్ర‌భావం పడుతుంది. ఛాతినొప్పి కూడా దీర్ఘ‌కాలిక కొవిడ్ ల‌క్ష‌ణంగా ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు. ఛాతిలో అసౌక‌ర్యంగా అనిపించ‌డం, స్వ‌ల్పంగా నొప్పిగా ఉండ‌టం లాంటివి లాంగ్ కొవిడ్ ల‌క్ష‌ణాలు అయి ఉండొచ్చుునని చెబుతున్నారు.

శ్వాసలో ఇబ్బంది అనిపిస్తుందా? కొవిడ్ పేషెంట్‌ల‌లో కోలుకున్న త‌ర్వాత కూడా సాధార‌ణంగా క‌నిపిస్తుంద‌ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. కొంద‌రిలో దీర్ఘ‌కాలం ఈ ల‌క్ష‌ణం కొన‌సాగ‌వ‌చ్చని అంటున్నారు. ఈ లాంగ్ కొవిడ్ ల‌క్ష‌ణం ఉన్న‌వాళ్లు సులభంగా శ్వాస తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని గుర్తించారు.