Hair : జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండేందుకు!..

అరటిపండ్లలో కాల్షియం, ఫోలిక్‌యాసిడ్‌ ఉంటుంది. ఇది జుట్టును పట్టులా చేస్తుంది. బాదం, అరటిపండ్లతో స్మూతీ తయారుచేసుకుని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

Hair : జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండేందుకు!..

Hair

Hair : జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. వాతావరణంలో కాలుష్యం, మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం వంటి కారణాలవల్ల ప్రతి ఒక్కరికి జుట్టురాలడం అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇందు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎంతో డబ్బులు కూడా ఖర్చు చేసి విసుగు చెంది ఉంటారు చాలామంది. మరి సహజంగా జుట్టు ఆరోగ్యంగా , ఊడిపోకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుంది.

బాదం పలుకుల్లో ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్లు, జింక్‌ వంటి మినరల్స్‌ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. బాదంలో ఉండే విటమిన్‌-ఇ కెరటిన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా దెబ్బతిన్న శిరోజాలను రిపేర్‌ చేస్తుంది.

నువ్వులు, బచ్చలి కూర, మెంతి కూర వంటివి తీసుకుంటే జుట్టుకి చాలా మేలు చేస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. ఒత్తుగా పెరిగే జుట్టు కావాలంటే మానసిక ఆరోగ్యం చాలా బాగుండాలి. దానితో పాటు రోజూ వ్యాయామం చేయడం కూడా ప్రయోజనాలని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా చెయ్యడం వలన మీ జుట్టుని అందంగా మార్చుకోవడానికి వీలు అవుతుంది.

తలకి పట్టించే నూనెలో వేప, కరివేపాకు, మందారం వంటివి ఉపయోగించడం చాలా మంచిది. పైగా వీటి వలన ఎలాంటి జుట్టు సమస్య కూడా వుండదు. హెయిర్‌ ఆయిల్స్‌తో తలని బాగా మసాజ్‌ చేస్తూ ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉండి బాగా ఒత్తుగా పెరుగుతుంది.

అరటిపండ్లలో కాల్షియం, ఫోలిక్‌యాసిడ్‌ ఉంటుంది. ఇది జుట్టును పట్టులా చేస్తుంది. బాదం, అరటిపండ్లతో స్మూతీ తయారుచేసుకుని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఇందులో నట్స్‌, సీడ్స్‌, దాల్చిన చెక్క, తేనె కలుపుకొంటే జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి.

ప్రతి రోజూ కొబ్బరి నూనెనే వాడాలి. దీని వల్ల తలలో వేడి బాగా తగ్గి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే తల స్నానం చేసిన తర్వాత జుట్టు ఆరిపోవడానికి హెయిర్‌ డ్రయర్‌ వాడకండి. జుట్టు నాచురల్‌గా ఆరిపోయే విధంగా ట్రై చెయ్యండి. డ్రయర్‌ వలన జుట్టు ఊడిపోయే ప్రమాదం వుంది.

ఒక టీస్పూన్‌ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. మెంతుల్లో ఫోలిక్‌యాసిడ్‌, ఎ- విటమిన్‌, కె- విటమిన్‌, సి- విటమిన్‌, పొటాషియం, కాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. బార్లీ గింజలను నీళ్లలో మరిగించి, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, తేనె వేసి తీసుకోవాలి. బార్లీ నీళ్లలో ఐరన్‌, కాపర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎర్రరక్తకణాల ఉత్పత్తిని స్టిమ్యులేట్‌ చేస్తాయి. బార్లీ నీళ్లు తాగడం వల్ల కూడా జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.