Mental Stress : మానసిక వత్తిడి దూరంకావాలంటే?..

రోజూ అరగంట ధ్యానం కోసం తప్పక కేటాయించాలి. ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ధ్యానం చేయాలి. ఇష్టమైన స్నేహితునితో కలిసి బయటకు వెళ్లాలి. స్నేహితునితో కాసేపు మాట్లాడటం, ఇష్టమైన సినిమాక

Mental Stress : మానసిక వత్తిడి దూరంకావాలంటే?..

Mental Stress

Mental Stress : రోజు రోజుకి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతూ ఉంది. ఆధునిక సదుపాయాలు రాక ముందు మనుషులకు శారీరక శ్రమ అధికంగా ఉండేది. వారి శక్తి పెద్ద ఎత్తున ఖర్చయ్యేది. ఈ కారణంగా వారికి చాలావరకు మానసిక వత్తిడి దూరమయ్యేది. అయితే ప్రస్తుతం పరిస్ధితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. శారీరక శ్రమలేకపోవటం, బిజీబిజీ జీవితాలతో మానసిక వత్తిడి పెరిగిపోవటం తో అనేక మంది సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మానసిక ఒత్తిడిని పోగొట్టేందుకు చాలా మంది వివిధ రకాల మార్గాలను వెతుక్కుంటున్నారు.

మానసిక వత్తిడిని తగ్గించుకునేందుకు చాలా మంది బార్లు, క్లబ్బులు, డిస్కోలు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఏదో విధంగా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రజలు అక్కడికి వెళ్ళేందుకు మక్కువ చూపుతున్నారు. వాస్తవానికి మానసిక వత్తిడి తగ్గించుకోవటానికి చేయాల్సింది అవికాదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేయాల్సింది బ్రీతింగ్‌ వ్యాయామాలు. ఊపిరితిత్తుల నిండా గాలిని పీల్చి నాలుగు సెకన్ల పాటు శ్వాసను బిగపట్టాలి. తరువాత వదిలేయాలి. ఇలా పలుమార్లు చేయాలి. రోజూ అరగంట ధ్యానం కోసం తప్పక కేటాయించాలి. ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ధ్యానం చేయాలి.

ఇష్టమైన స్నేహితునితో కలిసి బయటకు వెళ్లాలి. స్నేహితునితో కాసేపు మాట్లాడటం, ఇష్టమైన సినిమాకు వెళ్లడం, మంచి పుస్తకం చదవడం వంటివి చేయాలి.  ఇలాంటివన్నీ ఒత్తిడిని దూరం చేస్తాయి. శారీరక వ్యాయామం మానసిక ఆరోగ్యంపైనా, భావోద్వేగాలపైనా పాజిటివ్‌ ఇంపాక్ట్‌ను చూపిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ శారీరక వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. అది జాగింగ్‌ కావచ్చు లేదా మీ రూమ్‌లో ఇష్టమైన సంగీతం పెట్టుకుని చేసే చేసే డ్యాన్స్‌ కూడా కావచ్చు. ఇలా చేయడం వల్ల హ్యాప్పీ హార్మోన్స్‌గా పిలిచే ఎండార్ఫిన్స్‌ విడుదలయి మనసుకు హాయి కలుగుతుంది.

సరిపడినంత నిద్ర, వ్యాయామం, యోగా, కుటుంబం, స్నేహితులతో మంచి బంధాలు కలిగి ఉండడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఒత్తిడి, కుంగుబాటు, భయం లేదా మరేదైనా మానసిక సమస్య ఎదురైనప్పుడు అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య నిపుణులను కలిస్తే సమస్య తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు. మానసిక సమస్యకు సకాలంలో పరిష్కారం పొందాలి. అవసరమైతే చికిత్స చేయించుకోవాలి.