Better Snacks : బరువు పెరగకుండా ఉండాలంటే…బెటర్ స్నాక్స్ ఇవే!..

అప్పడాలు బరువును కంట్రోల్ లో ఉంచటంలో దోహదం చేస్తాయి. భోజనంలో నలుచుకుని తినేందుకు అప్పడాలను వడ్డిస్తుంటారు. మన ఇంట్లో కూడా సాంబారు, పప్పు వంటల్లో తప్పనిసరిగా వీటిని చేసుకోకుంటే ముద్ద దిగదు.

Better Snacks : బరువు పెరగకుండా ఉండాలంటే…బెటర్ స్నాక్స్ ఇవే!..

Wieght (1)

Better Snacks : అధిక బరువు ఇటీవలికాలంలో పెద్ద సమస్యగా మారుతుంది. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు అందరిని వేధిస్తున్నాయి. ఒక్కసారి బరువు పెరిగితే తగ్గేందుకు నానా పాట్లు పడాల్సి వస్తుంది. మనం రోజువారి తీసుకునే ఆహారంలో తగినన్ని క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే పెరిగిన బరువును సునాయాసంగా తగ్గించుకోవచ్చు. బరువు అదుపు ఉండేందుకు తక్కువ క్యాలరీలతో కూడిన చిరుతిండ్లను ఎంచుకోవటం మంచిది. బరువు కంట్రోల్ లో పెట్టుకోవాలని భావించే వారు తప్పకుండా ఈ స్నాక్స్ గురించి తెలుసుకోవటం మంచిది.

బరువు పెరగకుండా ఉండాలనుకునే వారికి శెనగలు, మరమరాలు మంచి అల్పాహారంగా చెప్పవచ్చు. శెనగలు, మరమరాలు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. వీటిని చిరుతిండిగా భోజనానికి ముందు, తరువాత తీసుకుంటుంటారు. ఇవి మీ కడుపు సంబంధిత సమస్యలను తొలగింప చేయటంలో సహాయకారిగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా తక్షణ శక్తిని అందించేందుకు ఉపయోగపడతాయి. అలాగే వీటి వల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఆకలిగా అనిపిస్తే శెనగలు, మరమరాలను టైపాస్ గా చిరుతిండిగా తినటం మంచిది.

అప్పడాలు బరువును కంట్రోల్ లో ఉంచటంలో దోహదం చేస్తాయి. భోజనంలో నలుచుకుని తినేందుకు అప్పడాలను వడ్డిస్తుంటారు. మన ఇంట్లో కూడా సాంబారు, పప్పు వంటల్లో తప్పనిసరిగా వీటిని చేసుకోకుంటే ముద్ద దిగదు. బరువు తగ్గాలనుకునేవారికి అప్పడాలు బాగా ఉపయోగపడతాయి. అప్పడాల్లో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆకలి వేసినప్పుడు వీటిని తినటం వల్ల బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. అయితే ఈ అప్పడాలను నూనెతో కాకుండా మాములుగా వేయించండి. ఉడకబెట్టిన కూరగాయలతో వీటిని తినవచ్చు.

ఓట్స్ తో తయారైన ఇండ్లీ బరువును పెరగకుండా చూడటంలో ఉపకరిస్తుంది. ఓట్స్, తురిమిన క్యారెట్‌లతో చేసిన ఇడ్లీలు ఆరోగ్యకరం. ఈ ఇడ్లీలు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకుంటే ఆకలి కూడా తీరుతుంది. బరువు పెరుగుతారన్న భయం ఉండదు. స్నాక్స్‌గా మాత్రమే కాకుండా, లంచ్ , డిన్నర్‌గా ఈ ఇడ్లీలను తీసుకోవచ్చు.

దోక్లా తీసుకోవటం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. ధోక్లా అనేది తక్కువ క్యాలరీల ఫుడ్. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు దీన్ని ఉదయం లేదా సాయంత్రం ధోక్లాను స్నాక్‌గా తీసుకోవటం వల్ల బరువు పెరగకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు.