Cholesterol : సహజ మార్గాల్లో కొలెస్ట్రాల్ స్దాయిలు తగ్గాలంటే!

ఆలివ్ నూనె, ఆవనూనె, బాదం, వాల్‌నట్‌లు, అవకాడోలు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందుతుంది. కరిగే ఫైబర్ ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది శరీరం నుండి కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.

Cholesterol : సహజ మార్గాల్లో కొలెస్ట్రాల్ స్దాయిలు తగ్గాలంటే!

Cholesterol

Cholesterol : అధిక కొలెస్ట్రాల్ చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల శరీరం సాధారణ పనితీరుపై ప్రభావం చూపుతుంది. గుండెపోటు వంటి ప్రమాదకరమైన పరిణామాలకు కారణమవుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు చాలా జబ్బులకు కారణకావచ్చు.కొలెస్ట్రాల్ కాలేయంలో తయారవుతుంది. ఇది ఎక్కువైతే గుండెకు ప్రమాదం. మనం రోజువారిగా తీసుకునే ఆహార పదార్ధాల ద్వారానే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ , చెడు కొలెస్ట్రాల్ ఇవి అనేక హార్మోన్లను తయారు చేయడానికి అవసరమౌతాయి. కొలెస్ట్రాల్ నీటిలో కరగదు.

కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే రక్తనాళాలకు అడ్డుపడితే స్ట్రోకులు, గుండెపోటులు, మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. సహజ మార్గాల్లో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యకరమైనవని నిపుణులు సూచిస్తున్నారు. హానికరమైన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇవి సీఫుడ్ మరియు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లలో కనిపిస్తాయి.

ఆలివ్ నూనె, ఆవనూనె, బాదం, వాల్‌నట్‌లు, అవకాడోలు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందుతుంది. కరిగే ఫైబర్ ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది శరీరం నుండి కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. వ్యాయామం ద్వారా కొలెస్ట్రాల్‌ తీవ్రతను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. బరువు తగ్గడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పరిమిత మోతాదులో ఆల్కహాల్ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచటంలో సహాయపడుతుంది.. అధిక ఆల్కహాల్ వాడకం గుండె జబ్బుల ప్రమాదంతోపాటు, కాలేయానికి హాని చేస్తుంది. నాసిరకం నూనెలకు దూరంగా ఉండాలి. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లను తీసుకోవటం మంచిదికాదు.