Surviving Winter : చలికాలంలో వాత, పిత్త , కఫ దోషాలను తగ్గించుకోవాలంటే?

చలికాలంలో కఫం పెరగకుండా నిరోధించుకోవాలి. ఇందుకుగాను జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయాయంలో మార్పులు చేసుకోవాలి. వీటి ద్వారా కఫ దోషాలను తగ్గించవచ్చు. రోజులో కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి.

Surviving Winter : చలికాలంలో వాత, పిత్త , కఫ దోషాలను తగ్గించుకోవాలంటే?

To reduce vata, pitta and kapha doshas in winter?

Surviving Winter : శీతాకాలం మనశరీరాన్ని పునరుత్తేజపరిచే రుతువు. జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో ఆకలి సైతం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆకలి పెరగటం కారణంగా అధిక మోతాదులో తినటం వల్ల జీర్ణ సమస్యలు అధికమవుతాయి. అరుగుదల తగ్గుతుంది. దీంతో జీర్ణశక్తితోపాటు, వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో  వాత, పిత్త, కఫ దోషాలు తలెత్తుతాయి.

వాత దోషం ; చల్లని వాతావరణం వాత దోషాన్ని పెంచుతుంది. పొడిగా, గరుకుగా ఉండే పదార్దాలు ఈ సమయంలో తీసుకోరాదు. ఉడికించిన , గోరు వెచ్చని పదార్దాలు మాత్రమే తీసుకోవాలి. స్నానికి ముందు నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనెతో మర్ధన చేసుకోవాలి. అన్ని రకాల తీపి పండ్లు తీసుకోవచ్చు. భోజనానికి , భోజనానానికి మధ్యస్త సమయంలో టీ తాగవచ్చు. ఉప్పు, తీపి, పులుపు తగుపాళ్లలో తీసుకోవచ్చు. సలాడ్లు , ఐస్ క్రీమ్ లు , పచ్చి కూరగాలయు తినటం మానేయాలి. వగరుగా ఉండే పచ్చి పండ్లు , కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోరాదు. బీట్ రూట్, క్యారెట్ , క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ, ఆకుకూరలు, పచ్చి బఠాణీ, బెంగుళూరు మిర్చి, బంగాళ దుంపలు , మొలకలు, టొమాటోలు తినాలి. బాగా మగ్గిన అరటి పండ్లు అవకాడో, అంజీర్, నారింజ, ద్రాక్ష, బొప్పాయి తీసుకోవచ్చు. ఓట్స్ , బియ్యం పెంచి, గోధుమలు, మొక్కజొన్న, సిరిధాన్యాలు తగ్గించాలి.

పిత్త దోషం ; పిత్త దోషం ఉన్నవారు చలికాలంలో కొన్ని ఆహారనియమాలు తప్పనిసరిగా పాటించాలి. మిగతా కాలల్లో కంటే ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు తీసుకోవచ్చు. యాలకులు, పుదీనా, కుంకుమపువ్వు, పసుపును వాడుకోవాలి. జీలక్ర, మిరియాలు, ధనియాలతో తయారైన కషాయాలు తీసుకుంటుండాలి. ఈ కాలంలో శరీరంలో వేడిని పెంచే పదార్ధాలు, పానీయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అరటిపళ్లు, ద్రాక్ష, దబ్బపండు, పైనాఫిల్, చింతపండు, ఉడికించిన పాలకూర, జున్ను, పుల్లని పెరుగు, పులిసిన పదార్ధాలు తినరాదు.

కఫ దోషం ; చలికాలంలో కఫం పెరగకుండా నిరోధించుకోవాలి. ఇందుకుగాను జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయాయంలో మార్పులు చేసుకోవాలి. వీటి ద్వారా కఫ దోషాలను తగ్గించవచ్చు. రోజులో కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి. యోగ, నడక, ఆటలు ఆడటం చేయాలి. సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి నోటిని, దంతాలను శుభ్రపరుచుకోవాలి. తీయని, చిక్కని, ఉప్పటి పదార్ధాలు కఫాన్ని పెంచుతాయి. పొడిగా ఉండి , తేలికగా జీర్ణమయ్యే పదార్దాలను తీసుకోవాలి. ఉదయం అల్పాహారంలో ఓట్స్, గోధుమలు, మొక్కజొన్న బార్లీ తీసుకోవచ్చు. అల్పాహారం తరువాత దాల్చిన చెక్క లవంగాలతో తయారైన కషాయం తాగాలి. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపేందుకు రోజు మొత్తం తరచుగా గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. , మధ్యాహ్నం భోజనంలో చపాతీ, అన్నం , కూరగాయలు, నెయ్యి తీసుకోవచ్చు. శీతాకాలంలో పాల ఉత్పత్తులకు తక్కువ తీసుకోవాలి. ఇవి కఫాన్ని పెంచుతాయి. తిన్న వెంటనే నిద్రపోరాదు. చల్లని నీళ్లు, శీతల పానీయాలు తాగరాదు.