Shocking Facts : అప్పులతో మూడుముళ్ళబంధం….సర్వేలో షాకింగ్ నిజాలు

సర్వేలో యువత చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తి కరంగా మారాయి.

Shocking Facts : అప్పులతో మూడుముళ్ళబంధం….సర్వేలో షాకింగ్ నిజాలు

Finance

Shocking Facts : కరోనా మహమ్మారి అందరి జీవితాలను , జీవన విధానాలను మార్చేస్తుంది. ముఖ్యంగా యువతీ, యువకులను కరోనా తీవ్రమైన వత్తిళ్ళపాలు చేస్తుంది. మంచి ఉద్యోగం చేతినిండా జీతం డబ్బుతో వీకెండ్ పార్టీల్లో మునిగి తేలుతూ సరదాగా గడపాల్సిన యువత ప్రస్తుతం పెళ్ళిళ్ళకోసం ఆతృతపడుతున్నారు. వివాహమంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం యువత తమ పెళ్ళిళ్ళకోసం అప్పులు చేసేందుకు వెనుకాడటంలేదట. ఇండియాలెండ్స్ సంస్ధ జరిపిన తాజా సర్వేలో వెలుగు చూసిన ఆశ్ఛర్యకరమైన విషయాలు ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

పెళ్ళీడు వయస్సు దాటిపోతోందన్న భయం ఒకవైపు వెంటాడుతుండగా , త్వరగా పెళ్ళిచేసుకోవాలన్న ఆలోచన మరోవైపు, ఇందుకోసం చేతిలో సరిపడినంత డబ్బులేక ఇబ్బందులు, యువతీయువకుల కళ్యాణ ఘడియలకు ఆటంకంగా మారాయి. కరోనా నేపధ్యంలో యువత తీవ్రమైన వత్తిడికి లోనవుతున్నట్లు ఇండియాలెండ్స్ సంస్ధ సర్వే లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న 20 నగరాల్లో ఈ సంస్ధ కరోనా సంక్షోభం నేపధ్యంలో యువత ఆలోచనలపై సమగ్ర సర్వే చేపట్టింది.

20సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న 11 వేల మంది యువతీయువకుల అభిప్రాయాలను సేకరించారు. చదువు, వ్యాపారం, పెళ్ళి, విహార యాత్రలు, వాహనాలు, ఇళ్ళు కొనుగోళ్ళు, చదువు, ఇతరత్రా అవసరాలు తదితర విషయాలను ఆప్షన్లుగా తీసుకుని వారివారి అభిప్రాయాలను సేకరించారు. 2020 ఆగస్టు నుండి 2021 మార్చి వరకు , 2021 ఏఫ్రిల్ నుండి 2021 జులై మధ్యకాలంలో రెండు విడతలుగా ఇండియాలెండ్స్ తన సర్వేను కొనసాగించింది.

సర్వేలో యువత చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తి కరంగా మారాయి. 33 శాతం మంది యువత పెళ్ళికోసం తొందర పడటంతోపాటు, ఇందుకోసం అప్పులు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు స్పష్టమైంది. కరోనా కారణంగా పెళ్ళి వేడుకలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీనికి తోడు ఉద్యోగంలో ఒడిదుడుకులు కళ్యాణానికి సమస్యగాను మారాయి. మంచి ఉద్యోగం ఉన్నవాళ్ళనే వివాహం చేసుకునేందుకు యువతీయువకులు ఆసక్తి చూపిస్తున్నారు.

కరోనా నేపధ్యంలో వచ్చే ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొవాలంటే మంచి జీతంతో ఉద్యోగం చేసే వారైతే జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవటం శులభమౌతుందని యువత భావిస్తుంది. అదే క్రమంలో పెళ్ళి చేసుకునేందుకు అప్పులు చేసేందుకు కూడా వెనుకాడటంలేదని సర్వేలో తేలింది. తొందరాగా పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నవారు 22 శాతంగా తేలారు.

అదే క్రమంలో కోవిడ్ కారణంగా ఉన్న ఉద్యోగాలు కోల్పోయిన వారిలో చాలా మంది ఇకపై ఉద్యోగులాగా కంటే సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. బిజినెస్ కోసం బ్యాంకు లోన్లు తీసుకోవాలనుకునే ఆలోచనలో చాలా మంది యువత ఉంది. ఈసంఖ్య కరోనా తొలి వేవ్ లో 16 శాతం ఉండగా రెండో దశనాటికి 23 శాతానికి పెరిగిందని సర్వేలో తేలింది. మరోవైపు జీతాల్లో కోతలు, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉండటంతో చేతిలో డబ్బు తరిగిపోతుంది. అంచనాలకు మించి ఆరోగ్య ఖర్చులు , ఇతర ఖర్చులు పెరిగిపోవటంతో ముందుగా ఆలోచించిన భవిష్యత్ ప్రణాళికలైన ఇంటి నిర్మాణం వంటి వాటిని వాయిదా వేసుకుంటున్నారు.