Remove Stains : దుస్తులపై పడ్డ మరకలు శులభంగా తొలగించే చిట్కాలు!

దుస్తులపై పడిన రక్తం మరకను పోగొట్టాలంటే మరక పడిన చేట నీటితో తడిపి ఉప్పు చల్లి గట్టిగా రుద్దాలి. తరువాత సబ్బుతో ఉతకాలి. ఇంక్ వంటి మరకలు పోవటనికి ఆప్రదేశంలో కాస్త ఆల్కహాల్ ని వేసి రుద్దాలి.

Remove Stains : దుస్తులపై పడ్డ మరకలు శులభంగా తొలగించే చిట్కాలు!

Remove Stains On Clothes

Remove Stains : ఇష్టపడి, ఎంతో ఖర్చు చేసి మరీ దుస్తులను కొనుగోలు చేస్తారు. ముచ్చటగా ఒక్కసారి వేసుకున్నారో లేదో వాటిపై మరకులు పడుతుంటాయి. మరకలు పడటంతో వాటిని మరో సారి వేసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంచేయాలో తెలియదు, మరకలను ఎలా తొలగించాలో అర్ధంకాక చాలా మంది వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి పరిస్ధితుల్లో దుస్తులపై పడ్డ మరకలను తొలగించుకునేందుకు కొన్ని చిట్కాలు చక్కగా దోహదపడతాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

దుస్తులపై పడిన కాఫీ, టీ మరకలపై టాల్కమ్ పౌడర్ చల్లాలి. లేదంటే దానిపై చక్కెర కలిపిన నీటిలో మరక పడిన ప్రదేశం వరకు ముంచాలి. తరువాత సబ్బుతో ఉతకాలి. ఇలా చేస్తే మరకలు పోతాయి. పండ్ల రసాలు, ఐస్ క్రీమ్ మరకలు పడితే నిమ్మరసంతో రుద్దడం వల్ల తొలగిపోతాయి. చొక్కా కాలరప్ , తలగడ కవర్లపై పడే మరకలను షాంపుతో ఉతకటం ద్వారా పోతాయి.

దుస్తులపై పడిన రక్తం మరకను పోగొట్టాలంటే మరక పడిన చేట నీటితో తడిపి ఉప్పు చల్లి గట్టిగా రుద్దాలి. తరువాత సబ్బుతో ఉతకాలి. ఇంక్ వంటి మరకలు పోవటనికి ఆప్రదేశంలో కాస్త ఆల్కహాల్ ని వేసి రుద్దాలి. తరువాత సబ్బుతో ఉతుక్కోవాలి. ఇలా చేస్తే మొడి మరకలు తొలగించుకోవచ్చు. మరకలపై పాల చుక్కలు వేసి, టూత్ బ్రష్ తో గట్టిగా రుద్దడం ద్వారా ఇంక్ మరకలను పోగొట్టవచ్చు.

గ్రీజు, నూనె వంటి మరకలను మొక్కజొన్న పిండిని ఉపయోగించటం ద్వారా తొలగించుకోవచ్చు. వెనిగర్ ని , వేడినీటిని సమభాగాల్లో కలిపి దానిలో మరకలంటిన దుస్తులను కొద్దిసేపు నానబెట్టాలి. ఆ తరువాత బ్రష్ తో రుద్ది ఉతికితే ఎటువంటి మరకలైనా పోతాయి.