Brain : జ్ఞాపక శక్తి పెరగటంతోపాటు మెదడు చురుకుగా పనిచేసేందుకు!

మెదడు పనితీరు గ్లూకోజ్ లెవల్స్ పై కూడా ఆధారపడుతుంది. షుగర్ లెవల్స్‌ను సరిగా నియంత్రించకపోతే, మెదడు పనితీరు సరిగా ఉండదు. మానవుని జీర్ణవ్యవస్థలో వంద ట్రిలియన్లకు పైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మెదడు బాగా పని చేయాలంటే ఆ సూక్ష్మజీవులు సమతుల్యంతో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.

Brain : జ్ఞాపక శక్తి పెరగటంతోపాటు మెదడు చురుకుగా పనిచేసేందుకు!

Brain : మనిషి శరీరంలోని అవయవాలలో అతిముఖ్యమైన అవయవం మెదడు. శరీరంలోని అన్ని భాగాలు మెుదడు నియంత్రణలోనే ఉంటాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన మెదడు చురుకుగా పనిచేస్తే అంతకన్నా ఆరోగ్యం మరొకటుండదు. మెదడు చురుకుగా పనిచేయాలంటే ప్రోటిన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మెదడు ఆరోగ్యం కోసం నిరంతరం జాగ్రత్తలు పాటించటం అవసరం. మెదడుకు మేలు చేసే ఆహారంపై దృష్టి పెట్టటంతోపాటుగా, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. తద్వారా మెదడు ఆరోగ్యకరంగా, చురుకుగా పనిచేసేలా చూసుకోవచ్చు.

మెదడు పనితీరు గ్లూకోజ్ లెవల్స్ పై కూడా ఆధారపడుతుంది. షుగర్ లెవల్స్‌ను సరిగా నియంత్రించకపోతే, మెదడు పనితీరు సరిగా ఉండదు. మానవుని జీర్ణవ్యవస్థలో వంద ట్రిలియన్లకు పైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మెదడు బాగా పని చేయాలంటే ఆ సూక్ష్మజీవులు సమతుల్యంతో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకుంటే సూక్ష్మజీవుల సమతుల్యతతో మెదడు చురుగా మారుతుంది. మెదడు కణాలు కొవ్వుతో తయారవుతాయి. కాబట్టి తినే ఆహారపదార్థాలలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

మెదడును చురుకుగా ఉంచే ఆహారాలు ;

వాల్ నట్స్‌తో పాటు బాదం, పిస్తాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదుడు చురుకుగా పని చెస్తోంది. జ్ఞాపకశక్తి పెరగడంలో ఇది తోర్పడుతుంది. వారంలో ఒకటి లేదా రెండుసార్లు చేపలు తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి రోజూ మోతాదుకు మించకుండా ఒకటి , రెండు కప్పుల కాఫీ , టీ తాగడం వల్ల మెదడు కాస్త చురుకుగా మారుతుంది. క్యారట్ ఎక్కువగా తినడం వల్ల వయసు రిత్యా వచ్చే మతిమరుపు సమస్యలు తగ్గుతాయి. పాలకూరను ఆహారంలో బాగం చేసుకోవటం వల్ల మెుదడు పని తీరు మెరుగవుతుంది.

అలాగే చిన్నదానికి ఎక్కువగా ఆలోచించి ఆందోళన పడకూడదు. ఎక్కువ ఒత్తిడి, ఆందోళనలు మెదడుకు మంచివి కావు. ఎక్కువ ఒత్తిడి ఉంటే మెదడుకు విశ్రాంతిని ఇవ్వడం చాలా అవసరం. ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం కష్టమైతే మెడిటేషన్‌ లాంటివి చేయటం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. ఒత్తిడి కలిగించే హార్మోన్లు సాధారణ స్థాయికి చేరుకుంటాయి. మెదడు చురుకుగా పనిచేసి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.