Body Heat : ఒంట్లో వేడి తగ్గాలంటే?..

గ్లాసు గోరువెచ్చని పాలలో కాస్త పచ్చ కర్పూరం తోపాటు యాలకుల పొడి, గసగసాల పొడి కలుపుకుని తాగితే శరీరంలో ఉన్న వేడి మొత్తం మాయమౌతుంది. వేడి స‌మ‌స్య ద‌రిచేర‌కూడ‌దంటే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

10TV Telugu News

Body Heat : మన శరీరంలో కొన్ని కొన్ని సందర్భాలలో వేడి అధికమౌతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 97.7 నుంచి 99.5 డిగ్రీల ఫారన్‌హీట్‌ మధ్యలో ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ గానీ తక్కువగానీ ఉంటే ఏదో అనారోగ్యం ఉందని భావించవచ్చు. ఎండలో ఎక్కువ సమయం గడపడం వలన మీ శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. భారీ వ్యాయామం లేదా మామూలు కంటే ఎక్కువ తిరగడం వల్ల కూడా ఇది పెరుగుతుంది. మహిళలకు, పెరిమెనోపాజ్ మరియు మెనోపాజ్ వంటి పరిస్థితుల కారణంగా శరీర వేడి పెరగవచ్చు.

కొన్ని మందులు మీ శరీరంలో అధిక ఉష్ణ ఉత్పత్తికి కారణమవుతాయి, దీని వలన మీ శరీర వేడి పెరుగుతుంది.తరుచుగా మనం తీసుకునే ఆహారం, ఇతర ఆహారపు ఆహారపు అలవాట్లతో శరీరంలో అధిక వేడిని తగ్గించవచ్చు. మెదడులోని హైపోథాలమస్ శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. శరీరంలో అధిక వేడి కారణంగా తలనొప్పి, మలబద్దకం లాంటి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.

శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే తరచుగా నీళ్లు, ఏదైనా ద్రావణాలను తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది. ఒక స్పూన్ మెంతుల్ని అలాగే తినాలి. లేకపోతే వాటిని పొడిగా చేసి నీళ్లలో కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది. అధిక వేడి నుంచి మీకు ఉపశనమనం లభిస్తుంది. వేడిని తగ్గించటంలో కొబ్బరి నీళ్ళు బాగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లలో సహజంగా శీతలీకరణ లక్షణాలు ఉంటాయి. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేయగలదు మరియు తద్వారా ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసే ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేస్తుంది.

మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం. తీవ్రమైన ప్రోబయోటిక్స్, విటమిన్లు మరియు ఖనిజాలను ఇది కలిగి ఉంటుంది, తీవ్రమైన వేడిలో కూడా మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రోజూ లేదా రోజుకు రెండుసార్లు మజ్జిగ తాగడం వల్ల మీ శరీరాన్ని చల్లబరచవచ్చు. స్విమ్మింగ్ వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త మేర తగ్గుతుంది. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. తగినంత ఆక్సిజన్ అందే పరిస్థితి లేకపోతే శరీరంలో మార్పులు చోటుచేసుకుని బాడీ టెంపరేచర్ పెరగినట్లు అనిపిస్తుంది. ఫ్యాన్ కింద, కూలర్ల వద్ద కొన్ని నిమిషాలు సేదతారాలి. ఇలా చేస్తే వేడి నుండి కొంత మేర ఉపశమనం పొందవచ్చు.

శరీరంలో వేడి అధికంగా ఉంటే నాన్ వెజ్, స్పైసీ, జంక్ ఫుడ్ మరియు ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది. రోజు ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగాలి. గసగసాలు శరీరాన్ని చల్ల పరచడానికి బాగా పని చేస్తాయి. అలోవేరా శరీరానికి సహజ శీతలీకరణగా పనిచేస్తుంది. అంతర్గత మరియు బాహ్యంగా శరీర వేడిని తగ్గించే విషయంలో ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలోవేరా జెల్‌ను చర్మానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దోసకాయ లేదా పుదీనాతో కలబంద జెల్ ను మిక్స్ చేసి, మిశ్రమాన్ని తయారు చేసుకుని తాగాలి. ఇలా చేయటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.

గ్లాసు గోరువెచ్చని పాలలో కాస్త పచ్చ కర్పూరం తోపాటు యాలకుల పొడి, గసగసాల పొడి కలుపుకుని తాగితే శరీరంలో ఉన్న వేడి మొత్తం మాయమౌతుంది. వేడి స‌మ‌స్య ద‌రిచేర‌కూడ‌దంటే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. పుచ్చకాయ, కర్భూజా, ద్రాక్ష లాంటి పండ్లను తీసుకోవడం ద్వారా సులభంగా వేడిని తగ్గించుకోవచ్చు. కర్బూజా పండ్లకు చలవ చేసే గుణం అధికం. కర్బూజా పండు మందపాటి తోలు తీసేసి, చిన్న ముక్కలుగా తరిగి, పంచదార చల్లుకుని తింటే క్షణాలలో వేడి తగ్గుతుంది.

అరటి పళ్లు, పుచ్చకాయ, బయాపిల్, గసగసాలు, ఎండుద్రాక్ష, చలవచేసే వాటిలో చాలా ముఖ్యమైనవి. అలాగే ఎండు ఖర్జురం కూడా వేడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఒక మూడు లేదా నాలుగు ఎండు ఖర్జురాలను తీసుకుని రాత్రంతా శుభ్రమైన నీటిలో నానపెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే వేడి తగ్గుతుంది.