Increase Memory : జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరగాలంటే?

ముఖ్యంగా జ్ఞాపకశక్తికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైన ఆహారనియమాలు పాటించవలసి ఉంటుంది. సులువుగా అరిగే, ఒంట్లోని విషాలను హరించే ఆహారంతో శరీరంలో కఫ సంబంధ అవరోధాలు తొలగిపోతాయి.

Increase Memory : జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరగాలంటే?

Increase Memory

Increase Memory : సమతులాహారం తీసుకోవడం వల్ల శరీరారోగ్యం బాగుంటుంది. తెలివితేటలు, జ్ఞాపక శక్తి మెరుగవుతాయి. మెదడు కణాల మధ్య సమాచార ప్రసారం సన్నగిల్లడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కారణం ఏదైనా ఈ స్థితిలో జ్ఞాపకశక్తి మందగిస్తుంది. తిరిగి పునరుద్ధరించాలంటే మూల కారణాలను కనిపెట్టాలి. జ్ఞాపకశక్తి, తెలివితేటలు తగ్గడానికి కారణం పోషకాహార లోపం, మెదడులో తయారయ్యే రసాయనాలలో అసమతౌల్యమే ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.

కఫ దోషం వల్లే జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుందని ఆయుర్వేదం నమ్ముతోంది. ఈ దోషం ఫలితంగా మెదడు పనితీరు మందగించి, ఆలోచనల్లో అస్పష్టత చోటుచేసుకుంటుంది. కాబట్టి జ్ఞాపకశక్తి పెరగాలంటే వాత, కఫ దోషాలను సమతులం చేయాలి. వాత, కఫ దోషాల సమ్మేళనం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పిత్త దోషం మెదడు చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ఈ దోషాలన్నీ సమతులం కావాలంటే ఆహారశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

ముఖ్యంగా జ్ఞాపకశక్తికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైన ఆహారనియమాలు పాటించవలసి ఉంటుంది. సులువుగా అరిగే, ఒంట్లోని విషాలను హరించే ఆహారంతో శరీరంలో కఫ సంబంధ అవరోధాలు తొలగిపోతాయి. ఇలాంటి ఆహారం పిత్త పనితీరును పెంచి, తత్ఫలితంగా జ్ఞాపకశక్తినీ, తెలివితేటలనూ పెంచుతుంది. కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, నెయ్యి, నారింజ, క్యారెట్లు, నట్స్‌లతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. విటమిన్‌ బి12, విటమిన్‌బి6, విటమిన్‌ సి, ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి.

కొవ్వు పదార్థాలను వీలైనంతవరకు తగ్గించడం చాలా మంచిది. ఎక్కువ ఫ్యాట్‌ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల చురుకుదనం లోపిస్తుంది. జున్ను తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి.జ్ఞాపకశక్తి, తెలివితేటలను పెంచే వాత, పిత్త, కఫ దోషాల మధ్య సమతులం సాధించాలంటే బెల్లం లేదా తేనెలకు దీర్ఘకాలం పాటు ఆహారంలో చోటు కల్పించాలి. టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. వాల్ న‌ట్స్‌, బాదంప‌ప్పు, న‌లుపు రంగు కిస్మిస్‌, జీడిప‌ప్పు వంటి ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు అంది మెద‌డు చురుగ్గా పనిచేయటంతోపాటుగా జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది.